మన రక్తంలో ఇంకిపోయిన సంస్కృతి

 పైరేటెడ్ అన్నది మనకు తెలియంది కాదు. అది అనాదిగా వస్తున్న మన ఆచారం. ఇప్పుడు అది కొత్త పుంతలు తొక్కింది. విడుదలకి ముందే పైరేటెడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది బాగా వారికి దగ్గరి వారివల్లే అవుతుంది. అదెలా ఉన్నా సాఫ్ట్ వేర్ పైరసి దీనికి ఎన్నో రెట్లు పెద్దది. దానికి పరిష్కారం ఒక్క ఒపెన్ సోర్స్ మాత్రమే. ప్రజల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్న ఆధార్ కేంధ్రంలో ఉన్న కంప్యూటర్ లో కూడా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం. ముఖ్యంగా ప్రజల బధ్రత కోసం చేపట్టిన ఆధార్ పరమార్ధం నెరవేరినట్లేనా. ఈ చిన్న ఉధాహరణ చాలు మనం ఎక్కడున్నామో చెప్పడానికి.
 ఈ రోజుల్లో ఎన్నో ఆపరేటింగ్ సిస్టం లు మనకి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికి ఇంకా మనం ఆపరేటింగ్ సిస్టం లు కొనుక్కోవలసిన అవసరం తప్పటంలేదు. దీనికి కారణం అనేక అపోహలు, లేని పోని ప్రచారాలు అని వేరే చెప్పక్కరలేదు. ఎన్నో ఉచిత ఆపరేటింగ్ సిస్టం లు మనకి అందుబాటులో ఉన్నప్పటికి పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడడానికే జనాలు మొగ్గు చూపడం మనం ఒప్పుకోవలసిన విషయం. ధనవంతమైన కంపెనీల మార్కెట్ విస్థరణ ప్రణాళికలలో భాగంగా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకరులు కంపెనీలకు ప్రచార సాధనాలుగా మారుతున్నారు. పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడడంలో మనదే అగ్రతాంబూలం అన్నది కఠోర సత్యం. ఉచితంగా దొరుకుతున్న దానిపై మనకు చులకన, దొంగదానిపై మోజు ఎక్కువ. 
 ఇది ఇలా ఉంటే తాము వాడుతున్నది పైరేటెడ్ సాఫ్ట్ వేర్ అని, తామువాడే దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలియక చాలామంది పైరేటెడ్ సాఫ్ట్ వేర్ కి గురవుతున్నారు. పైరేటెడ్ సాఫ్ట్ వేర్ కి బలైన వారిని, ఇంకా బలి కాకుండా కాపాడడానికే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ల గురించి అందరికి తెలుగులో తెలియచెప్పడానికే ఈబ్లాగు. ఈ బ్లాగు ఉపయోగపడగలదని మీకు అనిపించినచో బ్లాగు యొక్క జి+ మరియు ఫేస్ బుక్ పేజిలను అందరికి పంచండి.