ఫోన్ రూట్ చేయబోయే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

 ఆండ్రాయిడ్ ఫోన్ రూట్ అంటే ఏంటి? లాభాలు నష్టాలు, మన ఫోన్ ఇప్పటికే రూట్ చేయబడిందా లేదా ఎలా తెలుసుకోవాలి అన్న విషయాలు ముందు టపాలలో వివరించబడింది. ఈ టపాలో ఆండ్రాయిడ్ ఫోన్ రూట్ చేయబోయే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాము. రూటింగ్ సాధారణంగా అన్ని తయారుగా ఉంటే పది నిమిషాల్లో అయిపోతుంది. అంతగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా చేసుకోవచ్చు. అంతా సవ్యంగా జరగాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

  • మన ఫొన్ యొక్క మోడల్ నంబర్, ఆండ్రాయిడ్ వెర్షన్, బిల్డ్ నంబర్ వంటి వివరాలు వ్రాసి పెట్టుకోవాలి. సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లో ఈ వివరాలు ఉంటాయి. 
  • ప్రతి ఫోన్ కి , ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్ కి వేరువేరు రూటింగ్ పద్దతులు ఉంటాయి కనుక మన ఫోన్ కి సరిపడే తాజా పద్దతిని నెట్ లో వెతికి పట్టుకోవాలి.
  • ఫోన్ రూటింగ్ ని వివరించే సైట్లు చాలా ఉన్నా XDA డెవలపర్స్ సైనోజెన్ మోడ్ వంటి నమ్మకమైన సైట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
  • మనం ఫోన్ రూటింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నాము అన్నది ఖచ్చిత మైన అవగాహన ఉండాలి. మనం రూటింగ్ చెయ్యాలన్న కారణం అది మన ఫోన్లో పనిచేస్తుందా అన్నది కూడా ముందే తెలుసుకోవాలి. ఉధాహరణకు మనం కస్టం రాం ఇన్ స్టాల్ చేయాలనుకొంటే మన ఫోన్ కి సరిపడా రాం అందుబాటులో ఉందా అన్నది తెలుసుకోవాలి. వీలైతే ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అదే విధంగా రూటింగ్ , కస్టం రాం ఇన్ స్టాల్ చేయడానికి కావలసిన సాఫ్ట్వేర్లను మరియు  ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.
  • రూట్ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను గురించి ముందే అవగాహన పెంచుకోవాలి. దానివలన రూట్ చేసేటప్పుడు జరగరానిది జరగకుండా నివారించవచ్చు.
  • మన ఫోన్ కి సంబందించిన డ్రైవర్లను అంటే కంప్యూటర్ మన ఫోన్ ని గుర్తిచడానికి కావలసిన డ్రైవర్లను తయారిదారు వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్స్ లో యు.యస్.బి డిబగ్గింగ్ అన్న ఆప్షన్ ని ఏంచుకోవాలి.
  • రూట్ చేయడానికి ముందే ఫోన్ పూర్తిగా చార్జ్ చేసుకోవాలి.
  • రూట్ చేయబోయే ముందు మన కంప్యూటర్లో యాంటీ వైరస్ మరియు ఫైర్ వాల్ ను డిసేబుల్ చేసుకోవాలి.
  • చివరగా ముఖ్యమైనది రూట్ చేసేటప్పుడు పొరపాటు జరిగితే డాటా కోల్పోయే అవకాశం ఉంది కనుక ఫోన్ నంబర్లు, మెసేజ్, అప్లికేషన్, ఫొటోలు, ఫోన్ స్టోరేజి లో ఉన్న అన్ని ముఖ్యమైన ఫైళ్ళని బాక్ అప్ తీసుకోవాలి.