మీ ఫోను తొందరగా చార్జింగ్ దిగిపోతుందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే.

సాధారణంగా స్మార్ట్ ఫోన్‌లు వాడేవారికి బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య తరచు ఎదురవుతుంటుంది. మనం ఫోన్ కొంటున్నపుడే తయారీదారు చెప్పినదానిపై ఆధారపడి కాకుండా బ్యాటరీ గురించి ఇప్పటికే ఫోన్‌ కొని వాడినవారిని అభిప్రాయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు
వాడుతుంటారు. అవి వాడడం వలన బ్యాటరీ సామర్ధ్యం పెద్దగా మార్పు ఏమి లేకపోవడం మనం గమనించవచ్చు. అలాగే కొన్ని అప్లికేషన్‌లు అయితే బ్యాటరీ మెరుగుపరచడం మాట దేవుడెరుగు బ్యాటరీ ఇంకా తొందరగా దిగిపోతుంటుంది. ఏటువంటి అధనపు అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే సులువైన చిట్కాలను పాటించడం ద్వారా మనం బ్యాటరీని ఆధా చేసుకోవచ్చు. 


మొదట మనం చేయవలసినది ఏ అప్లికేషన్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుకుంటున్నాయో చూసి అవి మనకు అవసరం లేదనుకుంటే తీసివేయడం. సెట్టింగ్స్ లో బ్యాటరీ లోకి వెళితే మనం ఏ అప్లికేషన్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుకుంటున్నాయో చూడవచ్చు. ఫోను డిఫాల్ట్ అప్లికేషన్‌లు కాకుండా వేరే అప్లికేషన్‌లు బ్యాటరీని వాడకంలో చూపించకపోతే మనం చేయవలసింది ఏమి ఉండదు.


సాధారణంగా ఫోనులో బ్యాటరీని ఎక్కువగా వాడుకొనేది స్క్రీన్. తెర వెలుగును ఆటోలో పెట్టడం ద్వారా కొంత, మనకు చూడడానికి ఇబ్బంది లేకుండా మరింత తక్కువ వెలుగును పెట్టుకోవడం ద్వారా మరింత బ్యాటరీ ఆధా చేయవచ్చు. AMOLED డిస్‌ప్లే కలిగిఉన్న ఫోన్‌లలో (సాధారణంగా సాంసంగ్ ఫోన్‌లు ఈ డిస్‌ప్లేతో వస్తాయి) నలుపు రంగు ఎక్కువగా ఉండే వాల్‌పేపర్లు, థీమ్‌లు వాడతున్నపుడు మామూలు కన్నా తక్కువగా బ్యాటరీ ఖర్చు అవుతుంది.
తెర తరువాత ఫోన్ బ్యాటరీని ఎక్కువ వాడుకొనేవి మన ఫోన్‌లో ఉన్న డివైజ్‌లు. అవసరం లేనప్పుడు మొబైల్ నెట్‌వర్క్, వైఫి, బ్లూటూత్, జిపియస్, యన్‌ఎఫ్‌సి(లొకేషన్ సర్వీస్) మరియు ఆటోరొటేషన్ అపిఉంచడం వలన బ్యాటరీ సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.


అనవసర అప్లికేషన్‌లు తొలగించడం, నిరంతరం వెనుక నడుస్తుండే అప్లికేషన్‌లు సంఖ్య తగ్గించడం వలన, నెట్వర్క్ సెట్టింగులలో రెస్ట్రిక్ట్ బ్యాక్‌గౌండ్ డాటాని ఎంచుకోవడం, ఆటో సింక్రనైజేషన్ అవసరంలేనపుడు ఆపిఉంచడం వలన కూడా బ్యాటరీ సామర్ధ్యం మెరుగుపడుతుంది.
హోం స్క్రీన్ పై ఎక్కువ విడ్జెట్‌లు ఉండడం మరియు ఎక్కువ హోం స్క్రీన్‌లు ఉండడం కూడా బ్యాటరీని ప్రభావితం చేస్తుంది. కనుక అవసరంలేని విడ్జెట్లు, హోం స్క్రీన్‌లను తొలగించడం వలన బ్యాటరీని అధా చెయ్యవచ్చు.

                   
మనం ఫ్లేస్టోర్ నుండి అప్లికేషన్‌లను ఇంస్టాల్ చేసినపుడు డిఫాల్ట్ గా హోం స్ర్కీన్ పై విడ్జెట్లు వస్తాయి. ఈ విధంగా హోం స్ర్కీన్ పై అనవసరపు వెడ్జెట్ల సంఖ్య పెరిగిపోతుంది. ఆలా జరక్కుండా క్రింది చిత్రంలో చూపించిన ప్లే స్టోర్ సెట్టింగ్ ని మార్చుకోవడం ద్వారా చేయవచ్చు.


అవసరం లేదనుకుంటే కీబోర్డ్, టచ్ వైబ్రేషన్‌, సౌండ్ లను తీసివేయడం ద్వారా, నోటిఫికేషన్ వైబ్రేషన్‌ ఆపివేయడం ద్వారా కొంత బ్యాటరీ అధా చేయవచ్చు.


లైవ్ వాల్‌పేపర్లు కూడా బ్యాటరీని బాగా తింటాయి కనుక మామూలు చిత్రాన్ని వాల్ పేపర్ గా పెట్టుకోవడం మంచిది.


             
డెవలపర్ ఆప్షన్లలో ఉన్న యానిమేషన్‌లను తగ్గించడం లేదా ఆపివేయడం వలన కూడా బ్యాటరీని కొంత వరకు అధా చేయవచ్చు.


ఆండ్రాయిడ్ పరికరాల్లో బ్యాటరీ సామర్ధ్యన్ని మెరుగుపరచడానికి గూగుల్ చేపట్టిన ప్రాజెక్ట్ ఒల్టా వలన ఈ మధ్య విడుదలైన ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో బ్యాటరీ నిలిచి ఉండే సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడింది కనుక మీ ఫోన్‌కి అప్‌డేట్ విడుదలైతే తప్పక అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

డెవలపర్లు అప్లికేషన్‌ల పనితీరు మెరుగుపరుస్తు నిరంతరం కొత్త వెర్షన్‌లను విడుదలచేస్తుంటారు కనుక మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అప్లికేషన్‌లను కూడా ఎప్పుడు అప్డేట్‌గా ఉంచుకోవాలి.

ఫోన్ తో వచ్చిన సాఫ్ట్‌వేర్ కంటే ఆండ్రాయిడ్ కస్టమ్‌ రామ్‌ సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడడం నా ఫోన్‌ లో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కనుక మీ ఫోన్ కి సైనోజెన్ మోడ్ అధికారిక మద్దతు ఉండి, వారెంటీ గడువు ముగిసిపోతే సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.