లాభాపేక్షలేకుండా స్వచ్చందంగా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ప్రకటనలు లేకుండా అందించడానికి ఏర్పడిన ఆన్‌లైన్ వేధిక వికీపీడియా. ఇది ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగుతో పాటు మరెన్నో ప్రపంచభాషలలో సమాచారాన్ని మనకందిస్తుంది. ఈ మహాయజ్ఞంలో మనలాంటి సాధారణ పౌరులు వారి తీరిక సమయాన్ని వెచ్చించి సమాచారాన్ని
పోగుచేస్తున్నారు. విజ్ఞానాన్ని అరచేతిలోకి (వికీపీడియా మొబైల్) అందుబాటులో తెచ్చిన వికీపీడియా ఇప్పుడు తన మొబైల్ యాప్‌ను మరింత అభివృద్ది చేసి మొబైల్ ద్వారానే వ్యాసాలను మార్చడానికి, సమాచారాన్ని చేర్చడానికి అనువుగా తయారుచేసారు. అలాగే కావలసిన పేజిలను దాచుకొని నెట్ అనుసంధానం లేనపుడు కూడా వ్యాసాలను చదువుకోవచ్చు.