ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్షను విడుదలైంది

 ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు మనకి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క సరికొత్త వెర్షను ఇపుడు మనకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
 
 ఇంచుమించు అన్ని రకాలైన డెస్క్‌టాప్ మరియు లాప్‌టాప్ కంప్యూటర్లలో పనిచేసే ఈ ఆపరేటింగ్ సిస్టం మనం ఒక సారి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు ఎన్ని కంప్యూటర్లలో అయినా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్‌స్టాల్ చేయకుండానే నేరుగా పెన్‌డ్రైవ్ లేదా డివిడి నుండి కూడా వాడుకోవచ్చు. సరికొత్త వెర్షను ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లతో వస్తున్న ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టమును చట్టబద్దంగానే మనం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఎన్ని కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసినప్పటికి జెన్యూన్ మెసేజిలతో విసిగించకపోవడమే కాకుండా నిరంతరాయంగా కొత్త అప్‌డేట్స్ కూడా పొందవచ్చును. మరెందుకు ఆలస్యం క్రింది లంకె నుండి దింపుకోండి.


 వేగవంతమైన నెట్ అనుసంధానం లేనివారు కూడా దింపుకోవడానికి వీలుగా ఇక్కడ టొరెంట్ డౌంలోడ్ లంకెలు ఇవ్వడినవి.

 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం వాడేవారి అభిరుచులను మరియు అవసరాలను బట్టి పలురూపాలలో అందుబాటులో ఉంది. వాటిని కూడా మనం ఉచితంగా క్రింది లంకెల నుండి దింపుకోవచ్చు.