ఆండ్రాయిడ్
ఫోన్లలో తెలుగులో టైప్ చెయ్యడానికి చాలా కీబోర్డులు ఉన్నప్పటికిని వాటిలో
వత్తులు, పొల్లులు టైప్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు
తెలుసుకోబోయే కీబోర్డ్ యాప్ ను ఉపయోగించి ఎవరైనా సులభంగా టకాటకా తెలుగులో
టైప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ తో డిఫాల్ట్‌గా వచ్చే
కీబోర్డ్ ని పోలిఉండి,
దానిలో వలే మెటీరియల్ మరియు హలో లైట్, డార్క్ థీంలు కలిగిఉండి ప్రతిభాషకు నాలుగైదు లేఅవుట్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత. మొత్తం 23 భారతీయ భాషలతో, 54 లేఅవుట్లతో లభించే ఈ కీబోర్డ్ యాప్ తెలుగుభాషకు వచ్చే సరికి 5 లేఅవుట్లతో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 మరియు దాని తరువాతి వెర్షనులలో పనిచేస్తుంది. ఒపెన్ సోర్స్ అప్లికేషను అయిన ఈ
కీబోర్డ్ యాప్ ని మనం ఉచితంగా ప్లేస్టోర్ నుండి దింపుకోవచ్చు.
కీబోర్డుని ఇన్‌స్టాల్ చేసిన తరువాత సెట్టింగ్స్ --లాంగ్వేజి
&ఇన్‌పుట్ లోకి వెళ్ళి అక్కడ ఇండిక్ కీబోర్డు ని టిక్ చేసుకోవాలి. ఆ
తరువాత ఏదైనా అప్లికేషనులో టైప్ చేయడానికి ప్రయత్నిస్తే నోటిఫికేషను
ఏరియాలో కీబోర్డు సింబల్ కనిపిస్తుంది. దానిని తాకినపుడు మనకు అందుబాటులో
ఉన్న కీబోర్డ్ లేఅవుట్లను చూపిస్తుంది. అపుడు మనం వాటినుండి ఇండిక్ కీబోర్డ్ ని
ఎంచుకుంటే ఇండిక్ కీబోర్డ్ వస్తుంది. భాషను మార్చుకోవడానికి ఇండిక్ కీబోర్డు
సెట్టింగులలోకి వెళ్ళి తెలుగు మరియు కావలసిన లేఅవుట్ (ఇన్ స్క్రిప్ట్,
ఫోనెటిక్) సెలెక్ట్ చేసుకోవాలి.
ఇన్‌డిక్ కీబోర్డ్ లో తెలుగు లేఔట్లు |