ఉబుంటు ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత హార్డ్ డిస్క్ లో మిగిలిన కాళి స్థలాన్ని పార్టిషన్ చేసుకోవాలి. ఉబుంటు తో వచ్చే డిస్క్ యుటిలిటి ద్వారా మనం ఆ పని చెయవచ్చు. ఉబుంటు డెస్క్ టాప్ లాంచర్ నందు గల ఉబుంటు ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా డాష్ తెరవబడును. డాష్ నందు గల సెర్చ్ లో D అని ఇవ్వగానే క్రింది విధంగా ఇన్ స్టాల్ అయిన
అప్లికేషనులు చూపించబడును. డిస్క్ యుటిలిటి ఐకాన్ క్లిక్ చేయగానే డిస్క్ యుటిలిటి తెరవబడును.
అప్లికేషనులు చూపించబడును. డిస్క్ యుటిలిటి ఐకాన్ క్లిక్ చేయగానే డిస్క్ యుటిలిటి తెరవబడును.
ఉబుంటు యునిటి డాష్:సులభం గా అప్లికేషన్స్,ఫైల్స్ వెదకడానికి |
డిస్క్ యుటిలిటి |
హార్డ్ డిస్క్ కాళి స్థలాన్ని క్లిక్ చెసి Create Partition క్లిక్ చేయడం ద్వారా క్రింద చూపించబడిన విండో తెరవబడును. ఇక్కడ మనకు కావలసిన పార్టిషన్ పరిమాణం, ఫైల్ సిస్టం రకాన్నిమరియు డిస్క్ పేరు ఇచ్చి Create నొక్కడం ద్వారా పార్టిషన్ ని తయారుచేయవచ్చు.
పార్టిషన్ లని తయారుచేసుకొన్నతరువాత ఈవిధంగా కనిపించును |
ఈవిధంగా పార్టిషన్ లని తయారుచేసుకొన్నతరువాత ఆ పార్టిషన్ లు ఫైల్ మెనేజర్ నందు చూపించబడుతాయి. అక్కడ నుండి మనం ఫైల్ ని దాచుకోవడం, కాపీ మరియు తొలగించడం చేయవచ్చు.