తరచు సమాచారం కోసం నెట్ లో వెతకడం సాధారణంగా అందరు చేసే పనే. కాని సెర్చ్ ఇంజన్లు మన మీద నిఘా పెడితే? అవును ఇది నిజమే. మనం వెతికిన సమాచారాన్ని ఆధారంగా సెర్చ్ ఇంజన్లు మన ఇంటర్ నెట్ అలవాట్లను గుర్తించి ఆ సమాచారాన్ని వాటి అవసరాలకు వాడుకుంటున్నాయి. మనం ఏదైనా సమాచారాన్ని వెతుకుతున్నపుడు వాటికి సంభందించిన ప్రకటనలు చూపించడం వంటి వ్యాపార అవసరాలకు మరియు వివిధ ప్రభుత్వ సంస్థల విజ్ఞప్తి మేరకు వారికి వాడుకర్ల సమాచారాన్ని అందించడం కోసం మన సమాచారాన్ని మనకి తెలియకుండా భద్రపరుస్తున్నాయి. సెర్చ్ ఇంజన్లు ఏవిధంగా మనల్ని వెంటాడుతునాయో మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
మరి మనకి అవసరంగా మారిన ఈ వెంటాడే సెర్చ్ ఇంజన్లు కి ప్రత్యామ్నాయం లేదా?
ఎందుకు లేదు? ఈ వీడియో చూడండి.
డక్ డక్ గో అనేది మనం ఇప్పుడు వాడుతున్న సెర్చ్ ఇంజన్ల వలే వాడుకరిని వెంటాడదు. ఇది మన సమాచారాన్ని దాచుకోదు. ఇది పూర్తిగా ఒపెన్ సోర్స్ సెర్చ్ ఇంజన్. మనం వాడే బ్రౌజర్ ఏదైనా సరే దీన్ని వాడుకోవచ్చు.