సాధారణంగా ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టాల్ చేసిన తరువాత డ్రైవర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మన కంప్యుటర్ కి సంబందించిన అన్ని రకాల డివైస్
పనిచేస్తాయి. కానీ ఉబుంటులో ఎటువంటి డ్రైవర్లను ఇన్స్టాల్ చేయనవసరం
లేకుండానే అన్ని రకాల డివైస్ పనిచేస్తాయి. దానికి కారణం లినక్స్ కర్నెలులో
అనేక డివైస్ సంబందించిన డ్రైవర్లను పొందుపరచడి
ఉండడమే. నేను చాల లాప్ టాప్
లలో మరియు అసెంబుల్డ్ డెస్క్ టాప్ లలో కూడా స్వయంగా ఇన్ స్టాల్ చేసాను.
ఎటువంటి డ్రైవర్లు ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే అన్ని డివైస్లు
పనిచేసాయి.ఎప్పుడు డ్రైవర్ల సమస్య రాలేదు. ఒకొక్కసారి పాత కంప్యూటర్లకి విండోస్ డ్రైవర్లు దొరకనపుడు ఉబుంటు ఇన్స్టాల్ చేయడం ద్వారా డ్రైవర్ల
వేటని ముగించవచ్చు. ఒకసారి మా స్నేహితుని విండోస్ కంప్యూటర్లో ధ్వని
రాలేదు. అప్పుడు తిరిగి విండోస్ తాజాగా ఇన్స్టాల్ చేసి ఇంటెల్ సైటు నుండి
తాజా డ్రైవర్లను దింపుకుని ఇన్ స్టాల్ చేసినప్పటికి ,గూగుల్ లో వెతికి చాలా
రకాల ప్రయత్నొచినప్పటికి మా స్నేహితుని విండోస్ కంప్యూటర్లో ధ్వని రాలేదు.
అపుడు ఉబుంటు సీడి నుండి బూట్ అవగా నేరుగా సౌండ్ వచ్చింది. ఈ ఒక్క సంఘటన
నాలో చాల అపోహలను దూరం చేసింది.