ప్రముఖ వెబ్‌బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ ఇప్పటికే తెలుగుతో పాటు 80 కి పైగా భాషలలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్‌సిస్టంలకు పలు భాషల్లో ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ లభిస్తుంది. మనకు కావల్సిన భాషలో ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌కి మాత్రం ఈ విధంగా పలు
భాషల్లో ఫైర్‌ఫాక్స్ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. కాని మనం ఆయా భాషల ఫైర్‌ఫాక్స్ apk ఫైల్‌ని దింపుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలా చేయడం వలన భాషకి ఒక బ్రౌజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. అయితే నిన్న విడుదలైన ఫైర్‌ఫాక్స్ 32.1 ఆండ్రాయిడ్ వెర్షనుతో 55 భాషలను ఒకే యాప్‌తో మనకు కావలసినపుడు ఏభాషకు కావాలంటే ఆ భాషకు మార్చుకొనే సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పటికే మనం ఫైర్‌ఫాక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే అప్‌డేట్ చేసుకొని సెట్టింగులలో భాషను మార్చుకోవడం ద్వారా తెలుగులో మొట్టమొదటి వెబ్‌బ్రౌజరును వాడుకోవచ్చు. ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజరును మీ ఆండ్రాయిడ్ పరికరంలో కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఈ ప్లేస్టోర్ లంకె నుండి దింపుకోవచ్చు. క్రింది చిత్రాలలో వలే మనం ఫైర్‌ఫాక్స్‌ని మనకు నచ్చిన భాషలో వాడుకోవచ్చు.