ఆపిల్ అంటే అదో ఖరీదైన బ్రాండ్. ఫోన్, టాబ్, డెస్క్ టాప్ మరియు లాప్ టాప్ అన్ని పరికరాలు వాడి సొంత ఆపరేటింగ్ సిస్టం మాక్ తో పాటు వస్తుంటాయి. మనం మాక్ ఆపరేటింగ్ సిస్టం కావాలంటే తప్పనిసరిగా వాడి పరికరాలను కొనాలి లేదా మాక్ ఒయస్ ని కొనుక్కోవాలి. మనం వాడుతున్న డెస్క్ టాప్, లాప్ టాప్ లేదా టాబ్లెట్ లో మాక్ ని ఇన్ స్టాల్ చెసుకోవాలంటే మరి మాక్ ని కొనుక్కోవలసిందేనా?
కొనుక్కోనవసరం లేకుండానే మాక్ లాంటి ప్రయామ్నాయాన్ని ఉచితంగా ఎవరైనా వారి కంప్యూటర్లు మరియు లాప్ టాప్ లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆ ప్రత్యామ్నాయం పేరే పియర్ ఒయస్. నిన్ననే విడుదలైన పియర్ ఒయస్ 8 ని ఎవరైనా ఉచితంగా డౌంలోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. ఇది ఇంచుమించుగా మాక్ లానే ఉంటుంది కాని ఇది ప్రముఖ లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లైన ఉబుంటు మరియు డెబియన్ ఆధారంగా తయారుచేయబడింది.
ఆకర్షణీయమైన రూపంతో మాక్ ని తలపించేలాఉండే ఈ పియర్ ఒయస్ తో మనకి కావలసిన అన్ని కొడెక్ లు మందే ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. దీనిని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పియర్ ఒయస్ 8 |
పియర్ ఒయస్ కి సంబందించి మరిన్ని చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.