సాధారణంగా విండోస్లో మాత్రమే అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్ళు ప్లే అవుతాయి ఉబుంటు మరియు మిగిలిన లినక్సు పంపకాలలో ప్లే కావు అని అనుకోవడం వలన ఉబుంటు లాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు వాడడానికి వెనకాడతారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కగా మనం అన్నిరకాల ఆడియో మరియు వీడియోలు వినవచ్చు, చూడవచ్చు.
విండోస్ ఇన్స్టాల్ చేయగానే mp3, విండోస్ మీడియా ఫార్మాట్ లో ఉన్న ఫైళ్ళు మాత్రమే ప్లే అవడం, తరువాత కోడెక్ పేక్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన మిగిలిన ఫార్మాట్లు (.mkv, .mp4, .avi) కూడా ప్లే కావడం మనం గమనించవచ్చు. అదేవిధంగా లినక్సు ఆదారిత ఆపరేటింగ్ సిస్టంలలో కూడా ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ మీడియా ఫార్మాట్లో ఉన్న ఫైళ్ళు(.ogg) ప్లే అవుతాయి. విండోస్లో మాదిరిగానే అదనపు కోడెక్లు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఫార్మాట్లు కూడా ప్లే చేసుకోవచ్చు. కోడెక్ ల కోసం వెతికే అవసరం లేకుండా నేరుగా ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ ని తెరిచి సెర్చ్ బాక్స్ లో Ubuntu restricted extras అని టైపు చేసినపుడు క్రింది చిత్రంలో వలే Ubuntu restricted extras అన్న సాప్ట్వేర్ కనిపించును. దానిని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనం అన్నిరకాల ఆడియో, వీడియో ఫైళ్ళు ప్లే చేసుకోవచ్చు.
Ubuntu restricted extras ఇన్స్టాల్ చేయడం వలన అదనపు కోడెక్లు మాత్రమే కాకుండా ఫ్లాష్ ప్లేయర్, జావా, మైక్రోసాఫ్ట్ ఫాంట్ లు మరియు .rar ఫైళ్ళు తెరుచు కోవడానికి కావలసిన మద్దతు ఇన్స్టాల్ చేయబడుతాయి.