మన రాష్ట్రంలో ప్రభుత్వం కంప్యూటర్ విధ్యను వాణిజ్య సాఫ్ట్వేర్లతో అందిస్తుంది. ఒక
కంప్యూటర్ను కొనటానికయ్యే ఖర్చుతో సమాంతరంగా సాఫ్ట్వేర్ కొనటానికి కూడా
ఖర్చు కావడం వలన ప్రభుత్వ వ్యయంలో సగానికి సగం కేవలం సాఫ్ట్వేర్
కొనటానికి ఖర్చవుతున్నది. ఇలా సాఫ్ట్వేర్ల కోసం కోట్ల విలువైన ప్రజాధనం వృధా అవుతుంది. వీటి నిర్వహణను కొందరు గుత్తేదారులకు అప్పగించి
వారికి డబ్బును చెల్లిస్తున్నది. అక్కడ టీచర్లుగా పని
చేస్తున్న వారికి జీత బత్యాలు సైతం సరిగా ఇవ్వట్లేదు, ఇస్తున్నవి కూడా మరీ
తక్కువగా ఉన్నాయి. అందువలన వారు తరచుగా సమ్మె చేయడం కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా వాణిజ్య సాఫ్ట్వేర్ల స్థానంలో స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను ఉపయోగించి విలువైన ప్రజాధనం వృధా కాకుండా చేయవచ్చు. సాఫ్ట్వేర్ల కొరకు ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయిల
వ్యయాన్ని ఉపాధి కల్పనకు కంప్యుటర్ టీచర్ల జీత భత్యాలకొరకు ఖర్చు చేస్తే బాగుంటుంది. ఈ పద్దతిని అభివృద్ది చెందిన దేశాలైన జర్మనీ,ఫ్రాన్సు, అభివృద్ది
చెందుతున్న దేశాలయిన బ్రెజిల్, వెనిజూలా, చైనా వంటి దేశాలే అమలు
చేస్తున్నాపుడు, నిత్యం నిధుల కొరతతో సతమవుతున్న మన దేశ,రాష్ట్రా ప్రభుత్వాలు ఎందుకు అమలు జరపలేక పోతున్నాయన్నదే సందేహం.