ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు తెలుగులో వెబ్ సైటులు, బ్లాగుల సంఖ్య బాగా పెరగడం దానితో పాటు మొబైల్ ఫోన్లు, మొబైల్ ఇంటర్ నెట్ ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో ఉండడం వలన మొబైల్ నుండి కూడా వెబ్ సైట్లు చూడడం పెరిగింది. ఇక తెలుగు వెబ్ సైట్ల విషయానికొస్తే ఎగువ శ్రేణి మొబైళ్ళు, కొన్ని మధ్య శ్రేణి మొబైళ్ళు తెలుగు అక్షరాలు బానే చూపిస్తున్నాయి. కొన్ని మధ్య శ్రేణి మరియు దిగువ శ్రేణి మొబైళ్ళు, ఇతర దేశాలలో కొన్న మొబైళ్ళు మరియు చైనా మొబైళ్ళలో ఇప్పటికి తెలుగు చూపించలేకపోతున్నాయి. మొబైల్ ఇంటర్ నెట్ వాడుతు వాటిలో తెలుగు చూడలేనివారు, తెలుగుని మొబైళ్ళలో చూడవచ్చని తెలియనివారు ఇప్పటికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకొబోయే చిన్న చిట్కా పాతదే అందరికి తెలిసినదే అయినప్పటికి తెలియనివారికి ఉపయోగపడుతుందని వ్రాయడం జరిగింది.
|
తెలుగు అక్షరాలు గడులుగా కనిపించడం |
ఒపెరా మిని దిగువ శ్రేణి మొబైళ్ళలో డిఫాల్ట్ వెబ్ బ్రౌసర్ గా వస్తుంది. ఈ మొబైల్ వెబ్ బ్రౌసర్ దాదాపు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం(జావా, ఆండ్రాయిడ్, సింబియాన్, బడా) లలో పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా మొబైళ్ళకు లభిస్తుంది. ఒపెరా మిని వెబ్ బ్రౌసర్ నందు చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా మనం తెలుగు వెబ్ సైట్లను చూడవచ్చు. మొదట ఒపెరా మిని వెబ్ బ్రౌసర్ అడ్రస్ బార్ నందు opera:config అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు తెరవబడిన వెబ్ పేజిలో use bitmap fonts for complex scripts అన్న ఆప్షన్ ఎదురుగా yes ని ఎంచుకొని సేవ్ చేయాలి. తరువాత ఏదైనా తెలుగు అక్షరాలున్న సైటుని తెరిచినపుడు తెలుగు అక్షరాలు సరిగా కనపడడం మనం గమనించవచ్చు.
|
ఒపెరా మిని లో సెట్టింగ్స్ |
|
సెట్టింగ్స్ చేసిన తరువాత తెలుగు అక్షరాలు |