ఈ మధ్యన గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములో వివిధ స్థానికభాషలకు మధ్దతును కల్పించడంతో పాటు ఇన్‌పుట్ టూల్స్ లో కూడా స్థానికభాషలను పరిగణలోకి తీసుకుని తగిన మధ్దతును అందిస్తుంది. మొబైళ్లలో సాధారణంగా మనం టైప్ చేయడానికి వాడే కీబోర్డ్ అప్లికేషన్‌తో పాటు అధనంగా నోటిమాటను కూడా అక్షరాలుగా మార్చగలిగే సదుపాయాన్ని ఇప్పటికే కల్పించిన గూగుల్ తాజాగా నేరుగా చేతివ్రాతను అక్షరాలుగా మార్చే
అప్లికేషనును విడుదలచేసింది. గూగుల్ హాండ్‌రైటింగ్ ఇన్‌పుట్ గా వ్యవహరించే ఈ అప్లికేషనును ప్లేస్టోరు నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
అప్లికేషనును విడుదలచేసింది. గూగుల్ హాండ్‌రైటింగ్ ఇన్‌పుట్ గా వ్యవహరించే ఈ అప్లికేషనును ప్లేస్టోరు నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
అప్లికేషను తెరిచి సెట్టింగులలో మనకు కావలసిన భాషను ఎంచుకొని మనం పేపరుపై వ్రాసినట్లే వేలితో ఫోనులో వ్రాయడమే. మనం రాసిన చేతివ్రాతను అక్షరాలుగా మార్చుకోవడంతో పాటు తగిన సలహా అక్షరాలను కూడా చూపిస్తుంది. ఈ అప్లికేషనును ఉపయోగించి మెసెంజర్, పేస్‌బుక్ వంటి అన్ని అప్లికేషన్లలో మనం వ్రాసుకోవచ్చును. ఆండ్రాయిడ్ 4.0.3 మరియు ఆ పైన వెర్షను ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, మొబైళ్లలో పనిచేసే ఈ అప్లికేషను తెలుగుతో పాటు మరో 81 భాషలకు మధ్దతునిస్తుంది. తెలుగు వంటి సంక్లిష్ట లిపి ఉన్న భాషలను వ్రాయడానికి ఈ ఆప్లికేషను బాగా ఉపయోగపడగలదు.