సాధారణంగా మనకి కనిపించే ఆఫీస్ అప్లికేషను ధర చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా మంది పైరేటెడ్ వెర్షను వాడుతుంటారు. దానికి చక్కని ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మనకి చాలా ఉందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభించడంతో పాటు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్త
వెర్షను విడుదలైనపుడు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. వేరొక ఆఫీస్ అప్లికేషను ఉపయోగించి తయారుచేసిన పైళ్ళను కూడా దీనిలో వాడుకోవచ్చు.
వెర్షను విడుదలైనపుడు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. వేరొక ఆఫీస్ అప్లికేషను ఉపయోగించి తయారుచేసిన పైళ్ళను కూడా దీనిలో వాడుకోవచ్చు.
లిబ్రేఆఫీస్ యొక్క కొత్త వెర్షను 4.3 ఈరోజు విడుదలైంది. ఈ వెర్షనులో అనేక దోషాలను సరిచేయడంతో పాటు వేరే ఆఫీస్ ఫైళ్ళకు గల మద్దతును మెరుగుపరిచారు. లిబ్రేఆఫీస్ 4.3 వెర్షనును ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.