సాదారణంగా మనం విదేశాలలో ఉన్న బందుమిత్రులతో మాట్లాడడానికి స్కైప్, వైబర్ మరియు హాంగ్‌అవుట్ వంటి నెట్ ఆధారిత సపాయాలను ఉపయోగిస్తాము. అయితే దీనికి అవతలి వారికి, మనకి ఆ అప్లికేషనులో నమోదు చేసుకోవాలి. గూగుల్ హాంగ్‌అవుట్ నుండి మరో గూగుల్ హాంగ్‌అవుట్ వాడుకరితో ప్రపంచంలో ఎక్కడి నుండి, ఎక్కడికైనా
మాట్లాడుకోవచ్చు. స్కైప్, వైబర్ మాదిరిగానే గూగుల్ హాంగ్‌అవుట్లో కూడా ఇప్పుడు డబ్బులు చెల్లించి నేరుగా ప్రపంచంలో ఎక్కడికైనా మనకు కావలసిన ఫోన్‌లకి ఫోన్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే నేరుగా భారతదేశం నుండి అమెరికా, కెనడా దేశాలలో ఉన్న బందువులకు మరియు మిత్రులకు ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చు. అంటే వారి ఫోన్‌కి. దీనికి మనం చేయవలసిందల్లా గూగుల్ ప్లేస్టోర్ నుండి హాంగ్‌అవుట్ డయలర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అమెరికా, కెనడాలలో ఉన్న ఫోన్ నంబర్లకు ఉచితంగా ఫోన్ చేసుకోవడమే. దీనికి ఫోన్ చేసేవారికి నెట్ సదుపాయం ఉండాలి. కంప్యూటరు నుండి కూడా చేసుకోవడానికి హాంగ్‌అవుట్ అప్లికేషన్ లేదా బ్రౌజర్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.