యమ్.ఎస్.ఆఫీస్ కి ఉచిత ప్రత్యామ్నాయాలు

ఆఫీస్ ప్రత్యామ్నాయాలలో మొదట చెప్పుకోవలసింది లిబ్రేఆఫీస్. ఇది పూర్తిగా ప్రజలచే, ప్రజల కొరకు తయారుచేయబడినది. ఓపెన్ సోర్స్ ప్రపంచం మద్దతు దీనికే. ఎటువంటి వాణిజ్య సంస్థల నియంత్రణ లేకుండా నడుస్తున్నది. అన్ని ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. ఉబుంటు మరియు కొన్ని లినక్స్ పంపకాలతో అప్రమేయంగా అందించబడుతుంది. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు
వాడేవారు క్రింది లింకు నుండి దించుకోవచ్చు.

మరో ప్రత్యామ్నాయం అందరికి తెలిసిన ఓపెన్ ఆఫీస్. ఈమధ్య కొంత వెనకబడ్డప్పటికీ వాణిజ్య ఆఫీస్ సూట్ లకి మొట్టమొదట ప్రత్యామ్నాయంగా ఒక వెలుగు వెలిగింది. లిబ్రే ఆఫీస్ దీని ఆధారంగానే రూపొందించినదే. అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. కొన్ని లినక్స్ పంపకాలతో అప్రమేయంగా అందించబడును. మిగిలిన ఆపరేటింగ్ సిస్టంలు వాడేవారు క్రింది లింకు నుండి దించుకోవచ్చు.

లిబ్రే ఆఫీస్ మరియు ఓపెన్ ఆఫీస్లు యమ్.ఎస్.ఆఫీస్ ప్రత్యామ్నాయాలుగా ఎక్కువగా వాడబడుతున్నాయి. ఇవికాకుండా మరెన్నో ఆఫీస్ సూట్లు మనకి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఇన్ స్టాల్ చేయకుండా నెట్ నుండి నేరుగా వాడుకునేవి కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: