వేలకువేలు పోసి కొనే వాణిజ్య
ఆఫీస్ అనువర్తనాలకు ఉచిత ప్రత్యామ్నాయమే లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా
లభిస్తుంది. ఎవరైనా సులభంగా దీన్ని వాడవచ్చు. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా
ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎంతమంది కైనా ఇవ్వవచ్చు.
ఈమధ్యే లిబ్రే ఆఫీస్ యొక్క సరికొత్త వెర్షను 4.1.1 విడుదలైంది. దీనిని
క్రింది లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లిబ్రే ఆఫీస్ వాడే వారికోసం డాక్యుమెంట్ ఫౌండేషన్ వారు అందిస్తున్న ఈ ఉచిత టెంప్లెట్లు మన పనిని సులభతరం చేస్తూనే సమయాన్ని కూడా ఆధా చేస్తాయి. మన రోజువారి అవసరాలకి తగిన టెంప్లెట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రెజ్యూమ్లు, ఇన్ వాయిస్లు, నెలసరి మరియు వార్షిక ఆర్ధిక ప్రణాళికలు, ఫాక్స్ మరియు కవరింగ్ లెటర్లు, బిజినెస్ కార్డులు, వివిధ రకాల ప్రజంటేషన్ స్లైడ్లు వంటి నిత్యావసర టెంప్లెట్లు ఇక్కడ లభిస్తాయి. ముందే తయారుచేయబడిన ఈ టెంప్లెట్లలో మనం మన సమాచారాన్ని ఉంచి వాటిని వాడుకోవచ్చు. అంతే కాకుండా వాటిని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. పెద్ద మొత్తంలో వివిధ రకాల టెంప్లెట్లు ఒపెన్ ఆఫీస్ కూడా అందిస్తుంది. వాటిని కూడా మనం లిబ్రే ఆఫీస్ లో కూడా వాడుకోవచ్చు.