ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్ మొత్తం ఒకే డ్రైవ్‌గా ఉండి దానిలోనే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. మనం మన డాటాని కూడా అందులోనే దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టం పనిచేయనపుడు తిరిగి ఇన్‌స్టాల్ చేయించుకోవడానికి వెళ్ళినపుడు డాటా తిరిగి రాదు లేదా డాటా బ్యాకప్ తీయడానికి మరికొంత డబ్బులవుతాయని షాపువాడు అడుగుతుంటాడు. ఇటువంటప్పుడు మనం సులభంగా షాపుకి తీసుకువెళ్ళకుండానే డాటా ఎలా బ్యాకప్ తీసుకోవాలో, అసలు ఈ సమస్య రాకుండా ముందుగానే ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్‌ని కుదించుకొని డాటా కోసం మరొక డ్రైవ్‌ని ఏర్పాటుచేసుకొని మనకు కావలసినపుడు మన డాటాకి హానికలగకుండా ఆపరేటింగ్ సిస్టం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు.