ఆడియో వీడియో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆడియో వీడియో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచిత సాఫ్ట్‌వేరు

సాధారణంగా యూట్యూబ్ మరియు డైలీమోషన్ వంటి సైట్ల నుండి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి బ్రౌజర్ ప్లగిన్‌లను మరియు ట్రైల్ వెర్షను సాఫ్ట్‌వేర్లను వాడుతుంటాము. ఈ ట్రైల్ వెర్షను సాఫ్ట్వేర్లు యాడ్స్‌తో విసిగిస్తుంటాయి. యూట్యూబ్, డైలీమోషన్, విమియో, మెటాకేఫ్, యుకు, మైవీడియో, మైస్పాస్ మరియు క్లిప్‌ఫిష్ వంటి వీడియో షేరింగ్

వియల్సి ప్లేయర్ గురించి సరదా వీడియో

 వియల్సి ప్లేయర్ గురించి కంప్యూటర్ వాడేవారికి పరిచయం చెయనవసరం లేదు. ఎందుకంటే అంతగా ప్రసిధ్ది చెందినది ఈ ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్. దాని గురించిన ఒక సరదా వీడియో మీకోసం.

సులభంగా వాడదగ్గ వీడియో కన్వర్టర్

 విన్FF అనేది సులభంగా వాడదగ్గ వీడియో కన్వర్టర్. ఇది విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో వీడియోలను వివిధ పార్మాటులలోకి మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్వేర్. దీనిని ఉపయోగించి సులభంగా, వేగంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిలో సాధారణంగా ఉపయోగించే వీడియో ఫార్మాట్లకి సంబందించిన పలురకాల ప్రీసెట్లను కలిగిఉండును. వివిధ ఫార్మాట్లలో ఉన్న వీడియోలను ఒకేసారి ఒక ఫార్మాటులోకి మార్చుకోవచ్చు. 



ఫైల్ ఏదైనా కన్వర్టర్ ఒకటే

 వీడీయో, ఆడియో, ఇమేజ్ మరియు డాక్యుమెంట్ ఫైళ్ళను ఒక ఫార్మాట్ నుండి మరొక ఫార్మాట్ లోకి మార్చడానికి FF మల్టి కన్వర్టర్ ఉపయోగపడుతుంది. వివిధ ఫార్మాట్లలో గల ఫైళ్ళను ఒకే చోట సులభంగా ఒక ఫార్మాట్ నుండి మరొక ఫార్మాట్ లోకి మార్చడానికి ఇది తయారుచేయబడినది. FF మల్టి కన్వర్టర్ ఉచితంగా లభించు స్వేచ్ఛా సాఫ్ట్వేర్. 

 FF మల్టి కన్వర్టర్ తో మార్చుకోగల ఫైల్ ఫార్మాట్లు:


Audio/Video formats:
  • aac, ac3, afc, aiff, amr, asf, au, avi, dvd, flac, flv, mka, mkv, mmf, mov, mp3, mp4, mpg, ogg, ogv, psp, rm, spx, vob, wav, webm, wma, wmv
And any other format supported by ffmpeg.
Image formats:
  • bmp, cgm, dpx, emf, eps, fpx, gif, jbig, jng, jpeg, mrsid, p7, pdf, picon, png, ppm, psd, rad, tga, tif, webp, xpm
Document file formats:
  • doc -> odt, pdf
  • html -> odt
  • odp -> pdf, ppt
  • ods -> pdf
  • odt -> doc, html, pdf, rtf, sxw, txt, xml
  • ppt -> odp
  • rtf -> odt
  • sdw -> odt
  • sxw -> odt
  • txt -> odt
  • xls -> ods
  • xml -> doc, odt, pdf

 ఉబుంటులో FF మల్టి కన్వర్టర్ ఇన్ స్టాల్ చేయువిధానము:


 ఉబుంటు టెర్మినల్ నందు క్రింద ఇవ్వబడిన మూడు కమాండ్లను ఒకదాని తరువాత ఒకటి రన్ చేయడం ద్వారా FF మల్టి కన్వర్టర్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
sudo add-apt-repository ppa:ffmulticonverter/stable

sudo apt-get update

sudo apt-get install ffmulticonverter

మీ కంప్యూటరులో సంపూర్ణమైన మీడియా సెంటర్ అనుభవం కోసం

 మీ కంప్యూటరుని సంపూర్ణమైన మీడియా సెంటర్ గా మార్చుకోవాలంటే మీరు తప్పనిసరిగా XBMC మీడియా సెంటర్ ని ఇన్ స్టాల్ చేసుకోవలసిందే. XBMC మీడియా సెంటర్ ఉచితంగా లభించే స్వేచ్ఛా సాఫ్ట్వేర్. ఇది లాభాపేక్ష లేని కార్యకర్తల సమూహంచే స్వచ్ఛందంగా అభివృధ్ది చేయబడినది. వాణిజ్య మీడియా సెంటర్ సాఫ్ట్వేర్లు కూడా దీని ముందు దిగదుడుపే. అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టములలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అన్ని రకాల మీడియా ఫార్మాట్లకు మద్దతు గలదు. సంగీతం, సినిమాలు మరియు ఫొటోలను వివిధ మూలాల నుండి(రిమూవబుల్ మీడీయా, హార్డ్ డిస్క్, నెట్ వర్క్) చూడవచ్చు. మన పనులు సులభతరం చేయడానికి వివిధ రకాల యాడ్ ఆన్ లను కూడా జతచేసుకోవచ్చు.




డివిడిలు రిప్, విడియోలు కన్వర్ట్ చేయడానికి

 డివిడిలు రిప్ చేయడానికి, విడియోలు కన్వర్ట్ చేయడానికి హేండ్ బ్రేక్ అనే ఉచిత స్వేచ్చా సాప్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇది విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల పై పనిచేస్తుంది.దీనిని ఉపయోగించి సీడీ, డివిడి మరియు బ్లూరే డిస్కులు రిప్ చేసుకోవచ్చు.అంతేకాకుండా ఐఫోన్, ఆపిల్ టీవి, ఐపాడ్, ఆండ్రాయిడ్ మరియు నోకియా ఫోన్లకు సరిపడు విధంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవచ్చు.



ఉబుంటు వాడువారు క్రింద ఇవ్వబడిన రెండు కమాండ్లను టెర్మినల్ నందు రన్ చెయ్యడం ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
sudo add-apt-repository ppa:stebbins/handbrake-releases

sudo apt-get update && sudo apt-get install handbrake-gtk

లేదా ఇక్కడ నుండి మన ఉబుంటు వెర్షనుకి తగిన .deb ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. విండోస్, మాక్ మరియు ఇతర లినక్స్ ఆపరేటింగ్ సిస్టములు వాడుతున్నవారు ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆడియో,వీడియో ఫైళ్ళు ప్లే చేయడానికి

 సాధారణంగా విండోస్ లో మాత్రమే అన్ని రకాల ఆడియో,వీడియో ఫైళ్ళు ప్లే అవుతాయి ఉబుంటు మరియు మిగిలిన లినక్సు పంపకాలలో ప్లే కావు అని అనుకోవడం వలన ఉబుంటు లాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు వాడడానికి వెనకాడతారు.కానీ అది అపోహ మాత్రమే.చక్కగా మనం అన్నిరకాల ఆడియో మరియు వీడియోలు వినవచ్చు, చూడవచ్చు.
 విండోస్ ఇన్ స్టాల్ చేయగానే mp3,విండోస్ మీడియా ఫార్మాట్ లో ఉన్న ఫైళ్ళు మాత్రమే ప్లే అవడం,తరువాత కోడెక్ పేక్ ఇన్ స్టాల్ చేసుకోవడం వలన మిగిలిన ఫార్మాట్ లు(.mkv,.mp4,.avi) కూడా ప్లే కావడం మనం గమనించవచ్చు.అదే విధంగా లినక్సు ఆదారిత ఆపరేటింగ్ సిస్టంలలో కూడా ఇన్ స్టాల్ చేయగానే ఓపెన్ మీడియా ఫార్మాట్ లో ఉన్న ఫైళ్ళు(.ogg) ప్లే అవుతాయి.విండోస్ లో మాదిరిగానే అదనపు కోడెక్ లు ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఫార్మాట్ లు కూడా ప్లే చేసుకోవచ్చు.కోడెక్ ల కోసం వెతికే అవసరం లేకుండా నేరుగా ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ ని తెరిచి సెర్చ్ బాక్స్ లో Ubuntu restricted  extras అని టైపు చేసినపుడు క్రింది చిత్రంలో వలే Ubuntu restricted  extras అన్న సాప్ట్వేర్ కనిపించును.దానిని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మనం అన్నిరకాల ఆడియో,వీడియో ఫైళ్ళు ప్లే చేసుకోవచ్చు.

తెలుగులో తొలి పూర్తి ఒపెన్ సోర్స్ వీడియో ట్యుటోరియల్

సాధారణంగా ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టాల్ చేసిన తరువాత డ్రైవర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మన కంప్యుటర్ కి సంబందించిన అన్ని రకాల డివైస్ పనిచేస్తాయి. కానీ ఉబుంటులో ఎటువంటి డ్రైవర్లను ఇన్స్టాల్ చేయనవసరం లేకుండానే అన్ని రకాల డివైస్ పనిచేస్తాయి. దానికి కారణం లినక్స్ కర్నెలులో అనేక డివైస్ సంబందించిన డ్రైవర్లను పొందుపరచడి

మీ డెస్క్ టాప్ ని వీడియో తీయడానికి

మనం ఏదైనా సాఫ్ట్వేర్ వాడే విధానం గురించి ఇతరులకి తెలియచేయడానికి పాఠ్యరూపంలో వివరించడం లేదా దాని యొక్క చిత్రాన్ని (స్క్రీన్ షాట్) లను చూపించడం ద్వారా వారికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము. ఇంకాసులభంగా అర్ధమవడానికి వీడియో రూపంలో కూడా వివరించవచ్చు. ఈమధ్య ఈవిధానం బాగా ప్రాచుర్యం

వెబ్ కాం డ్రైవర్ల కోసం వెతుకుతున్నారా?

ఉబుంటులో వెబ్ కాం డ్రైవర్ల కోసం వెతకనవసరం లేదు. చాల వెబ్ కాంలు ఎటువంటి డ్రైవర్లు ఇన్స్టాల్ చేయకుండానే పనిచేస్తాయి. మనం చేయవలసిందల్లా ఏదైనా వెబ్ కాం బూత్ సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేసుకోవడామే. ఉబుంటు మరియు మిగిలిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో చాలా వెబ్ కాం బూత్ సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికి చీజ్ అను ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ బాగా

సులభంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోండి

నోట్ బుక్, లాప్ టాప్, ఫోన్, టాబ్లెట్, టీవి, కెమేరా మరియు డీవిడీ ప్లేయర్ వంటి పరికరాల వాడకం పెరగడం వలన మన వీడియోలను వివిధ పరికరాలకు తగినట్లు మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎటువంటి అనుభవం లేనివారు కూడా సులభంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఉచిత కన్వర్టర్ అరిస్టా ట్రాన్స్ కోడర్.

అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్ళు ప్లే చేయడానికి

సాధారణంగా విండోస్లో మాత్రమే అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్ళు ప్లే అవుతాయి ఉబుంటు మరియు మిగిలిన లినక్సు పంపకాలలో ప్లే కావు అని అనుకోవడం వలన ఉబుంటు లాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు వాడడానికి వెనకాడతారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కగా మనం అన్నిరకాల ఆడియో మరియు వీడియోలు వినవచ్చు, చూడవచ్చు.

మీ డీవీడీ ప్లేయర్ కి తగిన వీడియో డిస్కులు మీకు నచ్చిన విధంగా సులభంగా తయారుచేసుకోవడానికి

మనదగ్గర ఉన్న వీడియోలు ఏ ఫార్మాట్ లో ఉన్నా కూడా మన డీవీడీ ప్లేయర్ లో ప్లే అయ్యే విధంగా, మనకు నచ్చిన విధంగా వీడియో డిస్కులు తయారుచేయడానికి DeVeDe అను ఓపెన్ సోర్స్ అప్లికేషన్ ని వాడవచ్చు. దీనిని ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ వాడేవారు ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఉబుంటులో టీవి

కంప్యూటర్ లో టీవి చూడడానికి టీవి ట్యునర్ కార్డ్స్(ఇన్ టర్నల్/ఎక్స్ టర్నల్) ఉపయోగిస్తుంటాము. టీవి ట్యునర్ కార్డ్ కంప్యూటర్ కి అమర్చినతరువాత దానితో పాటు వచ్చిన డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసి టీవి చూడవచ్చు. టీవి ట్యునర్ కార్డ్ తో వచ్చిన సిడిలో విండోస్ కి కావలసిన డ్రైవర్స్ మాత్రమే ఉంటాయి. మరి ఉబుంటు మరియు వేరె లినక్స్ పంపకాలు వాడేవారిపరిస్థితి ఏంటి?