తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్)
అనే ఆండ్రాయిడ్ అప్లికేషను ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషను నేరుగా మొబైల్ ఫోన్ లో తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలను అలర్ట్ రూపంలో చూపిస్తూంది. అంతేకాకుండా ఈ అమ్మ అప్లికేషనులో ప్రసవానికి ముందు, ప్రసవానంతరము, తల్లిబిడ్డల సంరక్షణలకు సంబంధించిన సూచనలను, గర్భంతో ఉన్న మరియు పాలిచ్చే
తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలను చదివి లేదా విని తెలుసుకొనే ఏర్పాటు చేయబడింది. ఈ అప్లికేషను ఆంగ్లం రానివారు తెలుగులో ఉపయోగించుకోవచ్చు, అలాగే తెలుగు చదవలేనివారు కూడా వినడం ద్వారా సూచనలు పొందవచ్చు.
ఈ అప్లికేషనును
సిడాక్ వారి వికాస్పిడియా సైటు నుండి ఉచితంగా మధర్.ఎపికే దింపుకోవచ్చు. ఈ అనువర్తనాన్ని ఉపయోగించుకోవడానికి వినియోగదారు పేరు,
వయస్సు , ఎత్తు మరియు చివరి ఋతుక్రమ తేది వంటి వ్యక్తిగత సమాచారం అందించడం
అవసరం.
ఈ అప్లికేషను ఆండ్రాయిడ్ 4.0 మరియు తరువాతి ఆండ్రాయిడ్ వెర్షనులలో పనిచేస్తుంది. మదర్ అనువర్తనం చివరి ఋతుక్రమ తేది ఆధారంగా సాధారణ
హెచ్చరికలను అందిస్తుంది. ఇది పదరూపములో మరియు శబ్దరూపములో కాలపట్టికలోని
తేదీ మరియు సమయం ఆధారంగా వినియోగదారుని అప్రమత్తం చేస్తుంది. ఇది ఒక
క్యాలెండర్ ను ఉపయోగించి మునుపటి హెచ్చరికలను వినడానికి / చూడటానికి
అనుమతిస్తుంది. ఈ అప్లికేషను గురించి క్రింది చిత్రాలలో చూడవచ్చు.
|
వివరాలు నమోదు చేసుకోవాలి |
|
స్వాగత సందేశం |
|
అలర్ట్ మెసేజి |
|
సూచన పూర్తి వివరణ |
|
గడచిన, రాబోవు సూచనలను క్యాలండరులో చూడవచ్చు. |