క్వీక్ సపోర్ట్ అని క్విక్ గా డబ్బులు మాయం చేస్తున్నారు ఎలా?

  • బ్యాంకు లేదా పేమెంట్‌ యాప్ నుండి అని చెప్పి సహాయం చేయడం కోసమని (సాధారణంగా కెవైసి అప్డేట్ లేదా ఏదైనా సమస్య పరిష్కరించడానికి అని) ప్లేస్టోర్ ద్వారా క్విక్‌ సపోర్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొమని చెపుతారు. ప్లేస్టోర్ నుండి అనగానే మనకి నమ్మకం వస్తుంది. 
  • క్విక్ సపోర్ట్ యాప్ అనేది టీమ్ వ్యూయర్ వారిచే తయారుచేయబడిన యాప్. ఇది కూడా టీమ్ వ్యూయర్ లాంటిదే. టీమ్ వ్యూయర్ రిమోట్ గా డెస్క్ టాప్ ఆపరేట్‌ చేయడానికి వాడితే, దీన్ని మొబైల్ ను రిమోట్ గా ఆపరేట్ చేయడానికి వాడతారు. 
  • నమ్మకంగా మనచే యాప్ ఇన్స్టాల్‌ చేయించి, మన మొబైల్ రిమోట్ గా ఆపరేట్ చేయడానికి ID మరియు పాస్ కోడ్ కూడా మన ద్వారానే తీసుకుంటారు.
  • ఇంకేముంది రిమోట్ గానే మన మోబైఎం చేయాలి?ల్ లో పేమెంట్‌ యాప్ తెరిచి వాళ్ళ అకౌంట్ కి డబ్బు పంపించుకుంటారు.

అలా మోసపోయిన వార్త చిత్రంలో చూడవచ్చు. జాగ్రత్త వహించండి మీ డబ్బు కాపాడుకొండి. షేర్ చేయడం ద్వారా అందరిని కాపాడండి.