బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ పరిచయం చెయ్యక్కరలేని పేర్లు. చదువుకున్నవారికి కాస్త కంప్యూటరు పరిజ్ఞానం ఉన్నవారికి కూడా తప్పకుండా తెలిసిన పేర్లు. తమ ఉత్పత్తుల ద్వారా బాగా సంపాదించడమే కాకుండా ప్రముఖులుగా వెలుగొందుతున్నవారు. కంప్యూటరు, మొబైళ్ళలో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు అగ్రగామిగా ఉన్నాయి. అలాగే గూగుల్, ఫేస్‌బుక్
యజమానులు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే వీళ్ళే కాకుండా సంపాదన, పేరుప్రఖ్యాతులు లేని టెక్నాలజీని సామాన్యులకి అందుబాటులోకి తేవడానికి కృషి చేసినవారు అజ్ఞాతంగా చాలా మందే ఉన్నారు.
యజమానులు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే వీళ్ళే కాకుండా సంపాదన, పేరుప్రఖ్యాతులు లేని టెక్నాలజీని సామాన్యులకి అందుబాటులోకి తేవడానికి కృషి చేసినవారు అజ్ఞాతంగా చాలా మందే ఉన్నారు.
ప్రపంచంలో ఎక్కువ పరికరాల్లో వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంలో, ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో, ఇంటర్ నెట్‌లో ఎక్కువ సర్వర్లలో వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టములలో మరియు సూపర్ కంప్యూటర్లలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో వెన్నుముకగా ఉన్న సాఫ్ట్‌వేర్ తయారుచేసిన అతను ఎంత సంపాదించి ఉంటాడో అతనికి ఎంత పేరు ఉంటుందో. దానికి వ్యతిరేకంగా అలాంటి వ్యక్తి కుభేరుడు కాదు, పైన చెప్పిన వారిలా అందరికి తెలిసిన ప్రముఖుడు కూడా కాదు. ఇప్పటికి అతిసామాన్యుడిలా సాఫ్ట్‌వేర్ అభివృధ్దిలో కీలకంగా పనిచేస్తుఉన్న అతనే లినస్ టోర్వాల్డ్స్. ఆ సాఫ్ట్‌వేరే లినక్స్ కర్నల్. ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతు, స్మార్ట్‌ఫోన్‌లను సామాన్యులకు చేరువగా తెచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కూడా ఈ లినక్స్ కర్నల్ ఆధారితంగా నిర్మించబడింది. ఈనాడు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఇంటర్ నెట్ సర్వర్లలో కూడా లినక్స్ ఆపరేటింగ్ సిస్టములదే అగ్రస్థానం.
లినస్ టోర్వాల్డ్స్ |
అంతగా ప్రాచూర్యం పొందిన సాఫ్ట్‌వేర్ తయారుచేసిన లినస్ పెద్దగా సంపాదించలేకపోవడానికి కారణం ఆయన తన ఉత్పత్తిని జీ యన్ యూ ప్రజా లైసెన్సు ద్వారా విడుదలచేయడమే.దీని ద్వారా విడుదల చేసిన సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్ అందరికి అందుబాటులో ఉంటుంది. ఆ సోర్సు కోడును ఉపయోగించుకోని అభివృద్ధిచేయబడిన ఇతర ఉత్పత్తులు కూడా జీపీయల్
ద్వారా మాత్రమే విడుదల చేయాలని ఈ జీపియల్ లైసెన్సు నిర్దేశిస్తుంది. దానివలన టెక్నాలజీ పేటెంట్ల రూపంలో ఒక్కరి గుప్పెట్లో ఉండకుండా ఉచితంగా ప్రజాప్రయోజనకారిగా అందరికి అందుబాటులో ఉంటుంది.
లినస్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకోలేక పోయినప్పటికి మనం రోజు వాడుతున్న ఇంటర్ నెట్ రూపంలో, ఆండ్రాయిడ్ ఫోన్‌ల రూపంలో పరోక్షంగా మనకి చేరువగా ఉన్నట్లే.