ఉబుంటు కూడా చాలా స్వేచ్చా సాప్ట్వేర్ ల మాదిరిగానే తెలుగు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర స్థానికభాషలకు కూడా మద్దతునిస్తుంది. ఉబుంటులో తెలుగు చూడవచ్చు, వ్రాయనువచ్చు మరియు ఉబుంటును తెలుగులో వాడుకోవచ్చు.
తెలుగు చూడడానికి:
చాలా వెబ్ సైట్లు, యునికోడ్‌లో ఉన్న వెబ్ సైట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. కొన్ని వార్తపత్రికలు సొంత ఫాంట్లను వాడుతుంటాయి. వాడుకరి సహాయార్ధం వారు ఫాంట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఆ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకొని దానిని తెరచినపుడు క్రింది విధంగా కనిపించును.
ఉబుంటు లో ఫాంట్ ఇన్ స్టాల్ చేయడానికి ఉదాహరణ |
ఇన్స్టాల్ ఫాంట్ ని నొక్కినపుడు ఫాంట్ మన కంప్యుటర్ నందు ఇన్స్టాల్ అవుతుంది.అపుడు ఫైర్ఫాక్స్ ని తిరిగి ప్రారంభించినపుడు ఆయా సైట్ వెబ్ పేజీలు మనకు సరిగా కనిపించును.
తెలుగు వ్రాయడానికి:
మొదట తెలుగు భాషకు మద్దతుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఉబుంటు లాంచర్ నందుగల System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి తెలుగుభాషకు మద్దతుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
మొదటిసారి Language Support ని తెరచినపుడు క్రిందివిధంగా అడుగుతుంది.
ఇన్స్టాల్ ని నొక్కిన తరువాత పాస్వర్డ్ అడుగును. పాస్వర్డ్ ని ఇవ్వగానే డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని క్రింది విండో తెరవబడును.
Install/Remove Languages ని నొక్కినపుడు మరొక విండో తెరవబడును. అక్కడ తెలుగు ని ఎంచుకొని Apply Changes ని నొక్కినపుడు తెలుగుభాషకు మద్దతు మన కంప్యుటర్లో స్థాపించబడును.
తరువాత System Settings లో ఉన్న Keyboard ని తెరిచి Layout Settings లోకి వెళ్ళాలి.
+ ని నొక్కడం ద్వారా మరొక విండో తెరవబడును. అక్కడ పెట్టెలో తెలుగు అని టైప్ చేసినపుడు పైన పెట్టెలో తెలుగు కనిపించును. Add ని నొక్కినపుడు ప్యానల్లో కీబోర్డ్ గుర్తుని చూపించును. అక్కడనుండి మనం ప్రతిసారి కీబోర్డ్ లేఅవుట్ ని మార్చుకోవచ్చు. ప్యానల్లో కీబోర్డ్ గుర్తుని నొక్కి తెలుగును ఎంచుకొని తెలుగులో టైప్ చేసుకోవచ్చు.
మనకి అలవాటు అయ్యేవరకు తెలుగు కీబోర్డ్ లేఅవుట్ ని చూసుకొంటూ టైపు చేసుకోవచ్చు.
తెలుగు కీబోర్డ్ లేఅవుట్ |
తెలుగు లో వాడుకోవడానికి:
ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంని తెలుగులో కూడా వాడుకోవచ్చు. పైన చూపించిన విధంగా తెలుగుభాషకు మద్దతుని ఇన్స్టాల్ చేసుకోన్న తరువాత System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి అక్కడ చూపించబడిన భాషలలో తెలుగును లాగి (డ్రాగ్ చేసి) ప్రాధాన్యతక్రమంలో మొదట ఉంచవలెను.
ఆతరువాత సిస్టంని లాగ్అవుట్ చేసి మరలా లాగిన్ కావాలి. అప్పుడు క్రింది చిత్రాలలో చూపించినట్లు మెనూ మరియు డాష్ లో తెలుగు కనిపించును.
తెలుగులో మేనూలు |
తెలుగులో డాష్ |
ఉబుంటుని తెలుగులో ఉపయేగిస్తున్నపుడు అక్కడక్కడా ఇంగ్లీష్‌లో కనిపించును. ఇంకనూ వాటి అనువాదాలు పుర్తికాకపోవడం వలన ఈవిధంగా కనిపించును. ఈఅనువాద పక్రియలో మీరుకూడా పాలుపంచుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పటికే అనువాదాలు చేస్తున్న ఒత్సాహికులను చూడవచ్చు, మనం కూడా వీరితో చేరి అనువాదాలు చేయవచ్చు.