మోటో జి ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించే ఫోన్. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ మరియు ఫ్లిప్‌కార్ట్‌కి జీవం, మోటోరోలాకి భారతదేశంలో పునర్జీవం అందించిన ఫోన్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మోటో జి/ఇ తో తమ మొదటి ఆన్లైన్ కొనుగోలు మొదలుపెట్టారు. మామూలు ఫోన్లలా అన్ని దుకాణాలలో కాదు బయట ఎక్కడా దొరకదు,
టివీలలో దానికి సంబందించిన ప్రకటనలు కనిపించవు, మన దేశంలో ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లోనే అమ్మబడుతుంది, దేశియ మరియు విదేశియ ఫోన్లు మార్కెట్‌ని ముంచెత్తుతున్న వేళ మనం ఇంచుమించుగా మరిచిపోయి సోదిలోలేని మోటోరోలా కంపెనీ ఫోన్ ఎందుకంత జనాధరణ పొందింది ఇదెలా సాధ్యం అయింది. దీనికి గల పలు కారణాలు.
టివీలలో దానికి సంబందించిన ప్రకటనలు కనిపించవు, మన దేశంలో ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లోనే అమ్మబడుతుంది, దేశియ మరియు విదేశియ ఫోన్లు మార్కెట్‌ని ముంచెత్తుతున్న వేళ మనం ఇంచుమించుగా మరిచిపోయి సోదిలోలేని మోటోరోలా కంపెనీ ఫోన్ ఎందుకంత జనాధరణ పొందింది ఇదెలా సాధ్యం అయింది. దీనికి గల పలు కారణాలు.
తమ్ముడు అన్నలతో మోటో జి |
- మొదట చెప్పుకోవలసినది కొనుగోలుదారుడు సంతృప్తి: ఇంటర్నెట్ యాడ్స్ ద్వారా మొదట ప్రచారం జరిగినప్పటికి తరువాత కేవలం వినియోగదారుని నోటిమాట ద్వారా రెట్టింపు ప్రచారం జరిగింది.
- చవకైన ధరలో మంచి స్పెసిఫికేషన్లు కలిగిఉండడం: ఇంచుమించు ఈ ఫొన్ లాంటి స్పెసిఫికేషన్ ఉన్న మంచి బ్రాండ్ ఫోన్ కొనడానికి దీనికన్నా సుమారు ఐదు నుండి పదివేలు ఎక్కువ పెట్టాల్సి రావడం. కొన్ని దేశియ ఫోన్లు ఇంకా తక్కువ ధరలో దీనికన్నా ఎక్కువ స్పెసిఫికేషన్ ఇస్తున్నప్పటికి ఈ ఫోన్లా కాకుండా చిన్న వాడకానికే వేడెక్కడం,బ్యాటరీ బ్యాకప్ సరిగా లేకపోవడం, చీటిమాటికి హ్యాంగ్ అవడం వంటి పలు సమస్యలు ఉండడం, అప్డేట్లు లేకపోవడం, చూడడానికే తక్కువ రకం ఫోన్లలా కనిపించడం వంటి పలు కారణాల వలన బ్యాటరీ వాడుకరి మార్చలెకుండా ఉండడం, యస్‌డి కార్డ్ స్లాట్ లేకపోవడం వంటి పరిమితులు మోటో జి లో ఉన్నప్పటికి జనాలు మోటో జి వైపుకి మొగ్గు చూపడం జరిగింది.
- గూగుల్: మోటోరోలాని కొన్న తరువాత (తరువాత లినోవోకి అమ్మివేసాడు) ఫోన్ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన మార్పు.
- శుద్దమైన ఆండ్రాయిడ్: మిగిలిన ఫోన్ల మాదిరి తయారీదారుడికి సంబందించిన అనవసర సాఫ్ట్వేర్లు లేకపోవడం.
- అప్డేట్స్: గూగులోడి నెక్సస్‌కు సమానంగా కొత్త వెర్షన్ అప్డేట్స్ రావడం.