ఆండ్రాయిడ్
ఫోన్లలో తెలుగులో టైప్ చెయ్యడానికి చాలా కీబోర్డులు ఉన్నప్పటికిని వాటిలో
వత్తులు, పొల్లులు టైప్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు
తెలుసుకోబోయే కీబోర్డ్ యాప్ ను ఉపయోగించి ఎవరైనా సులభంగా టకాటకా తెలుగులో
టైప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ తో డిఫాల్ట్‌గా వచ్చే
కీబోర్డ్ ని పోలిఉండి,
తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మొబైళ్ళలో చేత్తో రాయడానికి
ఈ మధ్యన గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములో వివిధ స్థానికభాషలకు మధ్దతును కల్పించడంతో పాటు ఇన్‌పుట్ టూల్స్ లో కూడా స్థానికభాషలను పరిగణలోకి తీసుకుని తగిన మధ్దతును అందిస్తుంది. మొబైళ్లలో సాధారణంగా మనం టైప్ చేయడానికి వాడే కీబోర్డ్ అప్లికేషన్‌తో పాటు అధనంగా నోటిమాటను కూడా అక్షరాలుగా మార్చగలిగే సదుపాయాన్ని ఇప్పటికే కల్పించిన గూగుల్ తాజాగా నేరుగా చేతివ్రాతను అక్షరాలుగా మార్చే
ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్ చేసుకోవడానికి
సాధారణంగా కంప్యూటర్లలో తెలుగు టైప్ చేయడానికి అధనంగా సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్ చేసుకోవడానికి సెట్టింగులను ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.
ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడం ఎలా?
ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడానికి ప్లేస్టోర్‌లో దొరికే పలురకాల అప్లికేషనులు ఇన్‌స్టాల్ చేసుకోవలసివచ్చేది. ఇప్పుడు ఇవేమి అవసరం లేకుండానే కేవలం చిన్న సెట్టింగును మార్చుకోవడం ద్వారా తెలుగు సులభంగా ఏవిధంగా టైప్ చేసుకోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చు.
తెలుగు అక్షరాలను మాటలుగా మార్చడానికి
ఆంగ్ల అక్షరాలను చదివి వినిపించగలిగే సాఫ్ట్‌వేర్లు చాలానే ఉన్నప్పటికి భారతీయ భాషలను చదివివినిపించే సాఫ్ట్‌వేర్లు తక్కువగా ఉన్నాయి. అందులోను తెలుగులో ఆ సౌకర్యం ఇంకా తక్కువ. తెలుగు అక్షరాలను అంటే పాఠ్యాన్ని ఇన్‌పుట్‌గా ఇస్తే దానిని చదివి ధ్వని రూపంలో అవుట్‌పుట్‌ని అందించే సాఫ్ట్‌వేర్ ఈ టెక్స్‌ట్ టు స్పీచ్ సిస్టం. హైదరాబాద్ ఐఐఐటి కి
ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు
ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి కావససిన
మొట్టమొదటి తెలుగు మొబైల్ వెబ్ బ్రౌజర్
ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్‌లలో అన్ని మొబైల్ వెబ్ బ్రౌజర్‌లలో తెలుగు సరిగానే కనిపిస్తుంది. దీనికి కారణం ఆండ్రాయిడ్ 4.2.2 వెర్షనులో తెలుగు ఫాంట్ ఉండడం. 4.2.2 తరువాత వస్తున్న వెర్షన్‌లలో కూడా తెలుగు బాగానే కనిపిస్తుంది. తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్‌లలో కూడా ఇప్పుడు 4.2.2 లేదా తరువాతి వెర్షన్‌లు ఉండడం మనం గమనించవచ్చు. పాత ఫోన్‌లలో ఇప్పటికి తెలుగు చూడాలంటే తయారీదారు ఫాంటు ఇవ్వడంకాని మనం రూట్ చేసుకొని ఫాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.
ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ రాబోతుంది. మనం ఫైర్‌ఫాక్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌ని గమనిస్తే మనకు వివిధ భాషలలో అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్ కూడా ఇప్పుడు తెలుగుతో సహా పలుభాషలలో రాబోతుంది. అయితే విడుదలకు ముందే మనం ఇప్పుడే వాడుకోవచ్చు. అభివృద్ది దశలో ఉన్న ఈ వెర్షనును అరోరా అంటారు. దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ apk ఫైల్‌ని మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లు మొబైళ్ళలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలుంటే మొజిల్లా వారికి ఇక్కడ చెప్పినట్లు నివేదించడం ద్వారా మంచి విడుదలకు మనం కూడా సహాయపడవచ్చు. మరింకెందుకు ఆలస్యం తెలుగు భాషాభిమానులారా మీ వంతు సహాయం చెయ్యండి. మొదటి తెలుగుమొబైల్ వెబ్ బ్రౌజర్ స్క్రీన్‌షాట్లు క్రింద చూడండి.
ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో తెలుగు టైప్ చేయడం
ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తయారుచేసిన తెలుగుమాట అను ఉచిత తెలుగు టైపింగ్ కీబోర్డ్ అప్లికేషన్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో తెలుగు టైప్ చేయు విధానమును గురించి తెలుసుకోవచ్చు.
కంప్యూటర్లో తెలుగు వ్రాయడం ఎలా?
కంప్యూటర్లో తెలుగు వ్రాయడానికి
1.లేఖిని
http://lekhini.org/
2.గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ
2.గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ
http://google.com/ transliterate/indic/telugu
3.క్విల్ పాడ్
3.క్విల్ పాడ్
http://quillpad.com/telugu/
4.స్వేచ్ఛ
4.స్వేచ్ఛ
http://www.yanthram.com/te/
6.లిపిక్.ఇన్
6.లిపిక్.ఇన్
http://lipik.in/telugu.html
7.ఇన్ స్కిప్ట్
7.ఇన్ స్కిప్ట్
http://www.baraha.com/ download.htm
9.అను మాడ్యూలర్
9.అను మాడ్యూలర్
13.లినక్స్ లో
http://www.kamban.com.au/
15.TDIL
15.TDIL
16.Microsoft -Indian language input tool
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
1.ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత
2.పద్మ పొడగింత
3.తెలుగు టూల్‌బార్
http:// telugutoolbar.mozdev.org/
4. ప్రముఖ్ టైప్
4. ప్రముఖ్ టైప్
http://www.vishalon.net/ Download/tabid/246/Default.aspx
సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి.
సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి.
భారతీయ భాషలలోని
వార్తా పత్రికలను చదవడానికి:
ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్
http://www.google.com/ transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్
2. క్విల్‌ప్యాడ్
3. లేఖిని
http://lekhini.org/
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే. తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/ nikhile.html
4.ఐట్రాన్స్
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే. తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/
4.ఐట్రాన్స్
http://www.aczoom.com/itrans/ html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు.
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు.
http://mail.google.com/ support/bin/ answer.py?hl=en&answer=139576).
http://t13n.googlecode.com/ svn/trunk/blet/docs/ help_te.html#Store
http://t13n.googlecode.com/
వర్డ్ డాక్యుమెంట్ లో తెలుగు ని దాచుకోవడం:
మీరు విండోస్ విస్టా,7,8 వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరంగా ఉంది:.
లిపులు –లిప్యంతరీకరణ:
1.పద్మ ఉపకరణం
వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com)
ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ
అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది.
http://padma.mozdev.org/
2.హరివిల్లు ప్లగిన్
యూనీకోడ్ వెబ్‌పేజీని RTS లోకి మారుస్తుంది.
2.హరివిల్లు ప్లగిన్
యూనీకోడ్ వెబ్‌పేజీని RTS లోకి మారుస్తుంది.
http://plugins.harivillu.org/
3.అను2యూనికోడ్
3.అను2యూనికోడ్
అను 6లో గానీ 7లో గానీ టైప్ చేయబడి, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను ఇది యూనీకోడులోకి మారుస్తుంది. http://anu2uni.harivillu.org/
4.ఈమాట
4.ఈమాట
Non-Unicode Font to Unicode Converter.
http://eemaata.com/ font2unicode/index.php5
http://eemaata.com/
e-తెలుగు సౌజన్యంతో
మొబైళ్ళలో తెలుగు టైపు చెయ్యడం
ఈ క్రింది ఆప్స్‌ను ఉపయోగించి మీ చేతిఫోన్లలో మరియు టాబ్లెట్లలో సులువుగా తెలుగు టైపు చెయ్యవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన లంకెల నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో
1. తెలుగు మాట:
https://play.google.com/store/apps/details?id=com.telugu.telugumata
2. మల్టిలింగ్ కీబోర్టు:
https://market.android.com/details?id=com.klye.ime.latin&hl=te
3. పాణిని కీప్యాడ్:
https://play.google.com/store/apps/details?id=com.paninikeypad.telugu
4. సి-డాక్ జిస్ట్ వారి తెలుగు ఆప్:
http://apps.mgov.gov.in/searchapp.do?action=9&criteria=telugu
ఐఫోన్, ఐప్యాడ్ లో
1.ఐఫోన్ కొరకు తెలుగు:
http://itunes.apple.com/us/app/telugu-for-iphone/id419542358
2.ఐతెలుగు:
http://itunes.apple.com/us/app/itelugu-for-iphone/id426763937
3.తెలుగు మాట:
https://itunes.apple.com/in/app/telugumata/id728241499
విండోస్ ఫోన్లలో
1.ఇండీ టెక్స్ట్:
http://www.windowsphone.com/en-us/store/app/indie-text/3f41e457-cc17-4e09-9f01-fee36a66133d
e-తెలుగు సౌజన్యంతో
http://www.windowsphone.com/en-us/store/app/indie-text/3f41e457-cc17-4e09-9f01-fee36a66133d
e-తెలుగు సౌజన్యంతో
తెలుగు నేర్చుకున్న టీవీ
కంప్యూటర్లు, మొబైళ్ళు ఇప్పటికే తెలుగు అక్షరాలను చూపించగలుగుతు ఉన్నప్పటికి ఇంకా చాలా మొబైళ్ళు మాత్రం డిఫాల్ట్ గా తెలుగుని చూపించలేకపోవడం విచారించవలసిన విషయం. అయితే ఈ నేపధ్యంలో తెలుగు చూపించగలిగే పరికరాలకోసం వెతుకుతు టీవీల పై దృష్టి సారించగా టీవీలలో ఇప్పటికే ఒ.యస్.డి భాషగా హింది వంటి భారతీయ భాషలు ఉపయోగించబడినాయి. కాని నావరకు తెలుగు అక్షరాలను టీవీలలో ఇప్పటి వరకు చూడలేదు. పెన్ డైవ్ పెట్టుకొనే సధుపాయం ఉన్న నా సాంసంగ్ 32' యల్.ఇ.డి టీవీలో తెలుగు కనిపించవచ్చునేమో అనే ఆశతో చిన్న ప్రయోగం చేసాను. కొన్ని mp3 పైళ్ళను తీసుకొని వాటి మెటా డాటా(పాట, సినిమా,పాడినవారు వంటివి) ని తెలుగులోకి మార్చి టీవీలో ప్లే చేసినపుడు తెలుగు అక్షరాలను టీవీ ఇలా చూపించింది.
తెలుగు అక్షరాలను సరిగా చూపిస్తున్న సాంసంగ్ టీవీ |
తెలుగు మద్దతు లేని మొబైళ్ళలో కూడా అన్ని తెలుగు వెబ్ సైటులు చూడడానికి
ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు తెలుగులో వెబ్ సైటులు, బ్లాగుల సంఖ్య బాగా పెరగడం దానితో పాటు మొబైల్ ఫోన్లు, మొబైల్ ఇంటర్ నెట్ ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో ఉండడం వలన మొబైల్ నుండి కూడా వెబ్ సైట్లు చూడడం పెరిగింది. ఇక తెలుగు వెబ్ సైట్ల విషయానికొస్తే ఎగువ శ్రేణి మొబైళ్ళు, కొన్ని మధ్య శ్రేణి మొబైళ్ళు తెలుగు అక్షరాలు బానే చూపిస్తున్నాయి. కొన్ని మధ్య శ్రేణి మరియు దిగువ శ్రేణి మొబైళ్ళు, ఇతర దేశాలలో కొన్న మొబైళ్ళు మరియు చైనా మొబైళ్ళలో ఇప్పటికి తెలుగు చూపించలేకపోతున్నాయి. మొబైల్ ఇంటర్ నెట్ వాడుతు వాటిలో తెలుగు చూడలేనివారు, తెలుగుని మొబైళ్ళలో చూడవచ్చని తెలియనివారు ఇప్పటికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకొబోయే చిన్న చిట్కా పాతదే అందరికి తెలిసినదే అయినప్పటికి తెలియనివారికి ఉపయోగపడుతుందని వ్రాయడం జరిగింది.
తెలుగు అక్షరాలు గడులుగా కనిపించడం |
ఒపెరా మిని దిగువ శ్రేణి మొబైళ్ళలో డిఫాల్ట్ వెబ్ బ్రౌసర్ గా వస్తుంది. ఈ మొబైల్ వెబ్ బ్రౌసర్ దాదాపు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం(జావా, ఆండ్రాయిడ్, సింబియాన్, బడా) లలో పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా మొబైళ్ళకు లభిస్తుంది. ఒపెరా మిని వెబ్ బ్రౌసర్ నందు చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా మనం తెలుగు వెబ్ సైట్లను చూడవచ్చు. మొదట ఒపెరా మిని వెబ్ బ్రౌసర్ అడ్రస్ బార్ నందు opera:config అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు తెరవబడిన వెబ్ పేజిలో use bitmap fonts for complex scripts అన్న ఆప్షన్ ఎదురుగా yes ని ఎంచుకొని సేవ్ చేయాలి. తరువాత ఏదైనా తెలుగు అక్షరాలున్న సైటుని తెరిచినపుడు తెలుగు అక్షరాలు సరిగా కనపడడం మనం గమనించవచ్చు.
ఒపెరా మిని లో సెట్టింగ్స్ |
సెట్టింగ్స్ చేసిన తరువాత తెలుగు అక్షరాలు |
ఒకే నొక్కుతో ముప్పైకి పైగా తెలుగు డిక్షనరీల సమాచారం
తెలుగు అసోషియోషన్ ఆఫ్ నార్త్ అమెరికా సౌజన్యంతో రూపొందిన ఉచిత ఆన్ లైన్ డిక్షనరీ ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన. ఈ ఆన్ లైన్ డిక్షనరీ లో మనం ఆంగ్ల, తెలుగు పదాలకు అర్ధాలను వెతకవచ్చు. ఇప్పుడు ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన లో ముప్పైకి పైగా నిఘంటువుల సమాచారం చేర్చబడింది. మనం ఇక్కడ ఇవ్వబడిన శోధనలో ఒక పదాన్ని ఇచ్చినపుడు వెంటనే ఆ పదానికి సంభందించి ముప్పైకి పైగా తెలుగు నిఘంటువుల ఉన్న సమాచారం ఒకే సారి మన ముందుంచుతుంది. అంతే కాకుండా మన కంప్యూటర్లో ఎటువంటి కీబోర్డ్ లేఅవుట్ మార్చకుండానే ఆంగ్ల, తెలుగు పదాలను ఇక్కడ టైప్ చేయవచ్చు.
ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన |
తెలుగు మద్దతు లేని మొబైళ్ళలో కూడా తెలుగు వార్తా పత్రికలు చూడడానికి
ఈమధ్య మనదేశంలో కొన్న ఫోన్లు చాలావరకు తెలుగు మధ్దతు కలిగి ఉంటున్నాయి. అయినప్పటికి నెట్ సౌలభ్యం ఉండి తెలుగు చూడలేని ఫోన్లు కూడా చాలానే ఉన్నాయి. వారు కూడా తెలుగు వార్తా పత్రికలు తమ మొబైల్లో చూడడానికి ఉపయోగపడే, అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఒకే ఒకటి. అది ఇంచుమించు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం లలో పనిచేసుంది. జావా, సింబయాన్, ఐ ఒయస్, బ్లాక్ బెర్రి, ఆండ్రాయిడ్ మరియు విండోస్ మొబైళ్ళలో పనిచేసుంది.దీనిని ఉపయోగించి తెలుగు వార్తా పత్రికలు మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మళయాళం,హిందీ మరియు ఆంగ్ల వంటి 11 భాషలకి సంభందించిన 72 ప్రముఖ భారతీయ దిన పత్రికలు ఫోన్ లోనే చూడవచ్చు. అదే న్యూస్ హంట్. దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://m.newshunt.com అన్న సైటుకి మన ఫోను లేదా కంప్యూటర్ వెబ్ బ్రౌసర్ ద్వారా వెళ్ళి నేరుగా దిన పత్రికలను చదువుకోవచ్చు.
ఆండ్రాయిడ్ లో న్యూస్ హంట్ |
అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న
తెలుగుని కంప్యూటర్లో చూడవచ్చు, వ్రాయవచ్చని, తెలుగులో జాలాన్ని అన్వేషించవచ్చునని అందరికి తెలియజేయడానికి, రోజువారీ సంభాషణలని తెలుగులో జరుపుకోవడాన్ని ప్రోత్సహించడానికి, తెలుగులో అందుబాటులో ఉన్న అంతర్జాల సేవలను అందరికి తెలియజేయడానికి, సాఫ్ట్వేర్ల తెలుగీకరణని ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థ e-తెలుగు. తెలుగువారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలనే స్వప్నంతో ఆ దిశగా కృషిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ e-తెలుగు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నమోదయిన ఈ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు www.etelugu.org.
అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2006 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ముందుగా అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు. ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించి e-తెలుగుని ఏర్పాటుచేసారు.
e-తెలుగు కంప్యూటరులో తెలుగును స్థాపించుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందుకవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను కూడా తయారుచేసి ఉచితంగా అందిస్తుంది. తెలుగులో టైపు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. లిప్యంతరీకరణకు అవసరమైఅన ఉపకరణాల గురించి ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వివిధ కీబోర్డు లేఔట్లను వాడి తెలుగులో టైపు చేస్తున్నవారికి అవే లేఔట్లను వాడి యూనికోడులో కూడా టైపు చేసేందుకు అవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను తయారుచేసి, ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఈ విషయమై ప్రచారమూ చేస్తోంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. వివిధ సాఫ్టువేరు ఉపకరణాల స్థానికీకరణ గురించి తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి వాటికి సంబంధించిన విషయాలలో సాంకేతిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.
మన ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న తెలుగు ఫాంట్లను ఎలా ఉపయోగించుకోవచ్చు?
మన ప్రభుత్వం కంప్యూటర్లలో తెలుగు భాషా వాడకం పెంచడం కోసం తన వంతు ప్రయత్నంగా తెలుగు ఫాంట్లను ఉచితంగా అందరికి అందుబాటు లో ఉంచిన విషయం తెలిసిందే. వాటిని ఏవిధంగా సులభంగా సగటు కంప్యూటర్ వాడుకరి ఉపయోగించుకోవచ్చునో ఇక్కడ వివరించబడినది.
మొదట మనం మనకు కావలసిన ఫాంట్లను తెలుగు విజయం సైటు నుండి దిగుమతి చేసుకోవాలి. తరువాత ఆ ఫాంటును డబుల్ క్లిక్ చేసినపుడు క్రింద చిత్రంలో వలే కనిపించును.
ఇక్కడ ఇన్ స్టాల్ ని నొక్కినపుడు ఆ ఫాంటు మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేయబడుతుంది. తరువాత క్రింది చిత్రంలో వలే ఇన్ స్టాల్డ్ అని చూపించును.
అంతే ఇక ఆ ఫాంటున మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయి ఉన్న ప్రోగ్రాములు వాడుకోవడానికి అందుబాటులో ఉన్నట్లే. మనం ఇప్పుడు ఆ ఫాంటును ఈవిధంగా వర్డ్ లో ఉపయోగించుకొవచ్చు.
ఈవిధంగా వివిధ తెలుగు ఫాంట్లను వాడుకొని ఆకర్షణీయంగా డాక్యుమెంట్లను తయారుచేసుకోవచ్చును.
మనం ఆ డాక్యుమెంట్ ని ఫాంటు ఇన్ స్టాల్ చేయని కంప్యూటర్లో తెరచినపుడు అది క్రింది చిత్రంలో వలే సాధారణంగా కనిపించును.
ఆ డాక్యుమెంట్ వేరెవరికైనా పంపవలసినపుడు ఈ టపాలో చూపించినట్లుగా పిడియఫ్ గా మార్చి పంపిస్తే వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పంపిన డాక్యుమెంట్ ని యధాతధంగా చూడడానికి అవకాశం ఉంటుంది. పిడియఫ్ లోకి మార్చిన డాక్యుమెంట్ ని క్రింద చూడవచ్చు.
ఆండ్రాయిడ్ 4.2.2 లో మెరుగుపరచబడిన తెలుగు
ఆండ్రాయిడ్ 4.2.2 అప్ డేట్ విడుదలైంది. ఇప్పటి వరకు వచ్చిన వెర్షన్ లలో తెలుగు అక్షరాలు కనిపించేవికావు. ఆండ్రాయిడ్ 4.2.2 లో దానిని సరిచేసారు. ఇక్కడ ఉన్న బొమ్మలలో మనం దీనిని గమనించవచ్చు. జి మెయిల్,ఫేస్ బుక్ ఇలా ప్రతి ఆప్లికేషన్ లో తెలుగు సరిగా కనిపిస్తుంది.
ఉచిత తెలుగు సాఫ్ట్వేర్ సీడీ
సమాచార,సాంకేతిక సంచార మంత్రిత్వ
శాఖ భారతప్రభుత్వం వారు భారతీయ భాషలలో సమాచార మార్పిడికి ఉపకరణాలను, మెలకువలను రూపొందించేందుకు భారతీయ భాషల కోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.భాషాపరమైన అడ్డంకులు లేకుండా మనిషి, యంత్రం (కంప్యూటర్) మధ్య పరస్పర సమన్వయాన్ని రూపొందించడం, బహుభాషల విజ్ఞాన వనరులను ఏర్పాటు చేయడం, సృజనాత్మక సమాచార ఉత్పాదనలను, సేవలను రూపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.దీనిలో భాగంగా కార్పోరా, నిఘంటువులు, ఫాంట్లు, టెక్‌స్ట్ ఎడిటర్, పదబంధాల
పరిశీలనావ్యవస్థ, ఓసిఆర్, టెక్ట్స్ టూ స్పీచ్ వంటి సమాచార ప్రకియ ఉపకరణాలను
రూపొందించేందుకు పథకాలను చేపట్టారు.అంతేకాకుండా భారతీయ భాషలలో బ్రౌజర్లు, సమాచారం కోసం అన్వేషణ జరిపే సెర్చ్ ఇంజన్లు, ఇ.మెయిల్ వంటి
ఇంటర్ నెట్ ఉపకరణాలను అందుబాటులో ఉంచారు.అభివృద్ధి చేయబడిన ఈ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను, సేవలను అందరికీ అందచేయడానికి www.ildc.gov.in
మరియుwww.ildc.in
అను రెండు వెబ్ సైట్లను ఏర్పాటు
చేసింది. వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు కోరితే దీనికి
సంబంధిచిన
సీ.డీ. కూడా ఉచితంగా పంపుతారు.
తెలుగు సాఫ్ట్వేర్ ఉపకరణాలు సీడీ |
16 తెలుగు డిక్షనరీలు ఉచితంగా
ఏదైనా తెలుగు లేదా అంగ్ల పదానికి అర్ధం కావలసినపుడు మనం నిఘంటువు పై ఆధారపడుతుంటాము.దీనికి కొంత సమయం తీసుకుంటుంది.అయితే మనకి కావలసినపుడే చిటికెలో మనకి కావలసిన పదానికి అర్ధం మనముందుంచితె?అదీ ఒకటి కాదు 16 నిఘంటువులను వెతికి మన ముందుఉంచితే?చాల బాగుంటుంది కదు!
మరెందుకు ఆలస్యం తానా వారి అంధ్ర భారతి తెలుగు నిఘంటువుని చూడండి.ఇక్కడ ఉన్న శోధనలో మనం తెలుగు లేదా అంగ్ల పదాన్ని ఇచ్చినపుడు వెంటనే 16 నిఘంటువులను వెతికి క్షణాల్లో అర్ధాలను మన ముందుంచును.శోధనలో మనం నేరుగా తెలుగులో (ఫోనెటిక్)కూడా టైప్ చేయవచ్చు.మనం అక్షరాలను టైప్ చేస్తుండగానే గూగుల్ మాదిరిగా దానికి సంభందించిన పదాలను చూపిస్తుంది.
తొందరలో మరిన్ని నిఘంటువులను జతచేయ బోతున్నారు.ఈ పక్రియని వేగవంతం చేయడానికి మన మద్దతు కోరుతున్నారు.రండి మన తెలుగు వారికీ ఎంతో ఉపయోగపడే ఈ తెలుగు నిఘంటువుకి తోడ్పాటునిద్దాం.
తప్పక చూడవలసిన భారత ప్రగతి ద్వారం
భారత ప్రగతి ద్వారం(India Development Gateway) అనే ఈ వెబ్ పోర్టల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) వారు దీనిని అభివృద్ధి చేస్తున్నారు.భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదంచేసే విధంగా బహుళ భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వెబ్ పోర్టల్ లో వ్యవసాయం, ప్రాధమిక విద్య, ఆరోగ్యం, ఇ-పాలన, ఇంధన వనరుల రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
భారత ప్రగతి ద్వారం అని పిలువబడే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే , నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది. ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను మెరుగుపరుచుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది.
ప్రస్తుతానికి భారత ప్రగతి ద్వారం కొన్ని ముఖ్యమైన అంశాలు - అంటే ఆరోగ్యం(నీరు, పారిశుధ్యంతో సహా), ప్రాథమిక విద్య, వ్యవసాయం, గ్రామీణ శక్తి వనరులు, పరిసరాలు, ఇంకా ఇ-పాలన వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ వెబ్ పోర్టల్ వల్ల గ్రామీణ ప్రజలకూ, ప్రభుత్వానికీ, తదితర సంస్థలకు, ఇంకా విద్యా సంస్థలకు మధ్య ఉండే అంతరాన్ని బాగా తగ్గించవచ్చు అనేది భారత ప్రగతి ద్వారం భావన. గ్రామీణాభివృద్ధిని సాధించడానికి ప్రజలు, సంస్థలు, అనుభవజ్ఞులు నలుమూలల నుంచి పరస్పర సహకారంతో అందరూ పాల్గొని పూర్తి ప్రజాస్వామిక, ప్రజామిత్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపోందించడమే భారత ప్రగతి ద్వారం అంతిమ లక్ష్యం.
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), మార్చి 1988 లో శాస్త్ర, సాంకేతిక సంస్థగా ఏర్పడినది. సి-డాక్ ఒక పరిశోధన మరియు అభివృద్ది సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్, ప్రగతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పరమ్ వంటి సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం మరియు వాటిని ఉపయోగంలోకి తీసుకు రావడం చేస్తుంది. సి-డాక్ హైదరాబాద్ ఇ-సెక్యూరిటీ, ఇ-లెర్నింగ్, సప్లై చెయిన్ మేనేఙ్ మెంట్, ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ , వి.యల్.యస్.ఐ మరియు సిస్టమ్స్ డిఙైన్ వంటి వాటి పైన పరిశోధనలు చేస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)