పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి గొప్ప అవకాశం!

మీరు తెలిసో తెలియకో  పైరేటెడ్ సాఫ్ట్వేర్ బారిన పడి ఉండవచ్చు. జాగ్రత్త! క్రింది లక్షణాలను ఆధారంగా ఒకసారి తనిఖీ చేసుకోండి.

లక్షణాలు:

  1. నా కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టం కొరకు 5000 నుండి 10000ల రూపాయలు వెచ్చించలేదు. 
  2. ప్రొడక్టివిటి సూట్ (ఆఫీస్, ఫోటో ఎడిటింగ్ తదితరాలు) కి అదనంగా మరొక 5000 నుండి 10000ల రూపాయలు వెచ్చించలేదు.
  3. నా కంప్యూటరు కొన్నపుడు దానితో పాటు ఆపరేటింగ్ సిస్టం లేదు. ఉన్నా నా కంప్యూటరు డబ్బాపై ఆపరేటింగ్ సిస్టంకి సంబందించిన వివరాలు తెలిపే కాగితం అతికించబడి లేదు.
  4. నా కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టం చెడిపోయినపుడు నేను స్థానిక కంప్యూటరు దుకాణం నందు 100 నుండి 500ల రూపాయలలో ఆపరేటింగ్ సిస్టంని తిరిగి పొందగలుగుతున్నాను. 
  5. జన్యున్ మెసేజ్ లతో విసుగొచ్చింది. లేదా వివిధ పద్దతులు ప్రయత్నించి జన్యున్ మెసేజ్ రాకుండా చేయగలిగాను.
పైన లక్షణాలలో ఏ ఒక్కటైనా మీకు సరిపోతే మీరు పైరేటెడ్ సాఫ్ట్వేర్ బారినపడినట్లే. పరవాలేదు ఏదోకటి అనుకొంటే క్రింద నష్టాలు కూడా ఒకసారి చూడండి.

నష్టాలు:

  1. జన్యున్ మెసేజ్ రాకుండా చేయడానికి సమయం వృదా చేయాలి.
  2. విలువైన సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోవడం వలన భద్రతాపరమైన సమస్యలు ఎదురుకావడం, కొత్త విశిష్టతలు వాడుకోలేకపోవడం.
  3. నైతికత  
పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి ఎదురుచుస్తున్నారా అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే. పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి విముఖంగా ఉన్నవారు కూడా చూడవచ్చు.

ఉబుంటు 12.04 దీర్ఘకాలిక మద్దతు 

ఉబుంటు 12.04 రేపు(26.04.2012) విడుదల కాబోతుంది. ఉబుంటు అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.మరిన్ని వివరాలకు ఉబుంటు అధికారిక సైట్ ని సందర్శించండి.