లిబ్రే ఆఫీస్ అనేది ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆఫీస్ సూట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న ఈ ఆఫీస్ సూట్ ఒపెన్ ఆఫీస్ నుండి ఆవిర్బవించింది. విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే లిబ్రే ఆఫీస్ తొందరలోనే ఆండ్రాయిడ్ పరికరాలలో కూడా పనిచేయబోతుంది. లిబ్రే ఆఫీసును ది డాక్యుమెంట్ ఫౌండేషన్ అన్న సంస్థ
తయారుచేస్తుంది. ఉచిత డాక్యుమెంట్ ఫార్మాటును(odt,ods) ఆండ్రాయిడ్ పరికరాలలో పూర్తి స్థాయిలో చదవడానికి, మార్పులు చేయడానికి సరైన అప్లికేషన్‌లు లేని లోటును ఈ లిబ్రేఆఫీస్ ఫర్ ఆండ్రాయిడ్ తీర్చుతుంది. ఫిభ్రవరి 2015 లో అందుబాటులోకి వస్తుందని డాక్యుమెంట్ ఫౌండేషన్ వారు ప్రకటించారు.

ప్లే స్టోర్ లో పెట్టడానికి అప్లికేషను పరిమాణం 50 యంబికి మించకుండా ఉండాలి అన్న నిబంధనని అధికమించడానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు 61 యంబి గా ఉన్న లిబ్రే ఆఫీస్ 4 ఆండ్రాయిడ్ యాప్ ని మనం ఇప్పుడే మన ఆండ్రాయిడ్ పరికరాలలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కాని అభివృద్ది దశలో ఉన్న ఈ యాప్ ఇంకా చాలా మెరుగుపడాల్సిఉంది. ఈ యాప్ ని పరిక్షించాలనుకునేవారు ఇక్కడ నుండి రోజువారి విడుదల యొక్క ఎపికే ఫైల్ ని దింపుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.