బాగా అమ్ముడు పోతుంది కాని మోటో జి ఫోన్ బాగానే ఉందా?

ఈ సంవత్సరం పిబ్రవరి నెల మొదటివారంలో ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా అమ్మకాలు ప్రారంబించిన మోటో జి మొదటిరోజే ఇరవై వేల ఫోన్‌లు అమ్ముడు పోయినాయి. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా అమ్ముడుపోయి ఉండవచ్చని అంచనా. మోటో జి 8జిబి మరియు 16 జిబి స్టోరేజ్‌తో లభిస్తుంది. 8 జిబి ఫోన్ 12,499 మరియు 16 జిబి
13,999 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్ వీటిని ఉచిత షిప్పింగ్ చేస్తుంది. మన దేశంలో విడుదలకాక మునుపే చాలా దేశాల్లో విడుదలైన ఈ గూగుల్ బడ్జెట్ ఫోన్ అప్పటికే విమర్శకుల, పరిశ్రమ ప్రసంశలు మంచి రివ్యూ రేటింగ్‌లను పొందడం వలన గూగుల్ కూడా ఈ ఫోన్ తయారీలో పాలుపంచుకోవడం, తప్పనిసరిగా మోటోరోలా తరువాతి వెర్షన్‌ అప్‌డేట్ విడుదల చేస్తామనడం మరియు సయనోజెన్‌మోడ్ ఈ ఫోన్‌కి అధికారికంగా రామ్‌ విడుదలచేస్తానని ప్రకటించడం వలన విడుదలైన మొదటి వారంలోనే ఈ ఫోన్‌ని కొనడం జరిగింది. అప్పటినుండి ఇప్పటి వరకు ఆరునెలల కాలం మోటో జి ని వాడి దాని పనితీరు, మన్నిక వంటి వివరాలు ఫోన్ కొనే వారికి ఉపయోగపడుతుందని రాస్తున్నాను.
  • ఫోన్ చూడడానికి ఆకట్టుకునే ఆకృతిలొ ఉండి చేతిలో మరియు జేబులో సులభంగా ఇమిడిపోవడంతో పాటు తక్కువ ఖరీదు ఫోన్‌లా అనిపించదు. అంతేకాకుండా పట్టుకోగానే దృడంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వెనుక పక్క కవర్ రబ్బరైజ్డ్ ప్లాస్టిక్ తోచేసినది కావడం వలన మృధువుగా అనిపిస్తుంది. 
  • క్వాల్‌కమ్‌ స్మార్ట్‌డ్రాగన్ 400 1.2 గిగాహెర్ట్‌జ్ క్యాడ్ర కోర్ సిపియు, ఆడ్రినో గ్రాపిక్స్ 300 450 మెగాహెర్ట్‌జ్ జిపియు మరియు 1జిబి రామ్‌ తో ఫోన్‌ తయారయింది. సాధారణంగా చవక ఫోన్‌లలో వాడే మీడియా టెక్ ప్రాససర్‌లతో పోల్చితే ఈ క్వాల్‌కమ్ ప్రాససర్ తక్కువ బ్యాటరీని వాడుకోవడం, తొందరగా వేడెక్కక పోవడం తో పాటు మంచి పనితీరు మన్నికను ఇస్తుంది. ఈ క్వాల్‌కమ్ ప్రాససర్లను సాధారణంగా ఎక్కువ ఖరీదు గల ఫోన్‌లలో వాడుతుంటారు. ఇక మోటో జి పనితీరు విషయాని కొస్తే అన్ని అప్లికేషన్లు తొందరగా తెరుచుకోవడంతో పాటు వేగంగా పనిచేస్తున్నాయి. ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ కూడా వేగంగా పనిచేస్తున్నాయి. మనం ఆడుతున్నపుడు ఫోన్‌ వేడెక్కడం లేదు. 
  • యస్‌డి కార్డ్ స్లాట్ లేదు. 8జిబి ఫోనులో 5.3 జిబి మరియు 16 జిబి ఫోనులో 13.2 జిబి మనం వాడుకోవడానికి స్టోరేజ్ సామర్ధ్యం వస్తుంది. అలాగే 50 జిబి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ సంవత్స్రరం పాటు ఉచితంగా ఇస్తున్నారు.
  • 4.5 ఇంచుల 720 హెచ్‌డి రిజల్యుషన్‌తో, ఇంచుకి 329 పిక్సెళ్ళతో స్క్రీన్ స్పష్టంగా, రంగులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫోటోలు మరియు వీడియోలు చూడ్డానికి చాలా బాగుంది. టచ్ కూడా వేగంగా స్పందిస్తుంది. స్క్రీన్ గీతలు పడకుండా ఉండడం కోసం గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది.
  • ఎటువంటి తయారీదారు మార్పులు లేకుండా శుద్దమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం దీనితో వస్తుంది. మొదట కొన్నవారికి ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఒయస్ వచ్చింది. తరువాత 4.4.2 కిట్‌కాట్ కి అప్‌డేట్ వచ్చింది. తొందరలో 4.4.4 అప్‌డేట్ ఇస్తున్నట్టు మోటోరోలా ప్రకటించింది. ఈ మధ్య కొన్న వారికి ఫోన్‌ తోనే నేరుగా 4.4.2 కిట్‌కాట్ వస్తుంది. గూగుల్ నెక్సస్ తరువాత మోటో శ్రేణి ఫోన్‌లకే ముందుగా అప్‌డేట్ వస్తున్నాయి.
  •  రెండు జియస్‌యం సిమ్‌లు పెట్టుకోవచ్చు. సిమ్‌ మైక్రోసిమ్‌ వాడవలసి ఉంటుంది. ఫోను 2జి మరియు 3జి నెట్‌వర్క్‌కి మద్దతునిస్తుంది. ఫోన్ స్పీకర్ మనకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. లౌడ్ స్పీకర్ కూడా బిగ్గరగా మరియు స్పష్టంగా వినిపిస్తుంది. 
  • ముందు 1.2 మరియు వెనుక 5 మెగాపిక్సెల్ కెమేరా యల్‌యిడి ఫ్లాష్‌తో ఉన్నాయి. హెచ్‌డిఆర్, పనోరమా, బరస్ట్ మోడ్ మరియు స్లోమోషన్, 720 హెచ్‌డి వీడియో రికార్డింగ్ వంటి అధనపు సదుపాయాలు ఉన్నాయి.
  • వైఫి, బ్లూటూత్, ఎఫ్‌యం రేడియో మరియు మైక్రో యుయస్‌బి (కంప్యూటరుకు అనుసందానించుకోవడానికి) ఉన్నాయి.
  • బ్యాటరీ 2070 యమ్‌ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ సులభంగా మనకు ఒకరోజు వస్తుంది. నేను వాడినదాన్ని బట్టి మనం ఫోను మాత్రమే వాడితే రెండురోజులు మరియు గంట గేమ్స్ ఆడండం, గంట పాటలు వినడం, మూడు గంటలు నెట్‌ వాడుకోవడం సుమారు గంట ఫోన్‌ మాట్లాడడం చేస్తే ఒకరోజు చార్జింగ్ వస్తుంది. బ్యాటరీ మనం మార్చుకోలేము సర్వీస్ సెంటరుకి తీసుకొని వెళ్ళాల్సిందే.
  • ఒక సంవత్సరం తయారుదారు వారెంటి ఉంటుంది. మొదట ఉమ్మడి రాష్ట్రంలో మూడు సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉండగా ఉప్పుడు పది వరకు అయ్యాయి తొదరలో ఇంకా పెంచబోతున్నారని వార్తలలో వచ్చింది. సర్వీస్ సెంటర్ల చిరునామాలు ఇక్కడ చూడవచ్చు.
  • ఫోన్‌ని మనం ఫ్లిప్‌కర్ట్ (ఇక్కడ) నుండి మాత్రమే కొనుగోలు చేయగలము. ఫోన్‌తో పాటు చార్జర్ మరియు హెడ్‌ఫోన్స్ వస్తాయి.
  • చివరగా ముఖ్యమైనది ఫోన్‌కి మోటోరోలా పెట్టిన క్యాప్షన్ "ఎక్షెప్షనల్ ఫోన్ ఫర్ ఎక్షెప్షనల్ ప్రైస్" కి మరియు మనం పెట్టే డబ్బులకి పూర్తి న్యాయం చేస్తుంది అని ఆరు నెలలు వాడిన తరువాత కూడా చెప్పగలుగుతున్నా. నేనె కాదు వాడినవాళ్ళు చాలా మంది వ్రాసిన సానుకూల విశ్లేషణలు మనం ఫ్లిప్‌కార్ట్‌లో చూడవచ్చు.