ఉచిత ఆపరేటింగ్ సిస్టములలో స్థిరత్వానికి మారుపేరుగా నిలిచి, అలానే పలు ఉచిత ఆపరేటింగ్ సిస్టముల తయారీలో వెన్నుముకగా ఉన్న ఉవిత ఆపరేటింగ్ సిస్టం డెబియన్ యొక్క సరికొత్త వెర్షను 8.0 విడుద్లైంది. ఈ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకుని అన్ని రకాల డెస్క్‌టాప్ మరియు లాప్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్రింది లంకె
ఉబుంటు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉబుంటు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్షను విడుదలైంది
ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు మనకి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క సరికొత్త వెర్షను ఇపుడు మనకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్ చేసుకోవడానికి
సాధారణంగా కంప్యూటర్లలో తెలుగు టైప్ చేయడానికి అధనంగా సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్ చేసుకోవడానికి సెట్టింగులను ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.
మీ కంప్యూటరులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారా?
- విండోస్ యొక్క రిఈన్‌స్టాల్ డిస్క్ మరియు ఆపరేటింగ్ సిస్టం అలాగే మన ఫైళ్ళు బ్యాకప్ తీసుకున్న తరువాత మాత్రమే ప్రయత్నించవలసి ఉంటుంది.
- విండోస్ లో ఉండగా ఉబుంటు, ఉబుంటులో ఉండగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ లను మనం తొలగించడం లేదా మార్చడంచేయకుడదు. దానివలన రెండు ఆపరేటింగ్ సిస్టంలు పనిచేయకుండా పోతాయి.
- విండోస్‌లో కనిపించని రికవరీ మరియు తయారీదారుకి సంభందించిన పార్టీషియన్‌లు ఉబుంటులో కనిపించినప్పటికి మనం వాటిలోని పైళ్ళను మార్చడం కాని డ్రైవ్ ని తొలగించడం కాని చేయరాదు.
- ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందే విండోస్ అప్‌డేట్లు అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
- ఒకొకసారి విండోస్ అప్‌డేట్ అయిన తరువాత ఉబుంటు అసలు కనిపించకుండా పోతుంది. అటువంటప్పుడు మనం ఉబుంటు లైవ్ డిస్క్ ని ఉపయోగించి మనం మునుపటిలా ఉబుంటు మరియు విండోస్ 8 డ్యూయల్ బూట్ అయ్యేవిధంగా చేసుకోవచ్చు.
- పొరపాటు జరిగి రెండుఆపరేటింగ్ సిస్టంలు బూట్ కానప్పటికి కంగారుపడి తిరిగి ఇన్‌స్టాల్ చెయ్యకండి. రెండిటిని కూడా యధాస్థితిలో రికవరీ చేయ్యడానికి మనకి నెట్‌లో పలు ఉపాయాలు దొరుకుతాయి.
మీ కొత్త లినొవొ లాప్‌టాప్‌లో ఇతర ఆపరేటింగ్ సిస్టంలు ఇన్‌స్టాల్ కావట్లేదా?
ఇప్పుడు కొత్తగా వస్తున్న లినొవొ లాప్‌టాప్‌లో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయడం వీలుకాకుండా ఉండడమే కాకుండా లైవ్ సిడి కూడా పనిచేయట్లేదు. అంతేకాకుండా సిస్టం ఆన్ చేయగానే నేరుగా విండోస్ లోకి వెళ్ళిపోతుంది. కనీసం బయోస్ సెట్టింగ్స్ లోకి వెళ్లడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి కూడా మనకి ఆప్షన్లు కనిపించవు. మరి అటువంటప్పుడు మనం ఏవిధంగా మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు కలిపి డ్యుయల్ బూట్‌గా ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి.
మొదట మనం మన లాప్‌టాప్ బయోస్ సెటప్ లోకి వెళ్ళాలి. అది ఎలాగంటే లాప్‌టాప్ ని షట్‌డౌన్ చేసి తరువాత పవర్ బటన్ ప్రక్కన ఉన్న వన్ టచ్ రికవరీకీని పది సెకన్లు వత్తి పట్టుకొని వదిలివేయాలి.
ఉబుంటు ఇన్‌స్టాల్ చేయబడిన లినొవొ లాప్‌టాప్ |
మొదట మనం మన లాప్‌టాప్ బయోస్ సెటప్ లోకి వెళ్ళాలి. అది ఎలాగంటే లాప్‌టాప్ ని షట్‌డౌన్ చేసి తరువాత పవర్ బటన్ ప్రక్కన ఉన్న వన్ టచ్ రికవరీకీని పది సెకన్లు వత్తి పట్టుకొని వదిలివేయాలి.
అప్పుడు మనకి తెరమీద క్రింది చిత్రంలో వలే బయోస్ సెటప్‌కి వెళ్ళడానికి మరియు బూట్ డివైజ్ ఎంచుకోవడానికి ఆప్షన్‌లు కనిపిస్తాయి.
ఇప్పుడు మనం బూట్ మెనూలోకి వెళ్ళి ఏదైనా లినక్స్ లైవ్ ఆపరేటింగ్ సిస్టం ప్రయత్నించడానికి ముందు బయోస్ సెటప్ లోనికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ టాబ్‌లో ఉన్న సెక్యూర్‌బూట్ అన్న ఆప్షన్‌ని డిసేబుల్ చెయ్యలి.
సెక్యూర్ బూట్ డిసేబుల్ చేసిన తరువాత మన కంప్యూటరులో వివిధ ఉచిత ఆపరేటింగ్ సిస్టముల లైవ్ డిస్కులు మామూలుగా ఎప్పటిలాగే పనిచేస్తాయి. కాని అన్ని ఆపరేటింగ్ సిస్టములు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కుదరదు, కేవలం యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టంలు మాత్రమే ఇన్‌స్టాల్ అవుతాయి. ఉబుంటు 64 బిట్ వంటి కొన్ని ఆపరేటింగ్ సిస్టములు మాత్రం సెక్యూర్ బూట్ అనేబుల్ చేసి ఉన్నప్పటికి లైవ్ డిస్క్ పనిచేయడమే కాకుండా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. మనం ఉబుంటు 32 బిట్ మరియు మిగిలిన ఏదైనా ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం తప్పనిసరిగా బయోస్ సెటప్ లో బూట్ టాబ్ లో ఉన్న యుఇఐయఫ్ బూట్‌ని లెగసిగా మార్చవలసి ఉంటుంది.
కానీ లెగసీ సపోర్ట్ అనేబుల్ చేసిఉన్నపుడు మిగిలిన అన్ని ఆపరేటింగ్ సిస్టంలు బాగానే పనిచేస్తున్నప్పటికి లినొవొ లాప్‌టాప్‌లో విండోస్ 8 బూటింగ్ సమస్య వస్తుంది కనుక ఉచిత ఆపరేటింగ్ సిస్టంతో పాటు విండోస్ 8 కూడా వాడుకోవాలనుకునేవారు తప్పని సరిగా యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు64 బిట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. మనం ఉబుంటు ఇన్‌స్టాల్ చేసిన తరువాత మనకి ఈవిధంగా కంప్యూటరు ఆన్ చేయగానే బూట్ మెను కనిపిస్తుంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంని ఎంచుకోవడం ద్యారా మనం ఉబుంటు లేదా విండోస్ లోకి బూట్ కావచ్చు. మన ఫైళ్ళని రెండు ఆపరేటింగ్ సిస్టంలలో నుండి వాడుకోవచ్చు.
కరప్ట్ అయిన కంప్యూటరు నుండి డాటా బ్యాకప్ తీసుకోవడం,ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ పరిమాణాన్ని తగ్గించడం ఎలా?
ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్ మొత్తం ఒకే డ్రైవ్‌గా ఉండి దానిలోనే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. మనం మన డాటాని కూడా అందులోనే దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టం పనిచేయనపుడు తిరిగి ఇన్‌స్టాల్ చేయించుకోవడానికి వెళ్ళినపుడు డాటా తిరిగి రాదు లేదా డాటా బ్యాకప్ తీయడానికి మరికొంత డబ్బులవుతాయని షాపువాడు అడుగుతుంటాడు. ఇటువంటప్పుడు మనం సులభంగా షాపుకి తీసుకువెళ్ళకుండానే డాటా ఎలా బ్యాకప్ తీసుకోవాలో, అసలు ఈ సమస్య రాకుండా ముందుగానే ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్‌ని కుదించుకొని డాటా కోసం మరొక డ్రైవ్‌ని ఏర్పాటుచేసుకొని మనకు కావలసినపుడు మన డాటాకి హానికలగకుండా ఆపరేటింగ్ సిస్టం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు.
ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
సాధారణంగా విండోస్‌తో వచ్చే కంప్యూటర్లలో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి చూసినపుడు డాటా మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం కోల్పోతున్నాము అని ఫిర్యాదు చేస్తూ ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను నిందిస్తూ ఉంటారు. మనం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డాటా మరియు డబ్బులు పెట్టీ కొన్న ఆపరేటింగ్ సిస్టంని కోల్పోకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఇన్‌స్టాలేషన్ సమయంలో మనకి తెలియక ఏదైనా తప్పుగా చేసినప్పటికి మన డాటాని మరియు ఆపరేటింగ్ సిస్టంని ఎలా తిరిగి పొందాలో ఈ వీడియోలో చూడవచ్చు.
మీ కొత్త కంప్యూటర్లో మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ అవ్వట్లేదా?
కొత్తగా కొన్నటువంటి కంప్యూటరులో మనం మునుపటిలా మనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి ప్రయత్నించినపుడు ఇన్‌స్టాల్ కాకపోవడం ఈమధ్య సాధారణంగా జరుగుతుంది. అదేవిధంగా సీడీ, డీవీడీ మరియు పెన్‌డ్రైవ్‌ల నుండి నేరుగా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. దీనికి కారణం కొత్తగా వస్తున్నటువంటి కంప్యూటర్లలో మనకు బయోస్ సెటప్ లోకి ప్రవేశించడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి ఎటువంటి ఆప్షనులు చూపించకుండా నేరుగా విండోస్ లోకి వెళ్ళిపోతు ఉండడం కారణం. మనం వేరే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లేదా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడానికి అడ్డుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలా?
ఇంటర్‌నెట్ లో ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టం యొక్క ఇమేజి ఫైల్ ని డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత దాన్ని సిడీ లేదా డివిడీ మరియు పెన్ డ్రైవ్ ఉపయోగించి ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.
ఉచితంగా ఆపరేటింగ్ సిస్టం డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను(ఎక్కువ పరిమాణం గల ఫైళ్ళను) సులభంగా, వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.
మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిచిపోయిందా? ఇదిగో మంచి అవకాశం ఉచితంగా!
మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయబడితే మన ఆపరేటింగ్ సిస్టం కి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక మనం కొత్త ఆపరేటింగ్ సిస్టం కొనుక్కోవలసి ఉంటుంది. అదేవిధంగా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుతూ ఉంటే అప్‌డేట్ చేస్తే మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం నఖిలి అని చూపించబడడం వలన మీరు అప్‌డేట్ చేసుకోలేక పోతుండవచ్చు. ఈ సమస్యలకి పరిష్కారంగా ఇప్పుడు మనకి చక్కని, ఖర్చు లేని అవకాశం అందుబాటులో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం సరికొత్త వెర్షను విడుదల అయినది. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు.
చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్
చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం
నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ఆపరేటింగ్ సిస్టంలు వాడుతూ బధ్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి అవకాశం. అప్‌డేట్ల విషయానికి వచ్చినపుడు దీనిలో కూడా మనం కొనుక్కొన్న ఆపరేటింగ్ సిస్టం వలే నిరంతరం సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా తరువాతి వెర్షను విడుదలైనపుడు ఉచితంగానే మనకు అందించబడుతుంది.
అన్ని రకాల కంప్యూటర్లలో పని చేసే ఈ ఆపరేటింగ్ సిస్టం పేరు ఉబుంటు. మనందరికి సుపరిచితమైన ఆండ్రాయిడ్ తయారుచేయబడిన లినక్స్ ని ఉపయోగించి దీనిని కూడా తయారుచేసారు. ఇప్పుడు విడుదలైన వెర్షను 14.04. మన అభిరుచికి తగిన విధంగా ఈ ఉబుంటు పలురూపాల్లో అందుబాటులో ఉంది. వాటిని కూడా మనం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు(క్రింద ఇవ్వబడిన లంకెల ద్వారా).
పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడుకర్లకి శుభవార్త ! ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది.
ఇప్పుడే ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది. దానితో పాటు ఫోన్లకి, టాబ్లెట్లకి, లాప్ టాప్, డెస్క్ టాప్, సర్వర్లలో వాడుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టములు విడుదలైనాయి. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి ఇదే సరైన అవకాశం.
ఉబుంటు 13.10 ఇప్పుడే విడుదలైంది. దానితో పాటు ఉబుంటు టచ్ 1.0(ఫోన్లకి మరియు టాబ్లెట్లకి), ఉబుంటు సర్వర్ మరియు లాప్ టాప్, డెస్క్ టాప్ కొరకు కుబుంటు, లుబుంటు, క్షుబుంటు, ఎడ్యుబుంటు, ఉబుంటు స్టుడియో, ఉబుంటు గ్నోం, ఉబుంటు కైలిన్ లు కూడా విడుదలైనాయి.
ఉబుంటు డెస్క్ టాప్ |
ఇప్పటికే ఉబుంటు వాడుతున్నవారు కొత్త వెర్షన్ కి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇక్కడ చూడవచ్చు. కొత్త ఫీచర్లతో విడుదలైన ఉబుంటు 13.10 గురించి పూర్తి విశేషాలు వీడియోలు ఇక్కడ చూడవచ్చు. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములలో కొత్తగా వచ్చిన మార్పులని ఇక్కడ చూడవచ్చు.
ఉబుంటు మరియు మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు క్రింది లింకుల నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Mac కేనా డాక్?
మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయ్బడిఉన్న వివిధ అప్లికేషన్లు తెరవడానికి సాధారణంగా డెస్క్ టాప్ ఇకాన్, మెనూ, టాస్క్ బార్, లాంచర్ వంటి వివిధ పధ్ధతులు వాడుతుంటాము. అప్లికేషన్లు తెరవడానికి తమాషా అయిన కంటికి ఇంపైన మరొక విధానమే డాక్. ఆపిల్ వాడి ఖరీదైన ఆపరేటింగ్ సిస్టం అయిన మాక్ ద్వారా ఈ డాక్ బాగా ప్రసిధ్ది చెందినది. అంత ఖరీదు పెట్టలేని, ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడేవారికి డాక్ లేదా?
ఉచితంగా దొరికే డాక్ లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కైరో డాక్. ఇది పూర్తిగా ఉచితమే. ఇది ఉచిత స్వేచ్చా సాఫ్ట్ వేర్. ఎవరైనా ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది డెబియన్, ఉబుంటు, మింట్, మరియు ఫెడోరా వంటి అన్ని ఉచిత ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది. దీనిని మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్ వేర్ సెంటర్ అప్లికేషన్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కైరో డాక్ కి రకరకాల థీంలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇకాన్లు రూపం,పరిమాణం, కదలికలు, వాటిని నొక్కినపుడు అవి ప్రవర్తించే విధానం మరియు విండో తెరవబడు విధానం వంటి అన్ని లక్షణాలు మనకు నచ్చినట్లు మార్చుకోగలగడం లెక్కలేనన్ని ఆప్షన్లు కలిగి ఉండడం కైరో డాక్ ని మిగిలిన వాటి నుండి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కైరో డాక్ తక్కువ కాన్ఫిగరేషన్ గల సిస్టం లలో కూడా బాగా పనిచేస్తుంది.
గ్నోం డెస్క్ టాప్ పై కైరో డాక్ |
రసాయనాల విశేషాలను తెలుసుకోవడానికి
రసాయన శాస్త్రం చదివే వారికి ఆవర్తన పట్టిక(పిరియాడిక్ టేబుల్) అనేది భగవద్గీత లాంటిది. ఆవర్తన పట్టికలో వివిధ మూలకాలు వాటి పరమాణు సంఖ్యల, ధర్మాల ఆధారంగా వరసగా అమర్చబడి ఉంటాయి. ఆవర్తన పట్టికని ఉపయోగించి సులువుగా మూలకం యొక్క రసాయన, భౌతిక మరియు అణు ధర్మాలను తెలుసుకోవచ్చు. రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకి, విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడే ఆవర్తన పట్టికని మనం మన డెస్క్ టాప్ పై ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. జి ఎలిమెంటల్ అను ఉచిత సాఫ్ట్వేర్ ఇన్ స్టాల్ చేసుకొని ఆవర్తన పట్టికను మన కంప్యూటర్లో చూడవచ్చు.
జి ఎలిమెంటల్ లో మూలకాలు గ్రూప్, పిరియడ్ మరియు సీరీస్ లు గా విభజించబడి వేరువేరు రంగులలో చూచించబడి ఉన్నాయి. మూలకంపై మౌస్ ని ఉంచగానే మూలకం యొక్క పూర్తి పేరు పరమాణు సంఖ్య కనిపించును. మూలకాన్ని డబుల్ క్లిక్ చేసినపుడు ఆ మూలకం యొక్క సాధారణ, భౌతిక మరియు అణు ధర్మాలను చూపించును. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి జి ఎలిమెంటల్ అని వెతికి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
రసాయనము యొక్క ధర్మాలు |
వెబ్ పేజిని మొత్తం ఫొటో తియడానికి
సాధారణంగా మనం కంప్యూటర్ తెరపై ఉన్నదాన్ని ఫోటో తీయడానికి మన కీబోర్డ్ లో ఉన్న ప్రింట్ స్క్రీన్ ను ఉపయోగిస్తుంటాము. మనం ఏదైనా ఒక వెబ్ పేజిని చూస్తున్నపుడు ప్రింట్ స్క్రీన్ ను ఉపయోగించి ఫొటో తీస్తే అది మనకు తెర మీద కనిపించే వెబ్ పేజి యొక్క భాగాన్ని మాత్రమే ఫొటో తీస్తుంది. మనం వెబ్ పేజి మొత్తాన్ని ఫొటో తీయాలంటే ఎలా?
షట్టర్ అనే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మనం సులభంగా వెబ్ పేజి మొత్తాన్ని ఫొటో తీయవచ్చు. షట్టర్ అనేది శక్తివంతమైన ఆధునికమైన స్క్రీన్ షాట్లు తీయడానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్. దీనిని ఉపయోగించి పూర్తి డెస్క్ టాప్, విండో, డెస్క్ టాప్ లో ఎంచుకున్న మేర స్క్రీన్ షాట్ తీయడమే కాకుండా తీసిన స్క్రీన్ షాట్లను మనకు కావలసినట్లు మార్చుకొని నేరుగా వివిధ ఆన్ లైన్ ఫొటో వెబ్ సైట్లకి ఎగుమతి చేయవచ్చు. షట్టర్ ని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
షట్టర్ ని మనం ఇన్ స్టాల్ చేయునపుడు ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ లో గ్నోం వెబ్ ఫొటో అన్న యాడ్ ఆన్ ని ఎంచుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఎలా అన్నది ఈ చిత్రంలో చూడవచ్చు.
ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి షట్టర్ ని ఇన్ స్టాల్ చేయడం |
షట్టర్ ని ఇన్ స్టాల్ చేసిన తరువాత క్రింద చిత్రాలలో చూపినట్లు చేయడం ద్వారా మనం మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయవచ్చు.
షట్టర్ |
షట్టర్ ని ఉపయోగించి మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయడం |
మనం వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించకుండానే మనకి కావలసిన వెబ్ చిరునామాను ఇక్కడ ఇవ్వడం ద్వారా మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయవచ్చు. షట్టర్ తోతీసిన పూర్తి వెబ్ పేజిని ఇక్కడ చూడవచ్చు.
షట్టర్ తో తీయబడిన బ్లాగు మొత్తం స్క్రీన్ షాట్ |
తొందరలో విడుదలకాబోతున్న ఉబుంటు 13.10 వాల్ పేపర్లు
ఉబుంటు ప్రతి వెర్షన్ తో పాటు కొన్ని వాల్ పేపర్లు డిఫాల్ట్ గా వస్తుంటాయి. వాటిని ఎంపిక చేయడానికి జనాల మధ్య పోటి పెట్టి వచ్చిన వాల్ పేపర్లలో మంచివాటిని ఎంపికచేసి ఉబుంటు సిడీ ఇమేజిలో ఉంచుతారు. వచ్చే నెల 17 న రాబోతున్న ఉబుంటు 13.10 వాల్ పేపర్లని మనం ఇప్పుడే క్రింది లంకెల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఉబుంటు 13.10 డిఫాల్ట్ వాల్ పేపర్ |
పాఠశాలల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టం
ఎడ్యుబుంటు అనేది విద్యార్ధుల, పాఠశాలల అవసరాలకు అనుగుణంగా చేయబడిన ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టం. అందుబాటులో ఉన్న విద్యా సంబంధిత ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంతో కూర్చి ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల వారు సులభంగా ఇళ్ళలో, తరగతిగదులలో ఇన్ స్టాల్ చేసుకొని వాడుకొనే విధంగా దీనిని తయారుచేసారు. ఆర్ధిక, సామాజిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా జ్ఞానం మరియు నేర్చుకోవడం అనేవి ఉచితంగా అందరికి అందుబాటులో ఉండాలి అని నమ్మే విద్యార్ధుల, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల మరియు డెవలపర్లచే స్వచ్ఛందంగా అభివృధ్ది చేయబడుతుంది. ప్రతి ఆరు నెలలకొకసారి ఉబుంటుతో పాటు ఎడ్యుబుంటు కూడా విడుదలవుతుంది. ఎడ్యుబుంటు యొక్క 32 బిట్ 64 బిట్ డివిడీ ఇమేజిలను ఎవరైనా ఉచితంగా దింపుకోని వాడుకోవచ్చు. క్రింది లంకె నుండి ఎడ్యుబుంటుని నేరుగా లేదా టొరెంట్ ద్వారా దింపుకోవచ్చు.
కలల ఫోను కోసం కదలిరండి
నేడు అనేక రకాల ఫోన్లు వివిధ రకాల విశిష్టతలతో మన ముందుకు వస్తున్నాయి. ఎన్ని ఫోన్లు వచ్చినపటికి డెస్క్ టాప్ కి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి. ఫోన్ తో చెయ్యగల పనులు మునపటి కన్నా గణణీయంగా పెరిగినప్పటికి ఫోన్లకి గల పరిమితుల వలన డెస్క్ టాప్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. డెస్క్ టాప్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి మరో అడుగు ముందుకు పడబోతుంది. దానికి మన చేయుత కావాలి. దానికి ప్రతిఫలంగా పరిమితంగా తయారు చేయబడుతున్న కలల ఫోన్లని సొతం చేసుకోవచ్చు.
గత వారం రోజులుగా నెట్టింట్లో ఎక్కువగా చర్చించబడుతున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే కచ్చితంగా మనం భవిష్యత్తరం ఫోన్ని తొందరలోనే చూడగలం. వ్యక్తిగత కంప్యూటింగ్ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోయే ఈ కలల ఫోన్లో మొబైల్ ఫోన్ మరియు డెస్క్ టాప్ కలిసి ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం(ఉబుంటు) మరియు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం(ఆండ్రాయిడ్) కలయికతో రాబోతున్న ఈ ఫోన్ ప్రజల విరాళాలతో తయారుకాబోతుంది. జన విరాళాల చరిత్ర రికార్డులని చెరిపి మొదటి ఏడురోజులలో ఏడు మిలియన్ డాలర్లను పోగుచేసి లక్ష్యం(32 మిలియన్ డాలర్లు) దిశగా దూసుకుపోతున్నది. అదే ఉబుంటు ఎడ్జ్ ఫోన్.
ఉబుంటు ఎడ్జ్ ఫోన్ యొక్క విశిష్టతలు:
- ఆండ్రాయిడ్ మరియు ఉబుంటు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం డ్యూయల్ బూట్
- మానీటర్ కి తగిలించగానే డెస్క్ టాప్ కంప్యూటర్ గా మారిపోతుంది
- మల్టికోర్ ప్రాససర్
- 4జిబి రాం
- 128 జిబి స్టోరేజ్
- మైక్రో సిమ్
- 4.5 అంగుళాల హెచ్ డి తెర
- వజ్రం లాంటి గట్టిదనం గల సఫైర్ క్రిస్టల్ గ్లాస్ తెర
- ముందు 2,వెనుక 8 మెగాపిక్సల్ కెమేరా
- 4G,వైఫి,NFC
- స్టీరియో స్పీకర్లు
- సిలికాన్ ఆనోడ్ లిధియం బేటరి
అతిధి ఖాతా(గెస్ట్ అకౌంట్)ని తొలగించడం ఎలా?
ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేసినపుడు వాడుకరి ఖాతా తో పాటు విధిగా అతిధి ఖాతా కూడా ఏర్పరుచుకుంటుంది. ఒకవేళ మనసిస్టం నుండి భద్రతా కారణాల రీత్యా అతిధి ఖాతా అవసరం లేదనుకుంటే అతిధి ఖాతాని తొలగించవచ్చు, తిరిగి పొందవచ్చును. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం వాడేవారు క్రింద చూపిన కమాండ్లను టెర్మినల్ లో నడిపి సులభంగా అతిధి ఖాతాని చిటికెలో తొలగించవచ్చు, కావలసినపుడు తిరిగి పొందవచ్చు.
అతిధి ఖాతాని కనిపించకుండా చేయడానికి:
sudo /usr/lib/lightdm/lightdm-set-defaults -l false
అతిధి ఖాతాని తిరిగి కనిపించేలా చేయడానికి:
sudo /usr/lib/lightdm/lightdm-set-defaults -l true
ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మూడవ ఆపరేటింగ్ సిస్టం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి
ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో మూడవది, ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టంలలో మొదటిది అయిన ఉబుంటు యొక్క సరికొత్త వెర్షను ఈరోజు విడుదలైనది. ఉబుంటు 13.04 ఇప్పటి వరకు వచ్చిన ఉబుంటు వెర్షనులలో వేగవంతమైన, ఆకర్షణీయమైన ఆపరేటింగ్ సిస్టంగా చెప్పవచ్చు. దీనిని ఇక్కడ నుండి నేరుగా ఉచితంగా దింపుకోవచ్చు.
ఉబుంటు 13.04 డెస్క్ టాప్ 32 బిట్ టొరెంట్ డౌన్లోడ్
డౌన్లోడ్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టం ఇమేజిని ఇక్కడ తెలిపినట్లు చాలా సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఉబుంటు వాడుతున్నట్లయితే తిరిగి ఇన్ స్టాల్ చేయనక్కరలేకుండా నేరుగా కొత్త వెర్షనుకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)