రసాయన శాస్త్రం చదివే వారికి ఆవర్తన పట్టిక(పిరియాడిక్ టేబుల్) అనేది భగవద్గీత లాంటిది. ఆవర్తన పట్టికలో వివిధ మూలకాలు వాటి పరమాణు సంఖ్యల, ధర్మాల ఆధారంగా వరసగా అమర్చబడి ఉంటాయి. ఆవర్తన పట్టికని ఉపయోగించి సులువుగా మూలకం యొక్క రసాయన, భౌతిక మరియు అణు ధర్మాలను తెలుసుకోవచ్చు. రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకి, విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడే ఆవర్తన పట్టికని మనం మన డెస్క్ టాప్ పై ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. జి ఎలిమెంటల్ అను ఉచిత సాఫ్ట్వేర్ ఇన్ స్టాల్ చేసుకొని ఆవర్తన పట్టికను మన కంప్యూటర్లో చూడవచ్చు.
జి ఎలిమెంటల్ లో మూలకాలు గ్రూప్, పిరియడ్ మరియు సీరీస్ లు గా విభజించబడి వేరువేరు రంగులలో చూచించబడి ఉన్నాయి. మూలకంపై మౌస్ ని ఉంచగానే మూలకం యొక్క పూర్తి పేరు పరమాణు సంఖ్య కనిపించును. మూలకాన్ని డబుల్ క్లిక్ చేసినపుడు ఆ మూలకం యొక్క సాధారణ, భౌతిక మరియు అణు ధర్మాలను చూపించును. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి జి ఎలిమెంటల్ అని వెతికి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
రసాయనము యొక్క ధర్మాలు |