ఉచిత సాఫ్ట్‌వేర్లు

ఈ ఉచిత సాఫ్ట్వేర్లు పేజిలో డబ్బులు పెట్టి కొనే ప్రముఖ వాణిజ్య సాఫ్ట్‌వేర్లకు ప్రత్యామ్నాయమైన ఉచిత ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ల డౌన్‌లోడ్‌ లంకెలను లభించును. అన్ని ఆపరేటింగ్ సిస్టములలో పనిచేసే ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి. ఇక్కడ ఇవ్వబడిన సాఫ్ట్‌వేర్లు చట్టబద్దంగా ఉచితంగా లభించును. కనుక ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాణిజ్య సాఫ్ట్‌వేర్ల ట్రయల్, పైరేటెడ్, కీ, యాక్టివేటర్లు మరియు క్రాక్‌లు లభించవు.


లిబ్రేఆఫీస్: ఖరీదైన ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌కి ఉచిత  ప్రత్యామ్నాయం ఈ లిబ్రేఆఫీస్. చురుగ్గా అభివృద్ది చేయబడుతున్న ఈ ఉచిత ఆఫీస్ సూట్‌ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడడమే కాకుండా పేరుపొందిన సంస్థలు కూడా దీన్ని వాడుతున్నాయి. లిబ్రేఆఫీస్ దింపుకొ

డయా:  డయాగ్రాములు,ఫ్లోచార్టులు గీయడానికి ఉచిత స్వేచ్చా అనువర్తనము డయా.దీనిని మైక్రోసాఫ్ట్ విసియోకి చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. డయా దింపుకొ

స్రైబస్: డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌కి కావలసిన అన్ని హంగులు ఉన్న స్రైబస్ ఖరీదైన పేజిమేకర్ సాఫ్ట్‌వేర్‌కి ఉచిత ప్రత్యామ్నాయం. స్రైబస్ దింపుకొ

కలిబ్రే: ఉచిత ఒపెన్‌సోర్స్ ఇబుక్ రీడర్ మరియు ఇబుక్ లైబ్రరీ మేనేజిమెంట్ సాఫ్ట్వేర్ అయిన కలిబ్రే ముందు వాణిజ్య సాఫ్ట్‌వేర్లు కూడా దిగదుడుపే. కలిబ్రే దింపుకొ

బ్లెండర్: బ్లెండర్ అనేది ఉచిత ఒపెన్ సోర్స్ 3డి యానిమేషన్ సాఫ్ట్‌వేరు. దీనిని ఉపయోగించి యానిమేషన్ చిత్రాలను తయారుచేయవచ్చు. బ్లెండర్ దింపుకొ

ఇంక్‌స్కేప్: అత్యంత నాణ్యతతో కూడిన వెక్టార్ గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేరు అయిన ఇంక్‌స్కేప్‌ని ఉపయోగించి ఐకాన్లు, లోగోలు, డయాగ్రాములు మరియు వెబ్‌ గ్రాఫిక్స్ తయారుచేయవచ్చు. ఇంక్‌స్కేప్‌ దింపుకొ

గింప్: ఫోటోషాప్‌కి ఉచిత ప్రత్యమ్నాయం ఈ గ్నూ ఇమేజ్‌ మానిప్లేషన్ ప్రోగ్రాం. గింప్ దింపుకొ

గింప్‌షాప్: ఫొటోషాప్‌కి అలవాటయినవారు సులభంగా వాడుకోవడానికి ఈ గింప్‌షాప్. గింప్‌షాప్ దింపుకొ

రాథెరపీ: ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్. రాథెరపీ దింపుకొ

ఫైర్‌ఫాక్స్: ప్రపంచ ఉత్తమ వెబ్ బ్రౌజర్ అయిన ఫైర్‌ఫాక్స్ వాడుకరి భద్రత మరియు గోప్యతలకు ప్రాధాన్యతనిస్తునే అధునికమైన సౌకర్యాలను, యాడాన్‌లతో నచ్చినట్లు మార్చుకొనే వెసులుబాటును అందిస్తుంది. అంతేకాకుండా పలుభాషలలో లభిస్తుంది. ఫైర్‌ఫాక్స్ దింపుకొ

తండర్‌బర్డ్: ఆఫీస్ సూట్‌తో వచ్చే అవుట్‌లుక్‌కి ఉచిత ప్రత్యామ్నాయం. దీనిని మెయిల్ క్లయింట్‌గాను, పీడ్‌ మరియు వార్తలను చదవడానికియోగించుకోవచ్చు. తండర్‌బర్డ్ దింపుకొ

వియల్‌సి మీడియా ప్లేయర్: అందరిక్ సుపరిచితమైన ఈ వీడియో ప్లేయర్ అన్ని మీడియా ఫార్మాట్లను ఆడించగలదు. వియల్‌సి దింపుకొ

హెండ్‌బ్రేక్: హెండ్‌బ్రేక్ అనేది ఒపెన్‌సోర్స్ వీడియో ట్రాన్స్‌కోడర్. దీనిని ఉపయోగించి వీడియోలను ఇంచుమించు అన్ని ఫార్మాట్లలోకి మార్చుకోవచ్చు. హెండ్‌బ్రేక్ దింపుకొ

మీడియా ప్లేయర్ క్లాసిక్ హోం సినిమా: విండోస్ మీడియా ప్లేయర్‌కి తేలికైన ఉచిత ప్రత్యామ్నాయం. అన్నిరకాలయిన ఫార్మాట్లను ఆడిస్తుంది. మీడియా ప్లేయర్ క్లాసిక్ హోం సినిమా దింపుకొ

మీరో: మీరో ఉచిత ఒపెన్‌సోర్స్ వీడియో డౌన్‌లోడర్ మరియు ప్లేయర్. అంతేకాకుండా టొరెంట్ డౌన్‌లోడ్, వీడియో కన్వర్టర్ వంటి మరిన్ని అధనపు హంగులు దీని సొంతం. మీరో దింపుకొ

మీరో వీడియో కన్వర్టర్: ఏ వీడియో నైనా మనకు కావలసిన పరికరానికి అనుగుణంగా మార్చే సులభమైన ఉచిత ఒపెన్‌సోర్స్ కన్వర్టర్. మీరో వీడియో కన్వర్టర్ దింపుకొ

నోట్‌పాడ్++: విండోస్‌తో వచ్చే నోట్‌పాడ్‌కి అద్బుతమైన ప్రత్యామ్నాయం. నోట్‌పాడ్++ దింపుకో

వర్చువల్‌బాక్స్: మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంని మార్చకుండానే దానిలోనే వివిధ ఆపరేటింగ్ సిస్టములను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఉపయోగపడు ఈ వర్చువల్‌బాక్స్ నిజంగా ఒక అద్బుతం. వర్చువల్‌బాక్స్ దింపుకొ

పిడ్జిన్: ఇది యూనివర్సల్ చాట్‌ క్లయింట్. దీనిని ఉపయోగించి అన్ని చాటింగ్ క్లయింట్లను ఇన్‌స్టాల్ చేసుకోనక్కరలేకుండానే గూగుల్, యాహూ, యమ్‌యస్‌యన్ నంటి పలురకాల చాట్ సర్వీసులను ఒకేసారి వాడుకోవచ్చు. పిడ్జిన్ దింపుకొ

కొడి: కంప్యూటరు, మొబైల్ లో సంపూర్ణమైన మీడియా సెంటరు అనుభవం పొందడానికి కొడి అను ఉచిత సాఫ్ట్‌వేరు ఉపయోగపడుతుంది. కొడి దింపుకొ

7-జిప్: అస్తమాను కొనుక్కో అని విసిగించే జిప్, రార్ సాఫ్ట్‌వేర్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం. 7-జిప్ దింపుకొ