ఫోన్లు, టాబ్లెట్లతో మొదలుపెట్టి టీవి, చేతిగడియరాలు, గేమింగ్ బాక్సులు మరియు కళ్ళజోళ్ళు వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఇప్పుడు వాహనాలను కూడా స్మార్ట్ గా మార్చబోతుంది. వాహనాల డాష్‌బోర్డులో ఉండే ఆడియో ప్లేయర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో శక్తివంతమై పాటలు వినడానికి మాత్రమే కాకుండా దారిచూపడానికి, చిరునామా చెప్పడానికి, దగ్గరలో ఉన్న ప్రదేశాల
వివరాలను తెలుసుకోవడానికి, వాతావరణ మరియు ట్రాఫిక్ వివరాలను తెలుసుకోవడానికి, ఫోను మాట్లాడుకోవడానికి మరియు సందేశాలను పంపుకోవడానికి (ఫోను డాక్ చేసినపుడు) మరియు పలు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా రాబోతున్నాయి.

వాహనాలకోసం గూగుల్ విడుదల చేసిన ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును ఆండ్రాయిడ్ ఆటోగా వ్యవహరిస్తారు. పయనీర్ ఎలక్ట్రానిక్స్ సంస్థతో కలిసి మూడూ మోడళ్లను అమెరికాలో విడుదలచేసింది. తొందరలో భారతదేశంలో కూడా లభించబోయో ఈ స్మార్ట్ డాష్‌బోర్డ్ పరికరాలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో పనిచేస్తాయి. అన్ని ప్రముఖ వాహన తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకొని రాబోయో రోజుల్లో కొత్తగా కొనే వాహనాల డాష్‌బోర్డులను ఆక్రమించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అలాగే పాత వాహనాల కోసం అధనపు సామాగ్రి తయారుచేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతుంది. దానికి సంబందించిన ఆండ్రాయిడ్ ఆటో యాప్‌ను ప్లేస్టోర్‌లో విడుదలచేసింది. దానిని ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలు ఆండ్రాయిడ్ ఆటో వెబ్‌సైటు నందు చూడవచ్చు.