వెబ్ పేజిని మొత్తం ఫొటో తియడానికి

 సాధారణంగా మనం కంప్యూటర్ తెరపై ఉన్నదాన్ని ఫోటో తీయడానికి మన కీబోర్డ్ లో ఉన్న ప్రింట్ స్క్రీన్ ను ఉపయోగిస్తుంటాము. మనం ఏదైనా ఒక వెబ్ పేజిని చూస్తున్నపుడు ప్రింట్ స్క్రీన్ ను ఉపయోగించి ఫొటో తీస్తే అది మనకు తెర మీద కనిపించే వెబ్ పేజి యొక్క భాగాన్ని మాత్రమే ఫొటో తీస్తుంది. మనం వెబ్ పేజి మొత్తాన్ని ఫొటో తీయాలంటే ఎలా?
 షట్టర్ అనే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మనం సులభంగా వెబ్ పేజి మొత్తాన్ని ఫొటో తీయవచ్చు. షట్టర్ అనేది శక్తివంతమైన ఆధునికమైన స్క్రీన్ షాట్లు తీయడానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్. దీనిని ఉపయోగించి  పూర్తి డెస్క్ టాప్, విండో, డెస్క్ టాప్ లో ఎంచుకున్న మేర స్క్రీన్ షాట్ తీయడమే కాకుండా తీసిన స్క్రీన్ షాట్లను మనకు కావలసినట్లు మార్చుకొని నేరుగా వివిధ ఆన్ లైన్ ఫొటో వెబ్ సైట్లకి ఎగుమతి చేయవచ్చు. షట్టర్ ని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
 షట్టర్ ని మనం ఇన్ స్టాల్ చేయునపుడు ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ లో గ్నోం వెబ్ ఫొటో అన్న యాడ్ ఆన్ ని ఎంచుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఎలా అన్నది ఈ చిత్రంలో చూడవచ్చు.
ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి షట్టర్ ని ఇన్ స్టాల్ చేయడం
 షట్టర్ ని ఇన్ స్టాల్ చేసిన తరువాత క్రింద చిత్రాలలో చూపినట్లు చేయడం ద్వారా మనం మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయవచ్చు.
షట్టర్
షట్టర్ ని ఉపయోగించి మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయడం
 మనం వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించకుండానే మనకి కావలసిన వెబ్ చిరునామాను ఇక్కడ ఇవ్వడం ద్వారా మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయవచ్చు. షట్టర్ తోతీసిన పూర్తి వెబ్ పేజిని ఇక్కడ చూడవచ్చు.
షట్టర్ తో తీయబడిన బ్లాగు మొత్తం స్క్రీన్ షాట్