2000 రూపాయలకే స్మార్ట్‌ఫోన్

స్మార్ట్‌ఫోన్ తయారీదారులను విశేషంగా ఆకట్టుకుంటున్న భారత విపణిలోకి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కంపెనీలన్ని భారతదేశంలో విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న దిగువ మరియు మధ్య శ్రేణి విపణిని లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లదే
అగ్రస్థానం. గూగుల్ 6000 రూపాయలలో నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌లు తేవాలని దేశియ కంపెనీలతో జట్టుకట్టి  ఆండ్రాయిడ్ వన్ అన్న ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే ఇప్పుడు ప్రముఖ వెబ్ బ్రౌజర్ పైర్‌ఫాక్స్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతో మరింత చవకైన ఫోన్‌ను భారతదేశంలో విడుదలచేసింది. 

స్పైస్ ఫైర్ వన్
స్పైస్ కంపెనీ ఈ రోజు విడుదలచేసిన ఈ ఫోను స్పైస్ ఫైర్ వన్ Mi – FX 1. ఈ ఫోను ఖరీదు 2,299 రూపాయలు. 3.5 ఇంచుల తాకేతెర, 2 మెగాపిక్సెళ్ళ వెనుక, 1.3 మెగాపిక్సెళ్ళ ముందు కెమేరాలు, 1 GHz ప్రాససర్, డ్యూయల్ సిమ్‌ మరియు 2G నెట్‌వర్క్ మద్దతు గల ఈ ఫోను భారతీయ భాషలకు కూడా మద్దతునిస్తుంది.
ఈ నెల 25 సోమవారం నాడు ఇన్‌టెక్స్ కూడా క్లౌడ్ యఫ్‌యక్స్ అన్న ఫైర్‌ఫాక్స్ ఒయస్ ఆధారిత ఫోన్‌ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీని ఖరీదు 2000 రూపాయల లోపు ఉండవచ్చు.