ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదల సంబరాలు

 ఉచిత ఆపరేటింగ్ సిస్టములలో స్థిరత్వానికి మారుపేరుగా నిలిచి, అలానే పలు ఉచిత ఆపరేటింగ్ సిస్టముల తయారీలో వెన్నుముకగా ఉన్న ఉవిత ఆపరేటింగ్ సిస్టం డెబియన్ యొక్క సరికొత్త వెర్షను 8.0 విడుద్లైంది. ఈ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకుని అన్ని రకాల డెస్క్‌టాప్ మరియు లాప్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్రింది లంకె
నుండి డెబియన్ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకోవచ్చు. 

డెబియన్ ఉచిత డౌన్‌లోడ్

 డెబియన్ విడుదలను పురష్కరించుకుని వాడుకర్లు మరియు డెవలపర్లు కలిసి స్వచ్చంధంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల సంబరాలు చేస్తున్నారు. భారత దేశంలో కూడా పలుచోట్ల జరుపుతున్న ఈ వేడుకలు మన హైదరాబాదులో కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా డెబియన్ గురించి జన సామాన్యానికి పరిచయం చేయడం, ఉచితంగా ఇన్‌స్టాల్ చేసియివ్వడం, కేకు కోత మరియు ఉచిత సాఫ్ట్‌వేర్ల వాడుకర్ల సందేహాలకు పరిష్కారాలు అనుభవజ్ఞులచే చెప్పబడుతాయి. అలానే ఈ మధ్య చర్చనీయ అంశము అయిన నెట్‌ న్యూట్రాలిటీ పై మరియు తాజాగా విడుదలైన ఉబుంటు ఆపరేటింగ్ సిస్టముల గురించి కూడా చర్చిస్తారు. కనుక ఉచిత స్వేచ్చా సాఫ్ట్‌వేర్ల అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. 


వేడుకల్లో ఉచితంగా వైఫి సదుపాయాన్ని కూడా ఏర్పాటుచేసారు.

వేదిక: థియేటర్ ఔట్‌రిచ్ యూనిట్, గోల్డెన్ త్రెషోల్డ్, అబిట్స్, హైదరాబాదు.