ఇప్పటికి మనలో చాలామంది ఖరీదైన ఆపరేటింగ్ సిస్టములు కొని వాడలేక నఖిలీ ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. అప్‌డేట్ చేసుకుంటే మీఆపరేటింగ్ సిస్టము నఖిలీ అని చూపిస్తుందని అప్‌డేట్లు చేసుకోక భద్రతపరంగా బలహీనమైన మరియు కొత్త ఫీచర్లను లేనటువంటి పురాతన ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. నయాపైసా పెట్టుబడి లేకుండా చట్టబద్దంగా ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు లంకెలు ఇక్కడ లభించును. నిరంతర అప్‌డేట్లు లభించే ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టములు ఎవరైనా ఉచితంగా దింపుకోవచ్చు. అంతేకాకుండా పాత కంప్యూటర్లలకి కొత్త ఫీచర్లతో జీవంపోసే తేలికైన ఆపరేటింగ్ సిస్టములు లంకెలు ఇక్కడ లభించును. ఇక్కడ వాణిజ్య ఆపరేటింగ్ సిస్టముల ట్రయల్, పైరేటెడ్, కీ, యాక్టివేటర్లు మరియు క్రాక్‌లు లభించవు.
ఉబుంటు: ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టములలో మూడవది, ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టములలో మొదటిది అయిన ఉబుంటు ఖరీదయిన వాణిజ్య ఆపరేటింగ్ సిస్టములకు సరైన ఉచిత ప్రత్యామ్నాయం. అంతేకాకుండా ఈ ఆపరేటింగ్ సిస్టమును తెలుగుతో పాటు వివిధ భాషలలో వాడుకోవచ్చు. దీనిగురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఉబుంటుకి సంబందించిన సాఫ్ట్వేర్లు, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి మరియు మరిన్ని చిట్కాలు ఇక్కడ చూడవచ్చు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం కుటుంబంలో వాడుకరి అభిరుచికి తగినట్లు వేరువేరు రూపాలలో ఆపరేటింగ్ సిస్టములు ఉన్నాయి. ఆ ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టములను మనం క్రింది లంకెల నుండి దింపుకోవచ్చు. దింపుకున్న ఆపరేటింగ్ సిస్టంలను ఏక్టివేటర్లు, కీలు మరియు క్రాక్‌లు అవసరం లేకుండానే మనం ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.