సులభంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోండి

నోట్ బుక్, లాప్ టాప్, ఫోన్, టాబ్లెట్, టీవి, కెమేరా మరియు డీవిడీ ప్లేయర్ వంటి పరికరాల వాడకం పెరగడం వలన మన వీడియోలను వివిధ పరికరాలకు తగినట్లు మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎటువంటి అనుభవం లేనివారు కూడా సులభంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఉచిత కన్వర్టర్ అరిస్టా ట్రాన్స్ కోడర్.
ఉబుంటులో ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

అరిస్టా ట్రాన్స్ కోడర్ యొక్క విశిష్టతలు:

  • వివిధ పరికరాలకి తగిన ప్రీసెట్లు అందుబాటులోఉండడం
  • లైవ్ ప్రివ్యు 
  • డీవిడీలను రిప్ చేయవచ్చు.
  • వెబ్, ఫ్లాష్ వీడియో మద్దతు
  • అప్రమేయంగా ప్రీసెట్లని అప్డేట్ చేసుకోవడం 
  • ప్రీసెట్లని సవరించుకోవచ్చు