సాధారణంగా ప్రొఫెషనల్ ఆఫీస్ సూట్ తో మాత్రమే మెయిల్ క్లయింట్ వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వాణిజ్య మెయిల్ క్లయింట్లకు దీటయిన ప్రత్యామ్నాయంగా తండర్ బర్డ్ అను స్వేచ్ఛా సాఫ్ట్వేర్ని చెప్పుకోవచ్చు. దీనిని ఫైర్ ఫాక్స్ ని తయారుచేసిన లాభాపేక్ష లేని సంస్థ అయిన మొజిల్లా వారు తయారుచేసారు. ఎన్నో విశిష్టతలతో పాటు భద్రత పరంగా కూడా మేటి అయిన ఈ తండర్ బర్డ్ ఉచితంగా లభిస్తుంది. ఉబుంటు లో అప్రమేయంగా ఇది ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది మెయిల్ క్లయింట్ గానే కాకుండా RSS ఫీడ్ రీడర్ గాను,అవసరానికి వెబ్ బ్రౌసర్ గా కూడా పనిచేస్తుంది. తండర్ బర్డ్ ని విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ మాదిరిగానే చాలా రకాల యాడ్ ఆన్లు తండర్ బర్డ్ కి కూడా అందుబాటులో ఉన్నాయి.