సాధారణంగా ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కి ఫైళ్ళను పంపించుకోవడానికి మనం బ్లుటూత్ వాడుతుంటాము. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు ప్రతిసారి డౌన్‌లోడ్ చేసుకోకుండానే మరొక ఫోన్ నుండి పంపించుకోవడానికి బ్లుటూత్ ఆధారిత అప్లికేషన్‌లను వాడుతుంటాము. అయితే ఎక్కువ పరిమాణం గల ఫైళ్ళను లేదా అప్లికేషన్‌లను ఇలా బ్లుటూత్ ద్వారా
పంపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువంటప్పుడు మన ఫోన్‌లో ఉన్న వైఫిని ఉపయోగించుకుంటే మనం బ్లుటూత్ కన్నా 40 రెట్లు వేగంగా ఫైళ్ళను పంపించుకోవచ్చు. దీనిని మనం ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే లినోవో వారి షేర్ ఇట్ అన్న యాప్ ని ఉపయోగించి సులభంగా చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మనం మరొక ఆండ్రాయిడ్ ఫోను లేదా టాబ్లెట్, ఐఫోను, ఐ పాడ్ మరియు వైఫి ఉన్న విండోస్ కంప్యూటరుకి కూడా వేగంగా ఫైళ్ళను పంపించుకోవచ్చు.
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి ఫొటోలు, పాటలు, సినిమాలు, కాంటాక్ట్‌లు, అప్లికేషన్‌లు మరియు ఎటువంటి పైళ్ళనైనా సులభంగా వేగంగా పంపించుకోవచ్చు.
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి పెద్ద ఫైళ్ళను కూడా బ్లుటూత్ కన్నా సుమారు 40 రెట్ల వేగంతో పంపవచ్చు. అంతేకాకుండా దీనిని ఉపయోగించి ఒక ఫైలును ఒకేసారి ఐదు పరికరాలకి పంపించవచ్చు. అలాగే ఈ అప్లికేషన్‌లో ఉన్న క్లోన్‌ఇట్‌ని ఉపయోగించి ఒకఫోన్ నుండి ఒకేసారి మరొక ఫోన్‌కి ఫొటోలు, పాటలు, సినిమాలు, కాంటాక్ట్‌లు, అప్లికేషన్‌లు మరియు యస్‌యమ్‌ఎస్‌లు పంపించుకోవచ్చు.