ఆండ్రాయిడ్ లాలిపప్ 5.1.1 తరువాతి వెర్షను

ప్రపంచంలో ఎక్కువ మొబైల్ పరికరాల్లో వాడబడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టము యొక్క తరువాతి వెర్షను డెవలపర్ కిట్ మరియు మూడొవ ప్రివ్యూను డెవలపర్ల కోసం గూగుల్ విడుదల్ చేసింది. మార్ష్‌మాలో(చెక్కరతో తయారుచేయబడివ మిటాయిని క్రింది చిత్రంలో చూడవచ్చు) గా వ్యవహరించే ఈ ఆండ్రాయిడ్ వెర్షను సంఖ్య 6.
ఈ ఆపరేటింగ్ సిస్టము ప్రస్తుతం నెక్సస్ పరికరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ నెక్సస్ పరికరాను వాడేవారు క్రింది లంకె నుండి దింపుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 

నెక్సస్ పరికరాలకు ఆండ్రాయిడ్ 6 డౌన్‌లోడ్


ఈ వెర్షనులో ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ మరియు బ్యాటరీ సేవింగ్ మోడ్‌లను మెరుగుపరిచినట్లు గూగుల్ బ్లాగులో ప్రకటించారు.