ఈమధ్య మనదేశంలో కొన్న ఫోన్లు చాలావరకు తెలుగు మధ్దతు కలిగి ఉంటున్నాయి. అయినప్పటికి నెట్ సౌలభ్యం ఉండి తెలుగు చూడలేని ఫోన్లు కూడా చాలానే ఉన్నాయి. వారు కూడా తెలుగు వార్తా పత్రికలు తమ మొబైల్లో చూడడానికి ఉపయోగపడే, అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఒకే ఒకటి. అది ఇంచుమించు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం లలో పనిచేసుంది. జావా, సింబయాన్, ఐ ఒయస్, బ్లాక్ బెర్రి, ఆండ్రాయిడ్ మరియు విండోస్ మొబైళ్ళలో పనిచేసుంది.దీనిని ఉపయోగించి తెలుగు వార్తా పత్రికలు మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మళయాళం,హిందీ మరియు ఆంగ్ల వంటి 11 భాషలకి సంభందించిన 72 ప్రముఖ భారతీయ దిన పత్రికలు ఫోన్ లోనే చూడవచ్చు. అదే న్యూస్ హంట్. దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://m.newshunt.com అన్న సైటుకి మన ఫోను లేదా కంప్యూటర్ వెబ్ బ్రౌసర్ ద్వారా వెళ్ళి నేరుగా దిన పత్రికలను చదువుకోవచ్చు.
ఆండ్రాయిడ్ లో న్యూస్ హంట్ |