ఇంటర్నెట్‌ స్వేచ్చని కాపాడుకుందాం రండి

స్వేచ్ఛగా మనం వాడుకుంటున్న ఇంటర్నెట్‌ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు మొబైల్ కంపెనీలు ట్రాయ్‌ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మన మొబైల్ ఇంటర్ వాడకంపై కీలకమైన నిర్ణయం తీసుకోబోయే ముందు ట్రాయ్  ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. మనం గనుక ఈ సమయంలో నిరసన వ్యక్తం చెయ్యకపోతే, ట్రాయ్ మొబైల్ కంపెనీల నిర్ణయాన్ని తన నిర్ణయంగా వెలువరించి మనపై భారాన్ని రుద్దక తప్పేట్టులేదు. దానివలన మనం భవిష్యత్తులో
మన ఇష్ట ప్రకారం కాకుండా నెట్‌వర్క్ కంపెనీలు వాడమన్న అప్లికేషన్లు వాడాల్సిరావచ్చు. అదేవిధంగా వారు అడిగినంత చార్జీలు చెల్లించాల్సిరావచ్చు. తద్వారా ఇంటర్ నెట్ వాడకంలో స్వేచ్చను మరియు డబ్బును నష్టపోవచ్చు.

అందుకే మన అభిప్రాయాన్ని  ట్రాయ్ కి నేరుగా ఓ మెయిల్ చేసి తెలియజేయజేద్దాం.

ట్రాయ్‌కి మన అభిప్రాయాన్ని ఎలా తెలియజేయాలి?

http://www.savetheinternet.in/  అనే లింకులోకి వెళ్ళి రెస్పాండ్ టు ట్రాయ్ అన్న బటన్‌ని నొక్కి అప్పుడు వచ్చే పాపప్ లో ఉన్న సమాధానాలను కాపీ చేసుకొని, తరువాత వచ్చే పేజిలో ఉన్న మెయిల్ లింకును నొక్కడం ద్వారా మన మెయిల్‌కు రిడైరెక్టు చేయబడుతుంది. అటోమెటిక్ గా కొత్త మెయిల్ ట్రాయి చిరునామా పై తెరవబడుతుంది. దానిలో పైన కాపి చేయబడిన సమాధానాలను అతికించి పంపించడమే.

అర్ధంకాకపోతే ఎలా చేయాలో  ఈ క్రింది వీడియోచూడండి.

https://www.youtube.com/watch?v=tXQ36e7xf8E

అసలు ట్రాయ్ నిర్ణయాన్ని మనమెందుకు వ్యతిరేకించాలి. దానివలన మనకు వచ్చే నష్టాలేమిటి? ఈ వీడియోలో చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=QkSp7rzZN24

మన కెందుకులే అని అనుకోవద్దు. మన ఈ చిన్న  నిర్లక్ష్యం మనకే పెద్ద నష్టం కలిగించవచ్చు. ఇప్పుడే మీ వ్యతిరేకతను ట్రాయ్‌కి పంపించండి. అంతేకాకుండా ఈ విషయాన్ని అందరికి తెలియజేసి ఇంటర్‌నెట్‌ని కాపాడుకొనే బాధ్యత మనందరిది. నెట్‌వర్క్ కంపెనీల ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ మూకుమ్మడిగా గళం వినిపిద్దాం.