ఆండ్రాయిడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆండ్రాయిడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

భారతదేశం నుండి అమెరికా,కెనడాలకు ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చు

సాదారణంగా మనం విదేశాలలో ఉన్న బందుమిత్రులతో మాట్లాడడానికి స్కైప్, వైబర్ మరియు హాంగ్‌అవుట్ వంటి నెట్ ఆధారిత సపాయాలను ఉపయోగిస్తాము. అయితే దీనికి అవతలి వారికి, మనకి ఆ అప్లికేషనులో నమోదు చేసుకోవాలి. గూగుల్ హాంగ్‌అవుట్ నుండి మరో గూగుల్ హాంగ్‌అవుట్ వాడుకరితో ప్రపంచంలో ఎక్కడి నుండి, ఎక్కడికైనా

గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

ఆండ్రాయిడ్ లాలిపప్ విడుదలచేసిన తరువాత గూగుల్ తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లన్ని కొత్త మెటీరియల్ డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. ఈ అప్లికేషన్‌లన్ని ఒకొక్కటిగా ప్లేస్టోర్ ద్వారా అందరికి అందుబాటులో రాబోతున్నాయి. ఉదాహరణకు రాబోయే జీమెయిల్ యాప్‌ ఒక్క జీమెయిల్ వాడుకోవడానికి మాత్రమే కాకుండా

ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా విజ్ఞానాన్ని పోగుచేయవచ్చు

లాభాపేక్షలేకుండా స్వచ్చందంగా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ప్రకటనలు లేకుండా అందించడానికి ఏర్పడిన ఆన్‌లైన్ వేధిక వికీపీడియా. ఇది ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగుతో పాటు మరెన్నో ప్రపంచభాషలలో సమాచారాన్ని మనకందిస్తుంది. ఈ మహాయజ్ఞంలో మనలాంటి సాధారణ పౌరులు వారి తీరిక సమయాన్ని వెచ్చించి సమాచారాన్ని

అమ్మ కాబోతున్న వారికి అమ్మ లాంటి అప్లికేషన్ "అమ్మ".

తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న  వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్)

నా ఫోన్‌కి ఎప్పుడు ఆండ్రాయిడ్ 5.0 అప్‌డేట్ వస్తుంది?

ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విడుదలైన తరువాత అందరు నా ఫోన్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చా, నా ఫోన్‌కి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వారి సందేహాలకు తీర్చడం కోసం ఈ పోస్టు రాయడం జరిగింది.

గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు

గూగుల్ మరియు మోటోరోలా ప్రతిష్టాత్మకంగా నెక్సస్ 6 ని నిన్న ఆండ్రాయిడ్ లాలిపప్ తో పాటు విడుదల చేసారు. దీనితో పాటు మరో రెండు నెక్సస్ పరికరాలు కూడా విడుదల కావడం విశేషం. మొదటిసారిగా మొటోరోలా గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరింది. భారతదేశంలో అధిక ప్రజధరణ పొందిన మోటో ఇ మరియు మోటో జి లతో ఫామ్‌లోకి

లాలిపప్‌తో విడుదలైన మూడు నెక్సస్ పరికరాలు

ఆండ్రాయిడ్ కొత్త వెర్షను 5.0 లాలిపప్ నిన్న విడుదలైంది. కొత్త వెర్షను విశేషాలు ఇక్కడ చూడవచ్చు. దానితోపాటు గూగుల్ మూడు కొత్త నెక్సస్ పరికరాలను కూడా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా జనాధరణ పొందిన ఈ గూగుల్ నెక్సస్ పరికరాలు మిగతా తయారీదారులకు ప్రమాణాలను నిర్ధేశించడానికా అన్నట్లు ఉంటాయి. అటువంటి నెక్సస్

ఆండ్రాయిడ్ కొత్త వెర్షను లాలిపప్ తెలుగుతో విడుదలైంది

ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క కిట్‌కాట్ (4.4) తరువాతి వెర్షను లాలిపప్ (5.0) విడుదలైనట్లు గూగుల్ ఇప్పుడే ప్రకటించింది. ఈ విడుదలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పుడు మనం తెలుగులో కూడా వాడుకోవచ్చు.

ఉచిత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్

సాధారణంగా చాలామంది వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఆర్ధిక లావాదేవీలను తమ కంప్యూటర్లలో చేసుకోవడానికి పేరుపొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ల యొక్క పైరేటెడ్ వెర్షనుని లేదా ట్రయిల్ వెర్షనులు వాడుతుంటారు. ఇటువంటి వారు పైరేటెడ్ సాఫ్ట్వేరు వాడకుండానే ఉచిత ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్లను వాడి తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. అలా

కంప్యూటరులో పనిచేసుకుంటూనే మన ఫోన్‌కి వచ్చిన కాల్ మరియు మెసేజిలను చూడవచ్చిలా

మనం కంప్యూటరులో పనిచేసుకుంటున్నపుడు ఏదైనా ఫోన్ లేదా మెసేజి మన ఫోన్ కి వచ్చిందంటే మనం చేస్తున్న పనిని ఆపి ఫోన్ చూడవలసివస్తుంది. ఆలా అవసరం లేకుండానే మన కంప్యూటరులోనే మనకు వచ్చిన ఫోన్ లేదా మెసేజి వివరాలు నోటిఫికేషన్‌గా చూపించబడాలంటే మన ఆండ్రాయిడ్ ఫోనులో ఈ చిన్న యాప్ ఉండవలసిందే. అదే పుష్‌బుల్లెట్.

ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు

ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఉపయోగపడే పలు రహస్య కోడ్లు క్రింద ఇవ్వబడినవి.
గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్‌ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.

తొందరలోనే భారత్‌లో యూట్యూబ్ వీడియోలు ఆఫ్‌లైన్‌లో చూడవచ్చంట

తక్కువ ధరలో నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు అందించే ఉద్దేశంతో భారత్‌లో విడుదలచేసిన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ఎయిర్ టెల్ తో కలిసి అప్‌డేట్లకి మరియు ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్లకి కూడా ఉచితంగా డాటాని ప్రారంభ పథకంగా ప్రకటించింది. దానితోపాటుగా సాధారణంగా మొబైళ్ళలో ఎక్కువ డాటా వీడియోలు చూడడంలో ఖర్చు అవుతుంది కనుక

తొందరలో భారత్‌ను ముంచెత్తనున్న మరిన్ని ఆండ్రాయిడ్ వన్ ఫోన్లు

ఎన్నడు లేనిది గూగుల్ తన కొత్త ఉత్పత్తిని మొదట భారత్‌లో విడుదలచేయడానికి కారణం దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలో మన దేశంలో గల అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న వివిధ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములు భారత దిగువ శ్రేణి ఫోన్ విపణిని లక్ష్యంగా చేసుకుని వస్తుండడంతో గూగుల్ అందరికన్నా

భారత్‌లో విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు

అపారమైన అవకాశాలుగల భారత దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ప్రవేశించింది. దేశియ ఫోన్ తయారీదారులయిన స్పైస్, మైక్రోమాక్స్ మరియు కార్బన్ లతో జట్టు కట్టి చవక (6500రూపాయలు) స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు విడుదలచేసింది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భారత్‌లోనే ఈ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను

ఈ ఆండ్రాయిడ్ వెబ్‌బ్రౌజర్ ఒక్కటే కానీ భాషలు 55

ప్రముఖ వెబ్‌బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ ఇప్పటికే తెలుగుతో పాటు 80 కి పైగా భాషలలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్‌సిస్టంలకు పలు భాషల్లో ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ లభిస్తుంది. మనకు కావల్సిన భాషలో ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌కి మాత్రం ఈ విధంగా పలు

ఆండ్రాయిడ్ పరికరాలకి లిబ్రేఆఫీస్ రాబోతుంది.

లిబ్రే ఆఫీస్ అనేది ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆఫీస్ సూట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న ఈ ఆఫీస్ సూట్ ఒపెన్ ఆఫీస్ నుండి ఆవిర్బవించింది. విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే లిబ్రే ఆఫీస్ తొందరలోనే ఆండ్రాయిడ్ పరికరాలలో కూడా పనిచేయబోతుంది. లిబ్రే ఆఫీసును ది డాక్యుమెంట్ ఫౌండేషన్ అన్న సంస్థ

మోటో జి రెండొవ తరం ఫోను విడుదలైంది.

జనాధరణ పొందిన మోటో జి ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో కొత్త వెర్షనుగా అందుబాటులోకి వచ్చింది. మోటో జి రెండో తరం ఫోనుగా వ్యవహరించే ఈ ఫోను ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలకి సిద్దంగా ఉంది. మోటోజి మొదటి వెర్షను అమ్మకాలు Mi3,లినోవో  మరియు ఆసుస్ ఫోన్‌ల దాటికి తగ్గడం మొదలుకాగానే ధర తగ్గించి అమ్మకాలు కొనసాగించి

మీ ఫోను తొందరగా చార్జింగ్ దిగిపోతుందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే.

సాధారణంగా స్మార్ట్ ఫోన్‌లు వాడేవారికి బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య తరచు ఎదురవుతుంటుంది. మనం ఫోన్ కొంటున్నపుడే తయారీదారు చెప్పినదానిపై ఆధారపడి కాకుండా బ్యాటరీ గురించి ఇప్పటికే ఫోన్‌ కొని వాడినవారిని అభిప్రాయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు

అసెంబుల్డ్ ఫోన్లు రాబోతున్నాయి

సాధారణంగా కంప్యూటరు కొనాలంటే చాలా మంది అసెంబుల్డ్ కంప్యూటర్ల వైపు మొగ్గుచూపుతుంటారు. ఎందుకంటే మనకు కావలసిన ధరలో మన అవసరానికి తగినట్టు విడిబాగాలను ఎంచుకొనే అవకాశం ఉంటుంది కనుక. అంతేకాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా పూర్తి కంప్యూటరును మార్చకుండానే చెడిపోయిన లేదా పెరిగిన అవసరానికి తగినట్టుగా ఒక