సాధారణంగా యూట్యూబ్ మరియు డైలీమోషన్ వంటి సైట్ల నుండి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి బ్రౌజర్ ప్లగిన్‌లను మరియు ట్రైల్ వెర్షను సాఫ్ట్‌వేర్లను వాడుతుంటాము. ఈ ట్రైల్ వెర్షను సాఫ్ట్వేర్లు యాడ్స్‌తో విసిగిస్తుంటాయి. యూట్యూబ్, డైలీమోషన్, విమియో, మెటాకేఫ్, యుకు, మైవీడియో, మైస్పాస్ మరియు క్లిప్‌ఫిష్ వంటి వీడియో షేరింగ్
సైట్ల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచిత ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది.
సైట్ల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచిత ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది.
క్లిప్ గ్రాబ్ ని అను ఈ ఉచిత సాఫ్ట్వేర్ లినక్స్,విండోసు మరియు మాక్ ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి వీడియోలను మనకు కావలసిన నాణ్యతతో, మనకు కావలసిన ఫార్మాటులో డొన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియోల యొక్క సౌండ్ ట్రాక్ ని మాత్రమే mp3 ఫార్మాటులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియో యొక్క చిరునామాని ఇచ్చి లేదా వీడియోలని వెతికి డౌన్‌లోడ్ చేసుకునే సధుపాయం దీనిలో గలదు. విండోస్ మరియు మాక్ వాడేవారు ఇక్కడ నుండి దింపుకోవచ్చు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడేవారు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఇక్కడ వివరించబడింది.