ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ గురించి తెలుసుకోవాలని మనకి ఆసక్తి ఉంటే చాలు. టన్నుల కొద్ది సమాచారం మనకి అంతర్జాలంలో దొరుకుతుంది. కానీ సగటు రోజువారి ఫోన్ వినియోగదారుడి నుండి కాకలు తీరిన డెవలపర్లకి కావలసిన సమాచారం ఇకే చోట అందించాలంటే,ఎన్నో కంపెనీలు, మరెన్నో రకాల డివైస్ లు ప్రతీదాని గురించి సమగ్ర సమాచారం ఒకచోట అందించడం అంటే కష్టంతో, కర్చుతో కూడిన వ్యవహారమే కాకుండా ఇంచుమించుగా అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే డెవలపర్ల కోసం ఏర్పరచబడిన ఒక సమూహం వలన జరిగింది. అదే XDA డెవలపర్స్.
XDA డెవలపర్స్ అనబడు వెబ్ ఫోరంలో రోజువారి ఫోన్ వినియోగదారుడి ఉపయోగపడు చిట్కాలు,వీడియో పాఠాలు, విష్లేశణలు,వివరణలు, అప్లికేషన్లు, థీములు, రకరకాల కస్టం రాం లు, ఫోన్లు అన్ లాక్, రూట్ చేయు విధానము వాటికి కావలసిన సాఫ్ట్ వేర్లు మరియు అప్లికేషన్ డెవలపర్లకి మరియు ప్లాట్ ఫాం డెవలపరలి కావలసిన సమాచారం ఇలా సర్వం ఒకే వేధిక పై లభిస్తాయి. మనం ఈ ఫోరంలలో ఎర్పరచబడిన సౌలభ్యం వలన మన డివైస్ కి సంభందించిన సమాచారం సులభంగా వెతుక్కోవడానికి వీలుగా ఉంటుంది.
XDA డెవలపర్స్ లో ఒక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే కాకుండా ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం లు అయిన ఫైర్ ఫాక్స్ ఒయస్, టైజెన్, బడా, ఉబుంటు టచ్, జోలా సైల్ ఫిష్, వెబ్ ఒయస్ మరియు వాణిజ్య ఆపరేటింగ్ సిస్టం అయిన విండోస్ మొబైల్ గురించిన సమగ్ర సమాచారం ఇక్కడ దొరుకును. యాబై రెండు లక్షల మందికి పైగా నమోదు చేసుకొన్న వాడుకర్లని కలిగి ఉన్న XDA డెవలపర్స్ కి ప్రయామ్నాయం లేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న సమాచారాన్ని వాడుకొని లక్షల టపాలు వేల బ్లాగులు రాయొచ్చు. దీనిని సరిగ్గా వాడుకొంటే రాంబాబే కాదు ఎవరైనా ఆండ్రాయిడ్ నిపూణుడు కావచ్చు.