మీ డీవీడీ ప్లేయర్ కి తగిన వీడియో డిస్కులు మీకు నచ్చిన విధంగా సులభంగా తయారుచేసుకోవడానికి

మనదగ్గర ఉన్న వీడియోలు ఏ ఫార్మాట్ లో ఉన్నా కూడా మన డీవీడీ ప్లేయర్ లో ప్లే అయ్యే విధంగా, మనకు నచ్చిన విధంగా వీడియో డిస్కులు తయారుచేయడానికి DeVeDe అను ఓపెన్ సోర్స్ అప్లికేషన్ ని వాడవచ్చు. దీనిని ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ వాడేవారు ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

విశిష్టతలు : 

  • వీడియో సీడి, వీడియో డీవీడీ, సూపర్ వీడియో సీడి, చైనా వీడియో సీడి మరియు DIVX / MPEG-4 డిస్కులు తయారుచేయవచ్చు.
  • నచ్చినట్లు మెనూ, మెనూ శీర్షికలు దాని ఫాంట్ మరియు మెనూ వెనుకచిత్రాన్ని మార్చుకోవచ్చు.
  • చలన చిత్రం యొక్క వీడియో మరియు ఆడియో అమరికలను మార్చుకోవచ్చు.
  • మార్చుకున్న సెట్టింగులను ముందే సరిచూసుకోవచ్చు.
  • చలన చిత్రాన్ని అద్యాయాలుగా విభజించవచ్చు.
  • ఉప శీర్షికలు(Subtitles) కి మద్దతు.
మొదట Title ని తరువాత Title లో వీడియో ఫైల్ ని Add చేసుకొని (ఒకటి అంతకంటే ఎక్కువ Titles మరియు ఫైల్స్ ని కూడా Add చేసుకోవచ్చు.) మెనూ ఆప్షన్స్ లోకి వెళ్లి వాటిని సెట్ చేసుకొని Forward ని నొక్కినపుడు ఒక ఇమేజ్ ఫైల్ ని తయారుచేయును. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ ఇమేజ్ ఫైల్ ని మనం ఏదైనా డిస్క్ బర్నింగ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి సీడి / డీవీడీ లో వ్రాసుకోవచ్చు. అతరువాత ఈ డిస్క్ని మన కంప్యుటర్ లేదా డీవీడీ ప్లేయర్ లలో కూడా చూసుకోవచ్చు.