సాధారణంగా కంప్యూటర్లలో తెలుగు టైప్ చేయడానికి అధనంగా సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్ చేసుకోవడానికి సెట్టింగులను ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.
ఉచిత సాఫ్ట్‌వేర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉచిత సాఫ్ట్‌వేర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉచిత ఆఫీస్ 4.4 విడుదలైంది
ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా
గూగుల్ ఎర్త్ ప్రో వెర్షను ఉచితంగా
మనం గూగుల్ ఎర్త్‌ని ఉపయోగించి సముద్రాలను, పర్వతాలను, అంతరిక్షంలో గ్రహాలను, భూమి మీద ఉన్న కట్టడాలు మరియు రహదారులను పటాల రూపంలోను మరియు నిజమైన సాటిలైట్ ఇమేజిల రూపంలోను చూడవచ్చు. గూగుల్ ఎర్త్ ని ఇప్పుడు విద్యార్ధులు, సాధారణ ప్రజలు, మీడియా మరియు ప్రభుత్వాలు ఇలా అందరు వారివారి అవసరాలకు తరచు ఉపయోగించుకుంటున్నారు. అయితే గూగుల్ 399 డాలర్లు / సంవత్సరం విలువ చేసే
వాట్స్‌యాప్ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్
ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్ ఇంత పోటి ఇవ్వడానికి కారణం
అమ్మ కాబోతున్న వారికి అమ్మ లాంటి అప్లికేషన్ "అమ్మ".
తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్)
ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు
ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి కావససిన
ఉచిత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్
సాధారణంగా చాలామంది వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఆర్ధిక లావాదేవీలను తమ కంప్యూటర్లలో చేసుకోవడానికి పేరుపొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ల యొక్క పైరేటెడ్ వెర్షనుని లేదా ట్రయిల్ వెర్షనులు వాడుతుంటారు. ఇటువంటి వారు పైరేటెడ్ సాఫ్ట్వేరు వాడకుండానే ఉచిత ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్లను వాడి తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. అలా
వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచిత సాఫ్ట్‌వేరు
సాధారణంగా యూట్యూబ్ మరియు డైలీమోషన్ వంటి సైట్ల నుండి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి బ్రౌజర్ ప్లగిన్‌లను మరియు ట్రైల్ వెర్షను సాఫ్ట్‌వేర్లను వాడుతుంటాము. ఈ ట్రైల్ వెర్షను సాఫ్ట్వేర్లు యాడ్స్‌తో విసిగిస్తుంటాయి. యూట్యూబ్, డైలీమోషన్, విమియో, మెటాకేఫ్, యుకు, మైవీడియో, మైస్పాస్ మరియు క్లిప్‌ఫిష్ వంటి వీడియో షేరింగ్
ఉచిత ఆఫీస్ అప్లికేషన్ కొత్త వెర్షను విడుదల
సాధారణంగా మనకి కనిపించే ఆఫీస్ అప్లికేషను ధర చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా మంది పైరేటెడ్ వెర్షను వాడుతుంటారు. దానికి చక్కని ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మనకి చాలా ఉందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభించడంతో పాటు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్త
మన కంప్యూటర్లో కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు
సాధారణంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లు మరియు టాబ్లెట్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కి అందుబాటులో ఉన్న అప్లికేషన్‌ల వలన ఆండీ, బ్లూస్టాక్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగించి మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం లోనే మనకు కావలసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు నడుపుకోవచ్చు. మరొక విధానం ద్వారా వర్చువల్ బాక్స్ అను సాఫ్ట్వేర్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ని వర్చువల్ ఆపరేటింగ్ సిస్టంగా మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం లోనే వాడుకోవచ్చు. ఈ పద్దతులన్ని మరొక ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పని చేస్తుంటాయి. అంటే ఇవి పని చేయడానికి మన కంప్యూటరులో అప్పటికే మరొక ఆపరేటింగ్ సిస్టం పని చేస్తుండాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న పద్దతి ద్వారా మనం విండోస్ లేదా లినక్స్ ఆపరేటింగ్ సిస్టం మనం ఎలా అయితే మన కంప్యూటరులో ఇన్‌స్టాల్ చేసుకుంటామో అదేవిధంగా (మరొక ఆపరేటింగ్ సిస్టం పై ఆధారపడకుండా) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
మొబైళ్ళు మరియు టాబ్లెట్లలో వాడబడుతున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని లాప్‌టాప్ మరియు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీలుగా తయారుచేసారు. ఇది ఒపెన్ సోర్స్ఆపరేటింగ్ సిస్టం. దీనిని ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ నుండి కోడ్‌ని తీసుకొని ఆండ్రాయిడ్ -x86గా పోర్ట్ చేసారు. ఇది కూడా ఒపెన్ సోర్స్ఆపరేటింగ్ సిస్టం.
లాప్‌టాప్‌లో నేరుగా ఇన్‌స్టాల్ చెయ్యబడిన ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం |
ఈ ఆండ్రాయిడ్ -x86 ఆపరేటింగ్ సిస్టంని క్రింది లంకె నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
దింపుకున్న ఇమేజి ఫైల్ ని యూనెట్‌బూటిన్ మరియు లినక్స్ లైవ్ యూయస్‌బి క్రియేటర్ వంటి సాఫ్ట్‌వేర్లని ఉపయోగించి ఇన్‌స్టాలేషన్ డిస్క్‌ని తయారుచేసుకోవచ్చు లేదా సీడీలోకి వ్రాసుకొని ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని వేరొక ఆపరేటింగ్ సిస్టం తొ డ్యూయల్ బూట్ గా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
మీరు కూడా సులభంగా కంప్యూటర్ ట్యుటోరియళ్ళు తయారుచేయవచ్చు
మనం సాధారణంగా కంప్యూటరు లేదా వివిధ సాఫ్ట్‌వేర్ల గురించి నెట్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియళ్ళను చూసి తెలుసుకుంటాము. మొదట్లో వివరణాత్మక వ్యాసాల రూపంలోను తరువాత చిత్రాలతొ కూడిన వ్యాసాల రూపంలోను ఈ ట్యుటోరియళ్ళు ఉండేవి. కొంతకాలంగా మనకి నెట్లో ఎక్కువగా వీడియో ట్యుటోరియళ్ళు అందుబాటులోకి వచ్చాయి. అవి వ్యాసరూపంలో ఉన్న వాటికన్నా ఎక్కువగా ఆదరణ పొందాయి దానికి కారణం అవి ఎటువంటి పరిజ్ఞానం లేనివారికి కూడా సులభంగా అర్ధం కావడమే.
వీడియో ట్యుటోరియళ్ళు పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే ఎవరైనా సులభంగా తయారు చేయవచ్చు. మనం కంప్యూటర్లో చేస్తున్న పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను రికార్డు చేయడానికి మనకి అందుబాటులో ఉన్న ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కామ్ స్టూడియో. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేరు కంప్యూటరు నిపూణులకి, ఒత్సాహిక బ్లాగర్లకి, ఉపాధ్యాయులకి మరియు విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.
తక్కువ పరిమాణం కలిగి తక్కువ కంప్యూటరు వనరులని వాడుకుంటూ పనిచేసే కామ్ స్టూడియోని ఉపయోగించి విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న కంప్యూటర్లలో మనం వివిధ సాఫ్ట్‌వేర్, ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు చిట్కాలను రికార్డ్ చేయవచ్చు. రికార్డ్ చేయబడిన వీడియోలు మంచి నాణ్యతతో కూడి ఉండడమే కాకుండా వీడియో షేరింగ్ సైట్లలో అప్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా తక్కువ పరిమాణం తో ఉండడం కూడా దీని ప్రత్యేకత. అంతేకాకుండా తక్కువ పరిజ్ఞానం కలవారు వాడుకోవడానికి వీలుగా సరళంగా ఉంటూనే నిపూణులకి కోసం వివిధ ఆప్షన్‌లు దీని సొంతం.
కామ్‌స్టూడియోని క్రింది నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://camstudio.org/
సపోర్ట్ నిలిపి వేయబడిన పాత కంప్యూటర్లకు జీవం పొయ్యండిలా
మనం ఇప్పుడు వాడుతున్న పాత కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయడం వలన ఇక పై ఆ ఆపరేటింగ్ సిస్టంకు సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక ప్రత్యామ్నాయాల కోసం చూడవలసిన అవసరం ఏర్పడింది. మనం డబ్బులు పెట్టి కొత్త ఆపరేటింగ్ సిస్టం కొన్నప్పటికి అది మన పాత కంప్యూటర్ యొక్క సామర్ధ్యం తక్కువగా ఉండడం వలన దానిలో పని చేయకపోవచ్చు. అందువలన మనం తప్పనిసరిగా మన కంప్యూటరు యొక్క సామర్ధ్యాన్ని విడిబాగాలను మార్చుకోవడం లేదా రామ్ వంటి విడిబాగాలను అధనంగా చేర్చడం ద్వారా పెంచుకోవలసి రావచ్చు. వీలుకాని పరిస్థితులలో పూర్తిగా కంప్యూటరుని మార్చవలసి రావడం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఆపరేటింగ్ సిస్టం తయారీదారు మరియు కంప్యూటర్ల తయారీదారులు కలిసి టెక్నాలజీ మెరుగుదల పేరుతో కొంతకాలానికి కంప్యూటర్లు మార్చడాన్ని తప్పనిసరి అవసరంగా తయారుచేయడం. దానివలన మనకి ఏవో కొన్ని ప్రయోజనాలున్నప్పటికిని ఆర్ధికంగా (కంప్యూటర్లను మరియు ఆపరేటింగ్ సిస్టం మార్చడానికి పెట్టుబడి) మరియు పర్యావరణపరంగా చాలా (కంప్యూటర్ వ్యర్ధాలు పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించ బోవడం) నష్టదాయకం.
మన పాత కంప్యూటరును మార్చకుండానే సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడే ఆపరేటింగ్ సిస్టం మనకు అందుబాటులో ఉంటే దానికి పరిష్కారం దొరికినట్లే. అదీ ఉచితంగా దొరికితే ఇంకా బాగుంటుంది కదా. అవే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు. ఇవి లాభాపేక్షలేని కొన్ని సంస్థలచే మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే స్వచ్చందంగా అభివృద్ది చేయబడుతున్నాయి. పాత కంప్యూటర్లలో పనిచేయడానికి మనకు చాలా ఆపరేటింగ్ సిస్టంలు ఇప్పుడు మనకు ఇంటర్‌నెట్ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిరంతరం కొత్త పీచర్లతో అప్‌డేట్ అవుతూ, మనం చూడడానికి ఇప్పుడు వాడే ఆపరేటింగ్ సిస్టం లానే ఉండే లుబుంటు.
ఇది తక్కువ సామర్ధ్యం గల పాత డెస్క్‌టాప్, లాప్‌టాప్ మరియు మాక్ కంప్యూటర్లలో పనిచేయడానికి అనుగుణంగా వేగంగా, తేలికగా ఉండేటట్లు తయారుచేయబడింది. పెన్‌టియం 2, సెల్‌రాన్ వంటి పాత ప్రాససర్లతో ఉన్నటు వంటి కంప్యూటర్లలో కూడా పనిచేస్తుంది. తక్కువ వనరులని వాడుకొని వేగంగా పనిచేయడం దీని ప్రత్యేకత. అదే విధంగా కొత్త కంప్యూటర్ల కోసం 64బిట్ వెర్షను కూడా అందుబాటులో ఉంది. లుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. దీనిని పెద్దగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బాగా పాత సిస్టంలలో సీడీ ద్వారా లాప్‌టాప్‌లు కొత్త కంప్యూటర్లలో పెన్‌డ్రైవ్ ద్వారాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
లుబుంటు 14.04 డెస్క్‌టాప్ |
రాష్ట్ర విభజన - యక్స్‌పి సపోర్ట్ నిలిపివేత
యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సుమారు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించింది. దానికి అనుగుణంగా అప్పటి నుండి ప్రజలను ప్రత్యామ్నాయాల వైపు మళ్ళించడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు, ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. అయినప్పటికి ఇప్పటికి చాలా మంది యక్స్‌పిని వాడుతున్నారు. వారిలో సాధారణ ప్రజలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. వారు ఆదిశగా చర్యలను తీసుకుంటున్నట్లు ఏ పత్రికలోను రాలేదు. బహుషా వారు ఇప్పటికే యక్స్‌పి తరువాతి వెర్షన్‌లతో వచ్చే కంప్యూటర్లను కొనడానికి గుత్తేదారులను సిద్దం చేసుకొనే ఉండవచ్చు. టెండర్ల రూపం లో ప్రజాధనాన్ని అయినవారికి దోచిపెట్టే పందేరం మొదలైపోయి ఉండొచ్చు. మన ప్రక్క రాష్ట్రం తమిళనాడు విషయానికొస్తే ఆ ప్రభుత్వం యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోతున్న సందర్భంగా వివిధ శాఖలను ఉచితంగా లభించే ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టం లను వాడమని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
ఇక మన రాష్ట్రాని కొస్తే రాష్ట్ర విభజన నేపధ్యంలో యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లే ముఖ్యంగా నిర్మాణం కావలసిన సీమాంధ్ర ప్రాంతం. మనం ఇక్కడ సరిగా ఆలోచిస్తే విభజన నేపధ్యంలో అన్ని శాఖలు పునర్‌వ్యవస్థికరణ జరగనుండడం, యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయడం ఒకేసారి రావడం వలన మన రాష్ట్రాలకి మంచి అవకాశం వచ్చినట్లే. ఇప్పుడు ఉన్న కంప్యూటర్లలో యక్స్‌పికి బదులుగా మరో ఆపరేటింగ్ సిస్టంను కొనుగోలు చేయడం, తక్కువ సామర్ధ్యం గల కంప్యూటర్లని తొలగించి వాటి స్థానంలో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం వంటి ఖరీదైన ప్రయామ్నాయాలతో పాటు ఉన్న కంప్యూటర్లలోనే ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు మరియు సాఫ్ట్‌వేర్లను వాడుకోవడం వంటి ఉచిత ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది. విభజన నేపధ్యంలో నిధుల కొరత రెండు ప్రాంతాలలోను తప్పదు. మన ప్రభుత్వం ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను వాడుకలోకి తీసుకువచ్చి విలువైన ప్రజాధనాన్ని ఆధా చేసినచో ఆ నిధులను నిర్మాణ,పునర్‌నిర్మాణ పనులకి కేటాయించుకోవచ్చు.
ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నట్లే ఇప్పుడు ప్రజలకి కూడా ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. ప్రజాధనాన్ని స్వాహా చేసే నాయకులను కాకుండా ప్రజాధనాన్ని కాపు కాసే నేతలను ఎన్నుకోవలసిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కనుక ఆలోచించి మానసిక, భౌతిక ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి.
యక్స్‌పిని ఎందుకు సమాధి కట్టి సంతాపం?
ఏ వార్తా పత్రిక చూసినా యక్స్‌పి ఇక లేదు, యక్స్‌పికి సెలవు, సపోర్ట్ నిలిపివేత అని సంచలనాత్మక వార్తలు. సామాజిక అనుసంధాన వేదికలలో (పేస్‌బుక్,గూగుల్+,ట్విట్టర్ మొదలైన వాటిలో) అయితే మరి విపరీతంగా సమాధి కట్టి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక అసలు కారణాలు, వచ్చే సమస్యలు, తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కారాలు మనం ఈ రోజు తెలుసుకోవలసిందే.
యక్స్‌పి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం. దాని తయారీదారు అయిన మైక్రోసాఫ్ట్ వాడు అధికారికంగా సపోర్ట్ నిలిపివేయడం వలన దానికి ఉన్న ప్రాచుర్యం మరియు ఆదరణ కారణంగా ఈ విధంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఇక నుండి మైక్రోసాఫ్ట్ నుండి దానికి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావన్నమాట. దానివలన సగటు కంప్యూటరు వాడుకరికి వచ్చే ఇబ్బంది ఏమిటి? మనకు కనిపించే కధనాలలో అయితే బధ్రత మరియు కొత్త ఫీచర్లు దానికి కారణంగా చెపుతున్నారు. మన శ్రేయస్సుకోరి ఈవిధంగా ప్రచారం జరుగుతుందా? లేక మనల్ని బయభ్రాంతులకి గురిచేసి మరో ఆపరేటింగ్ సిస్టం లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న లాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనుక్కోనే దిశగా మనల్ని తయారుచేయడానికా?
చిన్నారి పొన్నారి యక్స్‌పి నిన్నెవరు చంపారమ్మా అని యక్స్‌పిని అడిగితే అది కచ్చితంగా మైక్రో సాఫ్ట్ వాడు నన్ను చంపాడు, కంప్యూటరు తయారీదారులు నా పీక నొక్కారని అంటుందేమో. ఎందుకంటే సాంకేతికంగా యక్స్‌పి కి ఇప్పుడు సపోర్ట్ నిలిపివేసి ఉండవచ్చు, కాని మనం కొన్ని విషయాలు గమనిస్తే మనకి ఎప్పుడో నిలిపివేసినట్లు అర్ధమవుతుంది. మైక్రోసాఫ్ట్ వాడి ఆస్థాన వెబ్ బ్రౌసర్, ఆఫీస్, మీడియా ప్లేయర్, ఇ మెయిల్ క్లయింట్ మరియు వివిధ సాఫ్ట్వేర్లకి వాటి కొత్త వెర్షన్‌లను యక్స్‌పికి విడుదలచేయడం ఎప్పుడో నిలిపివేసింది. అదేవిధంగా మనం కంప్యూటరు తయారీదారు వేబ్ సైటులో యక్స్‌పికి డ్రైవర్ల గురించి వెతికితే యక్స్‌పి తరువాతి ఆపరేటింగ్ సిస్టంలకు దొరుకుతాయి, కాని యక్స్‌పికి దొరకవు. అదేవిధంగా ఎప్పటి నుండో యక్స్‌పితో కంప్యూటర్లు అమ్మడంలేదు. యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సేవలు ఇప్పటికే క్రమక్రమంగా ఎప్పుడో నిలిపివేసింది. కొత్తగా నిలిపివేయడానికి ఏమిలేదు. ఇప్పటి యక్స్‌పి వాడుకర్లు ఎక్కువ మంది ఉండడం వలన మిగిలిన సాఫ్ట్వేర్ తయారీదారులు వారివారి సాఫ్ట్వేర్లను విడుదలచేస్తూనే ఉన్నారు. కేవలం మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులు ఇరువురు పరస్పర సహకారంతో మనల్ని మరో కంప్యూటరు లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కొనుగోలు చేయించడానికి సిద్దం చేస్తున్నారు. ఇక్కడ మనం వాళ్ళను తప్పుపట్టనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వ్యాపారులే కాని స్వచ్చంధ సంస్థలేమీ కాదుకదా.
సపోర్ట్ నిలిపివేయడం వలన మరి ఎవరికి నష్టం?
ఎవరైతే డబ్బులు పెట్టి యక్స్‌పిని కొనుక్కొని ఇప్పటికి దాని మీద ఆధారపడ్డారో వాళ్ళకి మాత్రమే.
మరి ఈ ప్రచారం వలన ఎవరికి లాభం?
మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులకి
పెద్దపెద్ద కంపెనీలు యక్స్‌పి నుండి మరొక ఆపరేటింగ్ సిస్టం కు వెళ్ళడానికి పూర్తిగా కంప్యూటర్లని మార్చవలసి రావడంతో ఖర్చుకి వెనకాడి మైక్రోసాఫ్ట్ నుండి యక్స్‌పికి డబ్బులిచ్చి సపోర్ట్ని కొనుక్కోవడానికి సిద్దపడ్డాయి. ముందుచూపు గల కొన్ని సంస్థలయితే ఇప్పటికే ఉచిత సాఫ్ట్‌వేర్లను వాడడం ఉద్యోగులకి అలవాటు చేసాయి. డబ్బున్న సంస్థలయితే ఇప్పటికే వేరే ఆపరేటింగ్ సిస్టంతో కొత్త కంప్యూటర్లను కొనుక్కున్నాయి. గూగులోడయితే తెలివిగా ముందునుండే ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాడు. అయితే మరి సగటు యక్స్‌పి వాడుకరి పరిస్థితి ఏమిటి? తప్పని సరిగా వేరే ఆపరేటింగ్ సిస్టం లేదా కొత్త ఆపరేటింగ్ సిస్టం పనిచేసే కంప్యూటరు కొనుక్కోవలసిందేనా?
అవసరం లేదు. యక్స్‌పి మునుపటిలాగే పనిచేస్తుంది. కొంపలేం అంటుకోవు, మనం బేషుగ్గా వాడుకోవచ్చు. బద్రతా కారణాలరీత్యా యక్స్‌పి ఎప్పుడో బలహీనమయిపోయింది. కొత్తగా అప్‌డేట్స్ రాకపోవడం వలన మనం కోల్పోవడానికి ఏమిలేదు. మనం చేయ్యాల్సిందల్లా మనం ఇప్పటిలాగే మన కంప్యూటరును మంచి యాంటీవైరస్ తో తరచు స్కాన్ చేసుకోవడం,ఆ యాంటివైరస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, నమ్మకం కలిగిన సైట్లనుండి మాత్రమే సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకోవడం, పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ముందు తప్పక స్కాన్ చేసి తెరవడం వంటి ప్రాధమిక విషయాలు పాటించడం ద్వారా మనం ఎప్పుడూ వాడుక్కున్నట్లే వాడుకోవచ్చు. ఈ ప్రచారం అంతా మన జేబు చిల్లు పెట్టదానికే. ఒకవేళ మనం వేరే ఆపరేటింగ్ సిస్టం కొన్నామనుకోండి రాబోవు రోజుల్లో దానికి కూడా సపోర్ట్ నిలిపివేస్తాడు కదా? మరి దానికి శాశ్వత పరిషారం లేదా?
లేకేం మనం మారడానికి సిద్దంగా ఉంటే మనకి ఉచితంగా ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటరులోనే వాడుకోవడానికి ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేకుండానే దొరికే ఉచిత ఆపరేటింగ్ సిస్టం లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మొదట కంప్యూటరు అంటే యక్స్‌పి లేదా విండోస్ అన్న బావన నుండి మనం బయటపడితే చాలు.
ఇప్పటికే ఉచిత సాఫ్ట్వేర్ల దెబ్బకి పలు సాఫ్ట్వేర్ల ధరలు తగ్గడం మనం చూసాం. ఈ విధంగా మనం ఉచిత సాఫ్ట్వేర్లను వాడితే తొదరలోనే మైక్రోసాఫ్ట్ నుండి కూడా ఉచిత ఆపరేటింగ్ సిస్టం మనం చూడగలం.
యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయడంతో పేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న ఒక చిత్రం |

వెబ్ సైట్లలో లో ఉండే అవాంచిత వ్యాపార ప్రకటనలను నివారించండిలా
మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా
చాలారకాల ప్రకటనలు(flash adds,text adds,popup) కనిపిస్తుంటాయి. వీటివలన
వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం
మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఈ వీడియోలో చూడవచ్చు.
పేదవారికోసం ఉచితంగా ఆపిల్(మాక్) ఆపరేటింగ్ సిస్టం
ఆపిల్ అంటే అదో ఖరీదైన బ్రాండ్. ఫోన్, టాబ్, డెస్క్ టాప్ మరియు లాప్ టాప్ అన్ని పరికరాలు వాడి సొంత ఆపరేటింగ్ సిస్టం మాక్ తో పాటు వస్తుంటాయి. మనం మాక్ ఆపరేటింగ్ సిస్టం కావాలంటే తప్పనిసరిగా వాడి పరికరాలను కొనాలి లేదా మాక్ ఒయస్ ని కొనుక్కోవాలి. మనం వాడుతున్న డెస్క్ టాప్, లాప్ టాప్ లేదా టాబ్లెట్ లో మాక్ ని ఇన్ స్టాల్ చెసుకోవాలంటే మరి మాక్ ని కొనుక్కోవలసిందేనా?
కొనుక్కోనవసరం లేకుండానే మాక్ లాంటి ప్రయామ్నాయాన్ని ఉచితంగా ఎవరైనా వారి కంప్యూటర్లు మరియు లాప్ టాప్ లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆ ప్రత్యామ్నాయం పేరే పియర్ ఒయస్. నిన్ననే విడుదలైన పియర్ ఒయస్ 8 ని ఎవరైనా ఉచితంగా డౌంలోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. ఇది ఇంచుమించుగా మాక్ లానే ఉంటుంది కాని ఇది ప్రముఖ లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లైన ఉబుంటు మరియు డెబియన్ ఆధారంగా తయారుచేయబడింది.
ఆకర్షణీయమైన రూపంతో మాక్ ని తలపించేలాఉండే ఈ పియర్ ఒయస్ తో మనకి కావలసిన అన్ని కొడెక్ లు మందే ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. దీనిని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పియర్ ఒయస్ 8 |
పియర్ ఒయస్ కి సంబందించి మరిన్ని చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.
వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోనే సాఫ్ట్వేర్ ఉచితంగా
సాధారణంగా వివిధ వెబ్ సైట్లలో గ్యాలరీలుగా ఉంచిన సినితారల ఫొటోలు లేదా ఫేస్ బుక్ వంటి సామాజిక అనుసంధాన సైట్లలో ఉంచిన బంధుమిత్రుల ఫొటోలు మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలంటే ప్రతి ఫొటోని తెరిచి సేవ్ ఇమేజ్ అన్న ఆప్షన్ని ఉపయోగించి సేవ్ చేసుకుంటాము. ఒకటి రెండు ఫొటోలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు. కానీ వందల ఫొటోలు డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఈ పధ్దతి పనికిరాదు. దీనివలన విసుగు, సమయం వృధా కావడం జరుగుతుంది. సగటు కంప్యూటరు వాడుకరి వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే బల్క్ ఇమేజి డౌన్లోడర్ వంటి సాఫ్ట్వేర్లు కొనుక్కోవలసిందేనా?
అవసరం లేదు మనం డబ్బులు పెట్టకుండా ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్వేర్ ఉచితంగా పొందవచ్చు. లైక్, షేర్, రిజిస్టర్ మరియు సబ్ స్రైబ్ చేసుకోకుండానే ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. డౌన్లోడ్ దెమ్ ఆల్ అన్న ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఉపయోగించి ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదట మనం డౌన్లోడ్ దెమ్ ఆల్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనిని ఉపయోగించి వెబ్ పేజిలో ఉన్న అన్ని ఫొటోలను, అన్ని వీడియోలను, డాక్యుమెంట్లు లేదా మనకు కావలసిన ఫొటోలు లేదా వీడియోలను మరియు గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ దెమ్ ఆల్ ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఎలా ఉపయోగించాలో About dTa! లో వీడియోలలో వివరించబడింది.
డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్ని తెరిచి అక్కడ ఉన్న + బటన్ని నొక్కినపుడు క్రింది చిత్రంలో వలే మరొక విండో తెరవబడుతుంది. దానిలో మనం డౌన్ లోడ్ చేయాలనుకున్న గ్యాలరీకి సంభందించిన వెబ్ చిరునామాని మరియు ఎక్కడ సేవ్ చెయ్యాలి అన్నదాన్నిని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని నొక్కితే మనకు కావలసిన చిత్రాలు పూర్తి రిజొల్యూషన్ తో ఒకదాని తరువాత ఒకటి డౌన్ లోడ్ చేయబడతాయి.
చిత్రాల యొక్క వెబ్ చిరునామాను ఎలా ఇవ్వాలి?
మొదట ఒక చిత్రం యొక్క వెబ్ చిరునామాను తీసుకొని దానినిలో ఫొటో యొక్క సంఖ్య ని మనకు కావలసిన చిత్రాల ను బట్టి ఆ గ్యాలరీలో ఉన్న చిత్రాల సంఖను బట్టి [ఈ చిత్రం నుండి:ఈ చిత్రం వరకు] ఇలా మార్చుకోవాలి. ఉదాహరణకు www.example.org లో వంద చిత్రాలు ఉన్నాయనుకుంటే మొదటి చిత్రం యొక్క చిరునామా www.example.org/image1.jpg అనుకుంటే 1ని [1:100] గా మార్చుకోవాలి. అపుడు ఆ చిరునామా ఇలా ఉంటుంది. www.example.org/image[1:100]. ఆ చిరునామాని డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్లో ఇచ్చి అన్ని చిత్రాలను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
డౌన్ లోడ్ దెం ఆల్ యాడ్ ఆన్ ని తెరవడం |
డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్ని తెరిచి అక్కడ ఉన్న + బటన్ని నొక్కినపుడు క్రింది చిత్రంలో వలే మరొక విండో తెరవబడుతుంది. దానిలో మనం డౌన్ లోడ్ చేయాలనుకున్న గ్యాలరీకి సంభందించిన వెబ్ చిరునామాని మరియు ఎక్కడ సేవ్ చెయ్యాలి అన్నదాన్నిని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని నొక్కితే మనకు కావలసిన చిత్రాలు పూర్తి రిజొల్యూషన్ తో ఒకదాని తరువాత ఒకటి డౌన్ లోడ్ చేయబడతాయి.
డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్ |
చిత్రాల యొక్క వెబ్ చిరునామాను ఎలా ఇవ్వాలి?
మొదట ఒక చిత్రం యొక్క వెబ్ చిరునామాను తీసుకొని దానినిలో ఫొటో యొక్క సంఖ్య ని మనకు కావలసిన చిత్రాల ను బట్టి ఆ గ్యాలరీలో ఉన్న చిత్రాల సంఖను బట్టి [ఈ చిత్రం నుండి:ఈ చిత్రం వరకు] ఇలా మార్చుకోవాలి. ఉదాహరణకు www.example.org లో వంద చిత్రాలు ఉన్నాయనుకుంటే మొదటి చిత్రం యొక్క చిరునామా www.example.org/image1.jpg అనుకుంటే 1ని [1:100] గా మార్చుకోవాలి. అపుడు ఆ చిరునామా ఇలా ఉంటుంది. www.example.org/image[1:100]. ఆ చిరునామాని డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్లో ఇచ్చి అన్ని చిత్రాలను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పిల్లలను పెద్దలను ఆకట్టుకునే అధిక నాణ్యత కలిగిన చిన్న యానిమేషన్ సినిమా ఉచితంగా
ఉబుంటు, బ్లేండర్ మరియు గింప్ వంటి ఉచిత సాఫ్ట్వేర్లను ఉపయోగించి తయారుచేసిన చిన్న యానిమేషన్ సినిమా బిగ్ బక్ బన్ని. అధిక నాణ్యత కలిగిన ఈ సినిమా మాటలు లేనప్పటికి పిల్లలను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని హెచ్ డి టీవి లో చూస్తే దీని నాణ్యత పెద్దవాళ్ళను కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇక్కడ నుండి బిగ్ బక్ బన్ని సినిమాను మనకు కావలసిన ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Mac కేనా డాక్?
మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయ్బడిఉన్న వివిధ అప్లికేషన్లు తెరవడానికి సాధారణంగా డెస్క్ టాప్ ఇకాన్, మెనూ, టాస్క్ బార్, లాంచర్ వంటి వివిధ పధ్ధతులు వాడుతుంటాము. అప్లికేషన్లు తెరవడానికి తమాషా అయిన కంటికి ఇంపైన మరొక విధానమే డాక్. ఆపిల్ వాడి ఖరీదైన ఆపరేటింగ్ సిస్టం అయిన మాక్ ద్వారా ఈ డాక్ బాగా ప్రసిధ్ది చెందినది. అంత ఖరీదు పెట్టలేని, ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడేవారికి డాక్ లేదా?
ఉచితంగా దొరికే డాక్ లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కైరో డాక్. ఇది పూర్తిగా ఉచితమే. ఇది ఉచిత స్వేచ్చా సాఫ్ట్ వేర్. ఎవరైనా ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది డెబియన్, ఉబుంటు, మింట్, మరియు ఫెడోరా వంటి అన్ని ఉచిత ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది. దీనిని మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్ వేర్ సెంటర్ అప్లికేషన్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కైరో డాక్ కి రకరకాల థీంలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇకాన్లు రూపం,పరిమాణం, కదలికలు, వాటిని నొక్కినపుడు అవి ప్రవర్తించే విధానం మరియు విండో తెరవబడు విధానం వంటి అన్ని లక్షణాలు మనకు నచ్చినట్లు మార్చుకోగలగడం లెక్కలేనన్ని ఆప్షన్లు కలిగి ఉండడం కైరో డాక్ ని మిగిలిన వాటి నుండి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కైరో డాక్ తక్కువ కాన్ఫిగరేషన్ గల సిస్టం లలో కూడా బాగా పనిచేస్తుంది.
గ్నోం డెస్క్ టాప్ పై కైరో డాక్ |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)