మన ప్రభుత్వం కంప్యూటర్లలో తెలుగు భాషా వాడకం పెంచడం కోసం తన వంతు ప్రయత్నంగా తెలుగు ఫాంట్లను ఉచితంగా అందరికి అందుబాటు లో ఉంచిన విషయం తెలిసిందే. వాటిని ఏవిధంగా సులభంగా సగటు కంప్యూటర్ వాడుకరి ఉపయోగించుకోవచ్చునో ఇక్కడ వివరించబడినది.
మొదట మనం మనకు కావలసిన ఫాంట్లను తెలుగు విజయం సైటు నుండి దిగుమతి చేసుకోవాలి. తరువాత ఆ ఫాంటును డబుల్ క్లిక్ చేసినపుడు క్రింద చిత్రంలో వలే కనిపించును.
ఇక్కడ ఇన్ స్టాల్ ని నొక్కినపుడు ఆ ఫాంటు మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేయబడుతుంది. తరువాత క్రింది చిత్రంలో వలే ఇన్ స్టాల్డ్ అని చూపించును.
అంతే ఇక ఆ ఫాంటున మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయి ఉన్న ప్రోగ్రాములు వాడుకోవడానికి అందుబాటులో ఉన్నట్లే. మనం ఇప్పుడు ఆ ఫాంటును ఈవిధంగా వర్డ్ లో ఉపయోగించుకొవచ్చు.
ఈవిధంగా వివిధ తెలుగు ఫాంట్లను వాడుకొని ఆకర్షణీయంగా డాక్యుమెంట్లను తయారుచేసుకోవచ్చును.
మనం ఆ డాక్యుమెంట్ ని ఫాంటు ఇన్ స్టాల్ చేయని కంప్యూటర్లో తెరచినపుడు అది క్రింది చిత్రంలో వలే సాధారణంగా కనిపించును.
ఆ డాక్యుమెంట్ వేరెవరికైనా పంపవలసినపుడు ఈ టపాలో చూపించినట్లుగా పిడియఫ్ గా మార్చి పంపిస్తే వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పంపిన డాక్యుమెంట్ ని యధాతధంగా చూడడానికి అవకాశం ఉంటుంది. పిడియఫ్ లోకి మార్చిన డాక్యుమెంట్ ని క్రింద చూడవచ్చు.